Thursday, May 16, 2024

గ‌చ్చిబౌలిలో దారుణం – స్విగ్గి బాయ్ పై రాడ్లు, కర్రలతో దాడి

అర‌గంట లేటుగా వ‌చ్చినందుకు స్విగ్గి డెలివ‌రీ బాయ్ పై దాడికి దిగారు హోట‌ల్ నిర్వాహ‌కులు. 20 మంది కలిసి రాడ్లు, కర్రలతో డెలివరీ బాయ్ మీద విరుచుకుపడ్డారు. ఈ దారుణం హైదరాబాద్ గచ్చిబౌలిలో చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి తెలిసిన పోలీసులు.. అక్కడకు చేరుకుని ఘర్షణను ఆపారు. తీవ్రంగా గాయపడిన డెలివరీ బాయ్ ను ఆసుపత్రికి తరలించారు. దాడి ఘటనతో స్విగ్గీ డెలివరీ బాయ్స్ హోటల్ ముందు ఆందోళనకు దిగారు. బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హోటల్ యజమానిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement