Friday, April 26, 2024

అర్జెంటుగా వ్యాక్సిన్ పంపాలని ప్రధానికి జగన్ లేఖ

ప్ర‌ధాని మోదీకి ఏపీ సీఎం జ‌గ‌న్ లేఖ రాశారు. ఏపీలో రాబోయే మూడు వారాల్లో రాష్ట్రంలోని 45ఏళ్లు దాటిన ప్ర‌తి ఒక్క‌రికి వ్యాక్సిన్ ఇచ్చేలా ప్ర‌ణాళిక రూపొందించిన‌ట్లు లేఖలో జగన్ వివ‌రించారు. ఒక్క‌రోజే 6,28,961 మందికి వ్యాక్సిన్ ఇచ్చామ‌ని పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా వ్యాక్సినేష‌న్ ఏపీలో విజ‌య‌వంతం అయ్యింద‌ని లేఖ‌లో పేర్కొన్నారు. అయితే మూడు వారాల్లో 45 ఏళ్లు దాటిన ప్ర‌తి ఒక్క‌రికి వ్యాక్సిన్ ఇవ్వాలంటే రాష్ట్రానికి వెంట‌నే 60ల‌క్ష‌ల డోసులు అవ‌స‌రం అని, ఈ మేరకు వ్యాక్సిన్ డోసులు పంపే ఏర్పాట్లు చేయాల‌ని జ‌గ‌న్ లేఖ‌లో కోరారు. కాగా ఏపీ 20ల‌క్ష‌ల వ్యాక్సిన్ డోసులు కావాల‌ని ఆర్డ‌ర్ చేయ‌గా కేంద్రం 6ల‌క్ష‌ల పైచిలుకు మాత్ర‌మే పంపింది. కానీ అవి కూడా ఒకే రోజు పూర్తి కావటంతో ఏపీలో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement