Wednesday, May 1, 2024

పుతిన్‌లో జ్ఞానోదయం కలగాలి….

ప్రపంచంలో భారత్‌కి ప్రత్యేక గుర్తింపు రావడానికి మహాత్మాగాంధీ అహింసావాదమే ,నాయకులు ఎవరైనా, ఎంతటి వారైనా,ఎక్కడి వారైనా మహాత్ముని పేరును ఏదో ఒక సందర్భంలో తలుచుకోకుండా ఉండలేరు. గాంధీజీ ఒక్క భారత జాతికే కాకుండా, యావత్‌ మానవ జాతికి మహాత్ముడు. ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమై వందరోజులకు చేరిన తరుణంలో ఆ దేశ అధ్యక్షుడు జెలెెనెస్కీ గాంధీజీ తలుచుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించలేదు. రష్యన్‌ సైనికులు జరుపుతున్న దాడిలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లెక్కకు మిక్కిలిగా భవనాలు నేలమట్టం అయ్యాయి. ఇంకా అవుతున్నాయి. అలాగే, రష్యన్‌ సైనికులు కూడా వేల సంఖ్య లో నేలకొరిగారు. 68 లక్షల మంది పైగా శరణార్దులుగా ఇరుగుపొరుగు దేశాలకు తరలిపోయారు. మానవ జాతి చరిత్రలో మహావిషాదంగా మిగిలిపోయే ఈ యుద్దం అనివార్యమైనదే. ప్రపంచంలో ఏ దేశంలోనూ యుద్దాలు ప్రజలకు విషాదమే తప్ప సుఖసంతోషాలు పంచి ఇవ్వలేదు. ఈ యుద్దం వల్ల రష్యామాత్రం ఏం బాగుపడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆశించిన లక్ష్యాన్ని సాధించలేదు, సరికదా మానవ జాతికి శత్రువుగా అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. యుద్ధాన్ని ఆపించడానికి పుతిన్‌తో చర్చలకు సిద్ధమేనంటూ జెలినెస్కీ ప్రకటించినా పుతిన్‌ వినలేదు. పోగాలము దాపురించిన వారు మంచిని వినరూ,కనరూ అని తెలుగు పద్యంలో ఓ పాదాన్ని ఇలాంటి సందర్భాల్లో గుర్తు చేసుకుంటూ ఉంటాం. మంచి ఎవరు చెప్పినా వినాల్సిందే. మానవ జాతి చరిత్రలో అహింసా మూర్తిగా నిలిచిపోయిన మహాత్మాగాంధీ వాక్యాలను జెలెన్‌స్కీ గుర్తు చేసుకున్నా రు.

భయం తొలగినప్పుడే బలం పెరుగుతుందంటూ ఆనాడు మహాత్ముని హితవచనం ఇప్పటికీ ధైర్యాన్నిస్తోందంటూ జెలెన్‌స్కీ అన్నారు. ఉక్రెయిన్‌లో భారత రాయబారిగా హర్షకుమార్‌ జైన్‌ శుక్రవారం నాడు బాధ్యతలను స్వీకరించినప్పుడు ఆయనను స్వాగతిస్తూ జెలినెస్కీ ఈ మాటలు అన్నారు. ప్రస్తుత తరుణంలో ఒక్క ఉక్రయిన్‌కే కాకుండా యావత్‌ ప్రపంచానికీ మహాత్ముని శాంతివచనాలు శిరోధార్యం. మహాత్ముని అహింసా వాదాన్ని కీర్తిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మహానాయకులు ప్రకటనలు చేశారు.వాటిలో మన స్మృతి పథంలో ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ముఖ్యులు. గాంధీజీ హితవచనాల నుంచి స్ఫూర్తిని పొందడం వల్లనే ఇరాన్‌పై దాడి చేయా లంటూ మిత్ర దేశమైన సౌదీ అరేబియా నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ఆయన తలొంచలేదు.ఆయన తర్వాత అధికారాన్ని నిర్వహించిన డొనాల్డ్‌ ట్రంప్‌ ఎంతో ప్రయ త్నం చేసినా ఇరాన్‌పై దాడి చేయలేకపోయారు. మహా త్ముని హితవచనాలను గుర్తు చేసుకుంటే చాలు ఎవరి కైనా కొండంత బలం కలుగుతుంది.అక్టోబర్‌ రెండో తేదీన అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటిం చిన ఐక్యరాజ్య సమితి ఉక్రెయిన్‌ యుద్ధం వందరోజులకు చేరుకున్న సందర్భంగా ఒక ప్రకటన చేస్తూ యుద్ధాల్లో విజేతలెవరూ ఉండరనీ, ఇప్పటికైనా నరమేథాన్ని ఆపాలని ఇరువర్గాలకూ విజ్ఞుప్తిచేసింది.సమితి భద్రతా మండలిలో కీలక స్థానంలో ఉన్న రష్యాకు ఏ ఒక్కదేశ మూ నచ్చజెప్పలేకపోతోంది.రష్యాకు చెందిన 300 బిలియన్‌ డాలర్ల బంగారం కరెన్సీ రష్యాపై ఆంక్షల కారణంగా ఇతర దేశాల్లో స్తంభించి పోయాయి.

భారత్‌ అనుసరిస్తున్న తటస్థ వైఖరిని తప్పుపట్టేందుకు అమెరికా, దాని మిత్ర దేశాలు ప్రయత్నించి విఫలమ య్యాయి. రష్యాకు మన దేశం ఎన్నో సార్లు నచ్చజెప్పిం ది. అయితే, రష్యా తీసుకున్న నిర్ణయం వల్ల ఆ దేశంలోనే నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.పుతిన్‌ ఆరోగ్యంపై కూడా వివిధ రకాల వార్తలు వెలువడ్డాయి.ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల అన్ని దేశాలూ ఏదో విధంగా నష్టపోయా యి. ఇంకా నష్టపోతున్నాయి. తమ దేశ పౌరులు ఎదు ర్కొంటున్న కష్టనష్టాలను ఆపడానికైనా పుతిన్‌ మంచి నిర్ణయం తీసుకుంటే శాంతి వెల్లివిరుస్తుంది. పుతిన్‌ తీసుకునే నిర్ణయం వల్ల శాంతి వెల్లివిరియడమే కాదు, మానవజాతిని కష్ట,నష్టాల నుంచి దూరం చేస్తుంది.అన్ని దేశాల వారూ చమురు,వంటనూనెల ధరల భారాన్ని అకారణంగా మోయాల్సి వస్తోంది.ఈ పరిస్థితిని కొని తెచ్చినవాడు పుతినే. వందరోజుల్లో సాధించలేనిది ఇంకె ప్పుడు సాధిస్తారు. ఇప్పటికైనా మారణ హోమాన్ని ఆపేట్టు పుతిన్‌లో జ్ఞానోదయం కలగాలని యావత్‌ మాన వనజాతి ఆకాంక్షిస్తోంది. కాగా, ఉక్రెయిన్‌తో దౌత్య సం బంధాలను పునరుద్ధరించేందుకు అన్ని దేశాలూ ఆసక్తి చూపుతున్నాయి.మన దేశమే కాదు, అమెరికా, మాల్డో వా తదితర దేశాలు అందించిన నియామక పత్రాలను జెలెన్‌స్కీ స్వీకరించారు. అందరూ తమ వైఖరిని సమర్ధి స్తున్నారనీ, త్వరలోనే మిగిలిన దేశాల దౌత్యాధికారులు తిరిగి వస్తారని జెలెన్‌స్కీ అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement