Friday, April 26, 2024

గుత్తా సుఖేందర్‌రెడ్డికి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం ఉదయం నిద్రిస్తున్న సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో ఆయన్ను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేయడంతో గుత్తా కోలుకున్నారు. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాలు రెండు చోట్ల మూసుకుపోయినట్లు వైద్యులు గుర్తించడంతో రెండు స్టంట్లు వేసినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్.. గుత్తా కుటుంబసభ్యులకు ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు. అటు మంత్రి జగదీష్‌రెడ్డి యశోద ఆస్పత్రికి వెళ్లి గుత్తాను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గుత్తాను పరామర్శించిన వారిలో మంత్రి వెంట‌ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిషోర్‌కుమార్‌, చిరుమర్తి లింగయ్య ఉన్నారు. కాగా ఇటీవలే గుత్తా సుఖేందర్ రెడ్డి నిమ్స్‌ ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement