Tuesday, October 15, 2024

T20WC | కెనడాను ఆదుకున్న జాన్సన్… పాక్ ముందు ఈజీ టార్గెట్

టీ20 ప్రపంచకప్‌లో నేడు జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లు కెనడాను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా పాక్ పేసర్ల ధాటికి 106 పరుగులకే పరిమితమైంది. అయితే ఈ మ్యాచ్ లో భారీ షాట్లతో చెలరేగిన ఓపెనర్ ఆరోన్ జాన్సన్ (52) ఒంటిచేత్తో జట్టును ఆదుకున్నాడు. చివర్లో కెప్టెన్ సాద్ బిన్ జాఫర్ (10), కలీమ్ సనా (13 నాటౌట్) పరుగులు చేయడంతో కెనడా పాకిస్థాన్‌కు స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.

పాక్ బౌలర్లలో రవూఫ్, అమీర్ చెరో రెండు వికెట్లు తీయగా, నసీమ్ షా, షాహీన్ అఫ్రిదీ ఒక్కో వికెట్ తీశారు. దీంతో 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో పాకిస్థాన్ జట్టు బరిలోకి దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement