Wednesday, October 2, 2024

AP | జగన్‌కు చంద్రబాబు ఫోన్.. స్పందించని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రేపు (జూన్ 12) చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఇప్పటికే కొందరు ప్రముఖులకు ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ క్రమంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించగా… చంద్రబాబు ఫోన్‌ కాల్‌కు జగన్‌ అందుబాటులోకి రాలేదు.

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి సినీనటుడు చిరంజీవి, రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులకు ఆహ్వానం అందింది. రేపటి ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు, సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement