Monday, April 29, 2024

అమెరికా-రష్యా ద్వంద్వ నీతి

ఉగ్రవాదంపై అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి గురించి ఇప్పటికి ఎన్నో కథనాలు వెలువడ్డాయి. ఇప్పు డు తాజాగా అమెరికా అవకాశ వాద వైఖరిని బహిర్గతం చేస్తూ అగ్రరాజ్యం రష్యాతో కుదుర్చుకున్న ఒక ఒప్పం దం వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదులకు ఆయుధాల ను సరఫరా చేసిన విక్టర్‌ బౌట్‌ అనే ఆయుధ వ్యాపారికొద్ది కాలంగా అమెరికా జైలులో ఉంటున్నాడు. అవిభక్త సోవియట్‌ యూనియన్‌లో ట్రాన్సలేటర్‌గా పని చేసిన బౌట్‌ ఆయుధ వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించా డు. అంతర్జాతీయ ఆయుధ వ్యాపారిగా పేరు సంపాదిం చాడు అమెరికన్‌ భద్రతాదళాలకు చిక్కిన అతడు అమెరికా జైలులో ఉంటున్నాడు. అమెరికాకి చెందిన బాస్కెట్‌ బాల్‌ స్టార్‌ బ్రిట్నీ గ్రినెర్‌ని మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో రష్యన్‌ పోలీసులు పట్టుకుని జైల్లో పెట్టారు. ఆమె గంజాయి తైలాన్ని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డారు. గత ఫిబ్రవరి నుంచి ఆమె జైలులోనే ఉన్నారు ఆమె విడుదల కోసం దేశంలో పలుకుబడి వర్గా ల నుంచి వచ్చిన ఒత్తిడులతో అమెరికా అధ్యక్షుడు బిడెన్‌ జోక్యం చేసుకున్నారు. అయితే, ప్రస్తుత యుద్ధంలో ఉక్రెయిన్‌ను అమెరికా సమర్ధిస్తోంది. ఆయుధాలను కూడా సరఫరా చేస్తోం ది. అందువల్ల బ్రిట్నీ గ్రినెర్‌ను విడుదల చేయడానికి రష్యా నిరాకరించింది.

- Advertisement -

అప్పుడు అమెరికా సన్నిహిత దేశమైన సౌదీ అరేబియా, యునైటె డ్‌ అరబ్‌ ఎమిరైట్స్‌ (యూఏఈ)తో కలిసి రష్యాతో రాయ బారం నెరిపాయి. అమెరికా జైల్లో మగ్గుతున్న బ్రైట్‌ని విడుదల చేయాలంటే బౌట్‌ని విడుదల చేయాలని రష్యా షరతు పెట్టింది. తన ప్రత్యర్ధులను లొంగదీయడానికి ఇలాంటి అవకాశాలను వినియోగించుకోవడంలో రష్యాది అందెవేసిన చెయ్యి. ఉక్రెయిన్‌లో అక్కడి భద్రతా దళాలకు చిక్కిన రష్యా సైనికులనూ, ఆర్మీ అధికారులను రష్యా ఇదే మాదిరిగా బేరసారాలు సాగించి విడిపించు కుంది. మామూలు సైనికులు వేరు, ఉగ్రవాదులకు ఆయుధాలను సరఫరా చేస్తూ కరుడుకట్టిన నేరస్థునిగా పేరుమోసిన బౌట్‌ పరిస్థి వేరు. అతన్ని రష్యా విడుదల చేయించుకున్న తీరు అంతర్జాతీయంగా యుద్ధ నిపుణు లను ఆశ్చర్య పర్చింది. సాధారణంగా ఇలాంటి నేరస్థులు యుద్ధ నేరస్థుల కింద లెక్క. బౌట్‌ ఉక్రెయిన్‌ యుద్ధంలో అక్కడి సమాచారాన్ని సేకరించి రష్యాకి అందజేస్తున్న తరుణంలోనే అమెరికన్‌ ఇంటిలిజెన్స్‌ అధికారులకు చిక్కాడు. ఉక్రెయిన్‌లో అమెరికా ఇంటిలిజెన్స్‌ దళాలు తిష్ట వేసి తమ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయంటూ రష్యా కొంత కాలంగా గగ్గోలు చేస్తోంది. ఉక్రెయిన్‌ భూ భాగంలోకి అమెరికా, దాని మిత్ర దేశాల గూఢచారులు ప్రవేశించడం పట్ల రష్యా ఎన్నో సార్లు అభ్యంతరం తెలిపింది.

అయినా అమెరికా లెక్క చేయలేదు. ఉగ్రవాదుల కు ఆయుధాలను అందిస్తున్న సంస్థలు, వ్యక్తులకు అమె రికా సాయం చేస్తోంది. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. సిరియాలో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకం గా పోరాడుతున్న తిరుగుబాటుదారులకు అమెరికా బౌట్‌ లాంటి బేహారుల ద్వారా ఆయుధాలను అందిస్తోం ది యూఏ, సౌదీ సంయుక్తంగా నిర్వహించిన రాయబా రం ఫలించి అటు బౌట్‌నీ, ఇటు బ్రిట్నీని పరస్పరం విడు దల చేసేందుకు యూఏఈ వేదికగా అంగీకారం కుది రింది.యుద్ధ ఖైదీలను మార్చుకున్న తీరులో వారిరువు రి మార్పిడి జరిగింది. సినిమా కథలా సాగిన ఈ రాయ బారం విజయవంతం కావడంతో బిడెన్‌ గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు.యుద్ధ తంత్రాల్లో ఇలాంటివి మామూలే నని చెప్పుకోవచ్చు కానీ, ఉక్రెయిన్‌ యుద్ధం లేకపోయి ఉంటే నిజంగానే వీరిద్దరి మార్పిడి పెద్ద సమస్య అయి ఉండేది కాదు. ఈ ఒప్పందం కుదిరేందుకు సౌదీ యువ రాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ జోక్యం చేసుకున్నారు. ఖషోగీ అనే అమెరికన్‌ జర్నలిస్టు హత్య కేసులో సల్మాన్‌పై కేసు నమోదు అయింది. సల్మాన్‌ సౌదీయువరాజు కాకముందు ఈ కేసు నమోదు అయింది.అతడు యువ రాజుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత లభించిన ఇమ్యూనిటీ ద్వారా కోర్టులో హాజరు నుంచి తప్పించుకో గలిగారు. దౌత్యనీతిలో ఒకరికొకరు సహకరించుకోవ డం మామూలే.

అయితే, ఉగ్రవాదులతో సంబంధాలు న్న వారినీ, ఉగ్రవాదులకు ఆయుధాలను విక్రయిస్తున్న వారినీ ఇదే పద్దతిలో అమెరికా విడుదల చేయడం అగ్ర రాజ్యం ద్వంద్వ వైఖరికి ప్రత్యక్ష నిదర్శనం.పాక్‌ కేంద్రం గా పని చేస్తున్న ఉగ్రవాదులను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీలో చైనా వెనకేసుకొచ్చిన ఉదంతాలు ఇంకా మన స్మృతి పథంలో ఉన్నాయి.చైనా, అమెరికాలు ఉగ్రవాద సమస్యపై పరస్పర విరుద్ధ వైఖరు లను అనుసరిస్తుండటం వల్లనే అది అంతం కావడం లేదు. ఇది ఎంత మాత్రం దౌత్యనీతి కానేకాదు! అమెరికా చాలా సందర్భాల్లో తన ద్వంద్వనీతిని బహిర్గతం చేస్తూ వస్తోంది. అగ్రరాజ్యమనే అహంకారంతో ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే రీతిలో వ్యవహరిస్తోంది. నిజానికి ఉగ్రవాదం అలనాడు ముషారఫ్‌ హయాం నుంచి అమెరికా అండతోనే పెరిగి పెద్దదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement