Saturday, May 18, 2024

విజేత‌పై ఇంకా వివ‌క్షేనా…?

ప్రపంచంలో 270 కోట్ల మందికి ఉపాధిలో తప్పని తేడా
సగటున ప్రతి ముగ్గురిలో
ఒకరు లింగవివక్షకు గురి
చట్టసభల్లో నాల్గో వంతు భాగస్వామ్యానికే పరిమితం
కరోనా సవాలును
సమర్థంగా నిలువరించింది మహిళా పాలకులే

ఐక్యరాజ్య సమితి నివేదిక మేరకు ప్రపంచ వ్యాప్తంగా 270కోట్ల మంది మహిళలు పురుషులతో సమానంగా ఉపాధి అవకాశాల్ని ఎంపిక చేసుకోవడంలో వ్యత్యాసాలకు గురౌతున్నారు. 2019నాటికి ప్రపంచవ్యాప్త చట్టసభల సభ్యుల్లో మహిళల సంఖ్య 25శాతానికంటే తక్కువగా ఉంది. అలాగే ప్రపంచంలోని ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు లింగ ఆధారిత హింసకు గురౌతున్నారు. గతేడాది కోవిడ్‌ విజృంభించిన నేపథ్యంలో మహిళలు నాయకత్వం వహిస్తున్న దేశాలు, వ్యవస్థల్లోనే దీని నియంత్రణ వేగంగా నిర్వహించగలిగారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో మహిళలే సమష్టి నాయకత్వాన్ని సమర్ధవంతంగా ప్రదర్శించగలిగారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2021 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలన్న సందేశంతో నిర్వహిస్తున్నారు…

న్యూఢిల్లీ – మహిళలు ఎదుర్కొంటున్న విజయాలు, సమస్యల్ని ప్రస్ఫుటం చేసేలా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినో త్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. ఈ ఏడాది ఈ ఉత్సవం కోవిడ్‌ నేపథ్యంలో గత సంవత ్సరాలకు భిన్నంగా జరగ నుంది. కోవిడ్‌ మహమ్మారి నుంచి బయటపడ్డానికి వివిధ దేశాలు పలు రకాల ప్రయత్నాలు చేశాయి. అయితే మహిళల నాయకత్వంలో ఉన్న దేశాల్లోనే దీన్ని వేగంగా నియంత్రిం చగలిగారు. రికవరీ ప్రతిస్పందనలను రూపొందించడంలో మహిళా నాయకత్వం తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది. మహి ళలకు సమాన భవిష్యత్‌ను సాధించడంలో కోవిడ్‌-19 నియం త్రణ విధాన రూపకల్పన నిరూపించింది. ఈ నేపథ్యంలో మహిళలకు అన్నిరంగాల్లో సమాన హక్కుల కోసం విప్లవా త్మక అడుగులేస్తూ మహిళల పురోగతిని నిరోధించే సాంస్కృ తి, సామాజిక, ఆర్థిక అవరోధాల్ని విచ్ఛిన్నం చేసే చర్యలపై ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం దృష్టి పెట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మహిళలు నిర్దేశిత వేతనం కంటే తక్కువ పొందుతున్నారు. హానికలిగించే పరి స్థితుల్లో పని చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి చేపట్టిన ఒక అభి వృద్ధి కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఈ దుర్భలత్వాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. మార్చి 8న మహిళల సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక విజయాలకు ప్రతీకలుగా వివిధ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. లింగ సమాన త్వాన్ని సాధించేందుకు పిలుపునివ్వనున్నారు. మహిళల భద్రత, వేధింపుల నివారణకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా పలు చైతన్యపూరిత కార్యక్రమాల్ని నిర్వ హించనున్నారు. జీవితంలోని ప్రతి నడకలో మహిళలు పోషించిన అసాధారణ పాత్రను ప్రతిబింబిస్తూ మహిళల ధైర్యం, సంకల్ప చర్యలను ప్రశంసించడానికి వేడుకలు నిర్వ హించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు గొప్ప పురొగతి సాధించాయి. కానీ లింగ సమానత్వం ఆ దేశాల్లో కూడా నెరవేరని కలగానే మిగిలింది. కొన్ని దేశాలు మార్చి 8న మహి ళలకు సెలవు దినాన్ని అమలు చేస్తున్నాయి.
మహిళా దినోత్సవం అమెరికాలో పుట్టిందని పలువురు విశ్వసిస్తారు. వాస్తవానికి ఆ దేశంలో మహిళా దినోత్సవాన్ని పెద్దగా ఆచరించరు. ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి కంబోడియా వరకు గల దేశాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగా ల్లో మహిళల హక్కులు, విజయాల్ని అధికారికంగా గౌరవిస్తు న్నాయి. ఐక్యరాజ్య సమితి 1975 నుంచి అంతర్జాతీయ మహి ళా దినోత్సవాన్ని ఓ సంప్రదాయంగా అమలు చేస్తోంది. అయి తే ఈ దినోత్సవ మూలాలు అంతకంటే చాలా ముందు నుంచే ఉన్నాయి. 20వ శతాబ్దం ప్రారంభంలో సోషలిస్ట్‌ ఉద్యమాల నేపథ్యంలో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆవిర్భ వించింది. 1908 ఫిబ్రవరిలో న్యూయార్క్‌ నగరంలో జరిగిన మహిళా వస్త్ర కార్మికుల సమ్మె ఈ మహిళా దినోత్సవానికి ప్రేర ణగా నిల్చింది. అప్పట్లో మహిళా సిబ్బంది, కూలీలకు పురుషులతో పోలిస్తే చాలా తక్కువ వేతనాలిచ్చేవారు. వీటితో పాటు లైంగిక వేధింపులకు కూడా గురిచేసేవారు. ఏడాది పా టు న్యూయార్క్‌లో ఈ మహిళల ఉద్యమం కొనసాగింది. దీనికి వార్షికోత్సవాన్ని కూడా నిర్వహించనున్నారు. అదే సం దర్భంలో 1909 ఫిబ్రవరి 28న అమెరికాలో మొదటిసారిగా జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. అదే రోజున సార్వత్రిక ఓటుహక్కును సమర్ధించి అంతర్జాతీయ ఉద్యమం గా మార్చాలన్న ఆలోచన 1910లో జరిగిన అంతర్జాతీయ మహిళా కార్మిక సమావేశంలో తీసుకున్నారు. పనిచేసే మహిళల తరపున న్యాయవాదిగా వ్యవహరించిన జెట్కిన్‌ ఇందుకోసం విశేషమైన కృషి చేశారు.
అమెరికాలో మహిళా కార్మికోద్యమం మొదలైనప్పటికీ 1917లో జరిగిన రష్యా విప్లవ సందర్భంగా ఇది విస్తృత రూ పాన్ని సంతరించుకుంది. జట్కిన్‌ ఆలోచనా విధానం ఐరోపా అంతా విస్తరించింది. అప్పటికే ఐరోపాలోని పలు దేశాలు అశాంతిని ఎదుర్కొంటున్నాయి. యుద్ధం, విస్తృతమైన ఆహార కొరతల నేపథ్యంలో ప్రజానిరసనలు పెరిగాయి. ఇందులో భాగంగా 1917 ఫిబ్రవరి 23న పలు ఐరోపా దేశాల్లో మహిళా దినోత్సవ ప్రదర్శన జరిగింది. అయితే ఆ రోజు రష్య న్‌ కేలండర్‌లో మార్చి 8తో సమానం. దీంతో రష్యా లో అప్పటి నుంచి ప్రతి ఏటా మార్చి 8న మహి ళా దినోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయ ంగా రూపుదిద్దుకుంది. మే 1న వార్షిక కార్మిక దినోత్సవంగా భావించిన రష్యా మార్చి 8న మహిళల పట్ల వేధింపులు, నిరంకుశత్వ వైఖ రులకు వ్యతిరేక దినంగా గుర్తించడం మొదలైం ది. రష్యాలో జార్‌ చక్రవర్తుల సామ్రాజ్య పతనానం తరం ప్రతి ఏటా ఈ వేడుకలు జరుగుతున్నాయి. మార్చి నిరస నల పర్యవసానమే రష్యన్‌ మహిళలు 1917లో ఓటుహక్కు ను సాధించగలిగారు. మహిళలకు ఓటుహక్కు ఇచ్చిన మొద టి ప్రధాన దేశంగా రష్యా ఆవిర్భవించింది. బ్రిటన్‌ కంటే ఓ ఏడాది, యూకే కంటే మూడేళ్ళ ముందుగా రష్యాలో మహిళ లు ఈ ఉద్యమం ద్వారా ఓటుహక్కును పొందగలిగారు. 20వ శతాబ్దపు చివరి దశాబ్దల్లోనే అమెరికాలో ఈ మహిళా దినోత్సవ వేడుకల ప్రాధాన్యత పెరిగింది. 1975లో ఐక్యరాజ్య సమితి దీన్ని అధికారికంగా ప్రకటించింది.
ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు
ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు మార్చి 8న మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నాయి. వివిధ రంగాల్లో విజ యం సాధించిన మహిళల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాయి. మహిళా సంఘాలు ప్రభుత్వవర్గాలు కూడా పలు కార్యక్రమా లు నిర్వహిస్తున్నాయి. మహిళాభ్యుదయం గురించి ప్రసం గాలు ఇస్తున్నాయి. అయితే మహిళా దినోత్సవం ఆవిర్భవించి నూరేళ్ళు పూర్తయిన తర్వాత కూడా మహిళలు లైంగిక వేధింపులు, సమాన వేతనం, పునరుత్పత్తి ఆరోగ్య సంర క్షణకు సంబంధించి పలు వ్యత్యాసాల్ని ఇప్పటికీ ఎదుర్కొం టూనే ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement