Thursday, May 2, 2024

నేపాల్ నుంచి పెట్రోల్ స్మగ్లింగ్

మన దేశంలో పెట్రో ధరలు నడి వేసవి మంటలను తలపిస్తున్నాయి. ఆ సెగకు తమ వాహనాలను షెడ్లకు పరిమితం చేసి నటరాజ సర్వీసే బెటర్ అనుకునే పరిస్థితికి వినియోగదారులు చేరుకుంటున్నారు. దేశంలో పెట్రోలు లీటరు దర సెంచరీ కొట్టడానికి వేగంగా పరుగులు తీస్తుంటే…పొరుగున ఉణ్న నేపాల్ లో తక్కువ ధరకే పెట్రోలు లభిస్తున్నది. దీంతో బీహార్ లోని సరిహద్దు ప్రాంతాల ప్రజలు సరిహద్దులు దాటి వెళ్లి మరీ పెట్రోలు తెచ్చుకుంటున్నారు. అక్కడ పెట్రోలు లీటర్ ధర దేశంలో కంటే కనీసం 22 రూపాయల తక్కువకు లభిస్తున్నది. దీంతో ఒక్క బీహార్ సరిహద్దుల నుంచే కాదు…యూపీ తదితర ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున పెట్రోలు కోసం సరిహద్దులు దాటి నేపాల్ వెళ్లి తెచ్చుకుంటున్నారు. పెద్ద పెద్ద పీపాలు, డ్రమ్ములతో అక్కడ నుంచి డీజిల్, పెట్రోల్ ఇక్కడకు తరలిస్తున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని నేపాల్ నుంచి భారత్ లోకి పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్ ను స్మగుల్ చేసి సొమ్ము చేసుకుంటున్నవారూ ఉన్నారు. బీహార్ నుంచి వెలువడే పత్రికల కథనం ప్రకారం నేపాల్ నుంచి భారత్ కు పెట్రోల్, డీజిల్ స్మగ్లింగ్ బూట్ లెగ్గర్ ( అక్రమ సారా) కంటే పెద్ద మాఫీయాగా మారే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement