Monday, April 29, 2024

సమంత స్టన్నింగ్‌ పెర్ఫార్మె‍న్స్ వైరల్‌

టాలీవుడ్ నటి సమంత నటనతో పాటు డాన్స్ కూడా అద్భుతంగా చేయగలదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంత ఈ మధ్య డ్యాన్సింగ్ చాలెంజ్ స్వీకరించింది. బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ విసిరిన డ్యాన్స్‌ చాలెంజ్‌ను అవలీలగా పూర్తి చేసి సూపర్‌ అనిపించారు. ఆ చాలెంజ్‌కు సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాల్లో షేర్‌ చేసింది సమంత. 

YouTube video

‘ఎడుఆర్డో లుజ్‌క్వినోస్ డోంట్ ర‌ష్’ అనే పాట‌కు అద్భుత‌మైన స్టెప్పులు వేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అనుషా స్వామీ అనే మాస్టర్‌తో సమంత చేసిన బెల్లీ మూవ్‌మెంట్స్, స్టన్నింగ్‌ పెర్ఫార్మె‍న్స్ నెటిజ‌న్స్‌ను కట్టిపడేస్తోంది. ఈ కుందనపు బొమ్మ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. కాగా తనకు ఈ చాలెంజ్‌ ఇచ్చినందుకు విక్కీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం స‌మంత న‌టించిన ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తోపాటు గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శాకుంత‌లం అనే సినిమా చేస్తున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement