Friday, March 15, 2024

Big Breaking: బంగ్లా ముందు భారీ టార్గెట్​.. మూడో వన్డేలో టీమిండియా అద్భుత విజయం

బంగ్లాదేశ్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇవ్వాల చివరి వన్డేలో టీమిండియా కుర్రాళ్లు దంచికొట్టారు. బంగ్లా కూనల ముందు 410 పరుగుల అతి భారీ టార్గెట్​ పెట్టి వారిని భ‌య‌పెట్టారు. బెంబేలెత్తిపోయిన బంగ్లా బ్యాటర్లు 30 ఓవర్లలోపే చేతులెత్తేశారు. ఈ క్రమంలో ఆతిథ్య బంగ్లాదేశ్ తడబాటుకు గురైంది. బంగ్లా జట్టు 124 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. శార్దూల్ ఠాకూర్ 3, అక్షర్ పటేల్ 2, ఉమ్రాన్ మాలిక్ 2, సిరాజ్, కుల్దీప్, వాషింగ్ట‌న్ సుంద‌ర్ త‌లా ఒక వికెట్ తీశారు. కాగా, 34 ఓవ‌ర్ల‌లో 182 ప‌రుగులు చేసిన బంగ్ల‌దేశ్ జ‌ట్టు ఆలౌట్ అయ్యింది. ఇక 227 పరుగులు భారీ తేడాతో టీమిండియా విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement