Thursday, June 1, 2023

పరిపూర్ణ సామ్రాజ్ఞి!

ఒకనాటి రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యానికి వారసురాలు, క్వీన్‌ ఎలిజబెత్‌ -2 పరిపూర్ణ ( 96 ఏళ్ళ) జీవితాన్ని అనుభవించి గురువారంనాడు కాలధర్మం చెందారు. ఆమె మరణానికి యావత్‌ బ్రిటిష్‌ పౌరులే కాకుండా, కామన్వెల్త్‌ దేశాల ప్రజలు విషాదాన్ని వ్యక్తం చేశారు. ఆమె పేరులో రాణి ఉన్నా, రాచరికపు దర్పాన్ని ప్రదర్శించకుండా ప్రజలతో కలిసిమెలిసి ఉండేవారు. ఆమె ఎక్కడికైనా పర్యటనలకు వెళ్ళినప్పుడు వారిని ఆప్యాయంగా పలకరించేవారు. ఆమె ఏడు దశాబ్దాల పాటు రాణిగా వ్యవహరించారు. ఆమెకు భారత్‌తోనే కాకుండా హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె మన దేశాన్ని మూడు సార్లు సందర్శించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆసక్తిని ప్రద ర్శించారు. 1947లో ఆమె వివాహం సందర్భంగా ఆమె కు నిజాంరాజు వజ్రాల హారాన్ని కానుకగా అందించా రు. ఆమెకు ఎన్నో నగ లు ఉన్నా ఈ వజ్రాల హారాన్ని అపురూపంగా చూసుకునే వారు.1983లో హైదరాబాద్‌ సందర్శించినప్పుడు క్వీన్‌ ఎలిజబెత్‌కీ, ఆమె భర్త ఫిలిప్స్‌ కీ ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ఘన స్వాగతం పలికారు. ఆంధ్రుల అతిధి మర్యాదల పట్ల ఆమె ముగ్ధులయ్యారు. బ్రిటిష్‌ రాణికి చారిత్రక కట్టడాల సందర్శన, గుర్రపు స్వారీ అంటే మక్కువ. కుతుబ్‌ షాహీ సమాధుల నుంచి ఆమె బైనాక్యులర్‌లో గోల్కొండ కోటను తిలకించారు. హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన హోలీ ట్రినిటీ చర్చిని ఆమె సందర్శించారు. ఆమె భారతీయుల పట్ల ప్రేమాతిశయాలను ప్రదర్శించేవారు. మన ప్రధానులు పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ నుంచి ప్రస్తుత ప్రధాని మోడీ వరకూ అందరితోనూ ఆమె సామ రస్యంగా, స్నేహభావంగా ఉండేవారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మనకు బ్రిటన్‌తో గొడవలేవీ లేవు. కామ న్వెల్త్‌ దేశాల కూటమిలో భారత్‌ ప్రధాన పాత్ర వహిస్తోం ది. కామన్వెల్త్‌ గేమ్స్‌, కామన్వెల్త్‌ శిఖరాగ్ర సభలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. ఆమె కిరీటంలోని కోహినూర్‌ వజ్రం మన దేశానిదే. 1849లో బ్రిటిష్‌ వారు పంజాబ్‌ని ఆక్రమించుకున్నప్పుడు అపురూపమైన ఈ వజ్రం బ్రిటన్‌కి చేరింది. భారత్‌ సహా నాలుగు దేశాల్లో దీని యాజమాన్య హక్కుపై ఇంకా వివాదం కొనసాగు తూనే ఉంది. ఈ వజ్రం మాత్రమే కాదు. బ్రిటిష్‌ పాలన లో మన దేశంలో ఎన్నో అమూల్యమైన ఆభరణాలు, అపూర్వ కళాఖండాలను ఆనాటి పాలకులు కొల్లగొట్టారు. అలాగే, అమరావతికి చెందిన బౌద్ధ శిల్పాలు, ఇతర పురావస్తు సంపద లండన్‌ లోని బ్రిటిష్‌ మ్యూజియంలో ఉన్నాయి. అయితే సహజంగా ఈ వజ్రం పొదిగిన కిరీటం కోడ లు కెమిల్లాకే చెందాలి. తన తదనంతరం తన కు ఇస్తున్న ఆదరణ, మర్యాదలు తన కుమారుడు చార్లెస్‌ కీ, కోడలు కెమిల్లాకీ దక్కాలని రాణి ఎలిజబెత్‌ తన 70వ ఏట జరిగిన ఒక కార్యక్రమంలో తన అభిలాషను వ్యక్తం చేశారు. అయితే, కెమిల్లాకు ఆ గౌరవ మర్యాదలు దక్కుతాయా అన్నదానిపై అనుమానాలు వ్యక్తం అవుతు న్నాయి. ప్రిన్స్‌ చార్లెస్‌కి కెమిల్లా రెండో భార్య కావడం, ఆమె పట్ల ప్రజల్లో ఎక్కువ వ్యతిరేకత ఉన్నట్టు వార్తలు రావడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతె కాక చార్లెస్‌ నుంచి విడాకులు తీసుకున్న కొద్ది కాలానికే మొదటి భార్య విడాకులు తీసుకున్నారు. బ్రిటిష్‌ సంప్ర దాయం ప్రకారం రాజుగా పట్టాభిషిక్తుడు కానున్న చార్లెస్‌ భార్యగా కెమిల్లాకు మర్యాదలు దక్కుతాయని అంటున్నారు. ఏమైనా ఇక పైన బ్రిటిష్‌ రాజసౌధంలో పరిస్థితులు గతంలో మాదిరిగా ఉండకపోవచ్చు. బ్రిటన్‌ లో అమలులో ఉన్న వ్యవస్థ ప్రకారం రాణి, లేదా రాజు పదవుల్లో ఉన్న వారు కేవలం అలంకార ప్రాయులే. మన దేశంలో రాష్ట్రపతికి దక్కే మర్యాదలన్నీ వారికి దక్కుతా యి. అంతేకాకుండా బ్రిటన్‌ పాలనలో వచ్చిన మార్పుల కారణంగా బ్రిటిష్‌ రాజు బాధ్యతల నిర్వహణ గతంలో మాదిరి నల్లేరు మీద బండి కాదు. బ్రిటిష్‌ ఆర్థిక వ్యవస్థను మన ఆర్థిక వ్యవస్థ దాటేసిన నేపథ్యంలో అక్కడ కూడా వ్యయాలపై పరిమితులు రావచ్చు. ఏమైనా ఏడు దశాబ్దా ల పాటు పాలించిన క్వీన్‌ ఎలిజబెత్‌ స్థాయి, బ్రిటన్‌లో ఎవరికీ దక్కదు. ఆమె చరిత్రలో తనదైన ముద్ర వేశారు. అధికారాలు ఎక్కువ లేకపోవడం వల్ల వివాదాలకు తావు లేకుండా ఆమె బ్రిటిష్‌ రాణిగా తన అధికారాలను నిర్వర్తించారు. ఆమె హయాంలో దాదాపు11మంది ప్రధానులు బ్రిటిష్‌లో అధికారంలో ఉన్నారు. బ్రిటన్‌ ఇప్పుడు అమెరికా మిత్ర దేశం కనుక బ్రిటన్‌కు ప్రత్యేకం గా శత్రుదేశాలు లేవు. ఒకప్పుడుబ్రిటన్‌ పాలనలో ఉన్న దేశాలన్నీ స్వతంత్ర దేశాలుగా అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. ముఖ్యంగా మన దేశం బ్రిటన్‌నుంచి విముక్తమై బహుముఖీనమైన ప్రగతిని సాధించింది. గత నెలలోనే స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా జరుపు కుంది. బ్రిటిష్‌ పాలకుల నాటి శాసనాలనూ, కట్టడాలనూ ప్రస్తుత ప్రభుత్వం మార్చేస్తోంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement