Sunday, March 24, 2024

భక్తి శ్రద్దలతో వాసవీమాత పూజలు..

దేవరకద్ర : మండల కేంద్రంలో కన్యకాపరమేశ్వరి ఆలయంలో భక్తి శ్రద్దలతో వాసవి మాతకు పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఆలయ అర్చకులు హరిశంకర శర్మ ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించి పట్టువస్త్రాలతో అలంకారం చేసి పూలతో అలంకరించారు. మహిళలు అమ్మవారికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో మహిళలు కుంకుమార్చన కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కన్నయ్య , హరికాంత్‌ , కిషోర్‌ , లక్ష్మినారాయణ ,నరేష్‌ , వెంకట్రాములు , రఘు , మహిళలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement