Saturday, April 20, 2024

పుష్ప తర్వాత ‘బన్నీ’ మూవీ ఇదే

ప్రస్తుతం పుష్ప చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ  సినిమా తర్వాత వేణు శ్రీరామ్ ఐకాన్.. కొరటాల శివతో ఓ సినిమాకు కమిట్ మెంట్ ఇచ్చాడట అల్లు అర్జున్. ఇందులో ఐకాన్ సినిమాకు బలం ఉందో లేదో తెలియదు కానీ కొరటాల శివ సినిమాను మాత్రం చాలా వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నాడు అల్లు అర్జున్. ఈయన ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మే 13న విడుదల కానుంది.  దాంతో ఆ తర్వాత ఖాళీ అయిపోతాడు కొరటాల. అందుకే ఆచార్య తర్వాత వెంటనే ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా బన్నీ సినిమాను మొదలు పెట్టాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు. ఈ సినిమాను కూడా తన కెరీర్ లోనే ఎప్పుడూ లేనంత వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు. ఆగస్ట్ తర్వాత షూటింగ్ మొదలు పెట్టి.. 2022 సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. ఈ సినిమాను కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇది కూడా పాన్ ఇండియన్ సినిమానే ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ.

Advertisement

తాజా వార్తలు

Advertisement