Monday, May 13, 2024

నెహ్రా ఆటోగ్రాఫ్ కి భారీ డిమాండ్

టీమిండియా విధ్వంసకర ఆటగాడు రిషబ్‌ పంత్‌కు చెందిన ఓ పాత ఫోటోగ్రాఫ్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో పంత్‌ భారత మాజీ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా ఆటోగ్రాఫ్‌ తీసుకుంటూ కనిపిస్తాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా నిలిచింది. గతంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కూడా అచ్చం ఇలానే ఆశిష్‌ నెహ్రాతో ఆటోగ్రాఫ్‌ తీసుకుంటూ కనిపించాడు. ఈ రెండు ఫోటోలను పోలుస్తూ సోషల్‌ మీడియాలో పెద్ద డిస్కషనే నడుస్తోంది.

కోహ్లి, పంత్‌ల సక్సెస్‌కు నెహ్రా ఆటోగ్రాఫే కారణమని కొందరంటుంటే.. మరి కొందరేమో నెహ్రా హస్తవాసి చాలా బాగుందని.. ఆయన ఆటోగ్రాఫ్‌ తీసుకుంటే క్రికెటర్లు స్టార్లయిపోతారని కామెంట్లు చేస్తున్నారు.. ఆశిష్ నెహ్రా ఆటోగ్రాఫ్‌కు అంత పవరుందా? గతంలో కోహ్లీ సూపర్ స్టార్ అయ్యాడు.. ఇప్పుడు పంత్ అదరగొడుతున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు.

కోహ్లీ, పంత్‌ల సక్సెస్‌కు నెహ్రా ఆటోగ్రాఫే కారణమని కొందరంటుంటే.. మరి కొందరేమో నెహ్రా హస్తవాసి చాలా బాగుందని.. ఆయన ఆటోగ్రాఫ్‌ తీసుకుంటే క్రికెటర్లు స్టార్లయిపోతారని కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ మరో విశేషమేమిటంటే ఈ ముగ్గురు క్రికెటర్లు దేశవాళి క్రికెట్‌లో ఢిల్లీ జట్టకే ప్రాతినిధ్యం వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement