Saturday, April 20, 2024

‘శ్రీకారం’ నుండి మూడో లిరికల్ సాంగ్

‘హే అబ్బాయి’ అనే మూడో పాట లిరికల్ వీడియోని శ్రీకారం చిత్ర బృందం విడుదల చేసింది. ‘హే అబ్బాయి.. హే హే అబ్బాయి.. ఇంక ఫోజులు చాలోయి.. కాస్త ఇటేపు చూడోయి’ అంటూ సాగిన ఈ పాటలో హీరో  శర్వానంద్  వెంటపడుతూ హీరోయిన్ ప్రియాంక మోహన్ అతన్ని టీజ్ చేస్తోంది. ఇన్నాళ్లు లంగావోణి – చుడీదార్స్ లో కనిపించిన ప్రియాంక ఇందులో ట్రెడీ కాస్ట్యూమ్స్ తో అలరించింది. ఈ టీజింగ్ సాంగ్ కి కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. సింగర్స్ నూతన మోహన్ – హైమత్ ఆలపించారు. ఇప్పటి వరకు విడుదలైన మూడు పాటలు చూస్తుంటే మిక్కీ ఈ సినిమాకి డిఫరెంట్ ట్యూన్స్ అందించినట్లు అర్థం అవుతోంది. కాగా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిశోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట – గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించగా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులు – వ్యవసాయం నేపథ్యంలో ‘శ్రీకారం’ సినిమా ఉంటుందట.

Advertisement

తాజా వార్తలు

Advertisement