Thursday, May 2, 2024

మత సామరస్యానికి పుట్టినిల్లు!

సబ్‌కా మాలిక్‌ ఏక్‌ అని శిరిడీ సాయిబాబా, సబ్‌కో సన్మతి హే భగవాన్‌ అని మహాత్మాగాంధీల బోధనలతో పునీతమైనభారత దేశంలో అన్ని మతాల వారికీ సమాన మైన గౌరవ ప్రపత్తులు లభిస్తున్నాయి. మత సామరస్యా నికి మన దేశం పుట్టినిల్లు. మన దేశంలో ఉన్నంత మత సహనం మరే దేశంలోనూ లేదు. ఈ విషయాన్ని మన నాయకులు అన్ని స్థాయిల్లో అంతర్జాతీ య వేదికలపై పలు సార్లు స్పష్టం చేశారు. ఇంకా చేస్తున్నారు. అయిన ప్పటికీ, ఎవరో పరిపక్వత లేని వ్యాఖ్యలు చేస్తే వాటిని ఆధారం చేసుకుని భారత్‌పై ఆంక్షలు తీసుకోవాలంటూ పలు ఇస్లామిక్‌ దేశాలు గళమెత్తడాన్ని రాజకీయ ప్రయోజనంగానే చూడాలి. ముఖ్యంగా, పొరుగుదేశమై న పాకిస్తాన్‌ మన దేశంపై ఆరోపణలు సంధించడానికి తగిన అవకాశం కోసం ఎదురు చూస్తూంటుంది. భారతీ య జనతాపార్టీ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మ ఒక గోష్టిలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతవివాదానికి కారణం. ఆమె ఏమన్నారో ఎవరికీ తెలియదు.ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మీడియాలో వరస కథనాలు వెలువడుతున్నాయి. ఈ మధ్య ఇలాంటి కథనాలు అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంగా సమాజం లో కలకలాన్ని సృష్టిస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయి.

అలాగే, జిందాల్‌ అనే అదే పార్టీకి చెందిన మరోనాయకుడు ట్విట్టర్‌ లో మహ్మద్‌ ప్రవక్తపై ఒక వ్యాఖ్య పోస్టు చేశారు. ఈ ఇద్దరినీ బీజేపీ తమ పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ విధానా నికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు చర్య తీసుకుం టున్నట్టు ప్రకటించింది. ఇలాంటి వివాదాలు కొత్త కాదు. ఎప్పటికప్పుడు రాజకీయ ప్రయోజనం కోసం వివాదా స్పద వ్యాఖ్యలు చేయడమో, లేదా బొమ్మలను ప్రచురిం చడమో చేస్తుంటారు. కానీ, భారతదేశం లౌకికవాదానికి కట్టుబడి ఉంది. ఈ విషయాన్ని రాజ్యాంగంలోనే స్పష్టం చేయడం జరిగింది. సర్వసత్తాక ప్రతిపత్తితో పాటు లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని రాజ్యాంగంలో స్పష్టం చేయడం జరిగింది. ఈ విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజ నం పొందడానికి, లేదా, రాజకీయంగా పైచేయి సాధిం చామన్న భావన కలిగించడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ వ్యాఖ్యలు చేసిన నూపుర్‌ శర్మ, జిందాల్‌ లు ఇద్దరూ కూడా కమలదళంలో ప్రముఖు లేమీ కాదు. వారు అధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తు న్నారు. అంటే, పార్టీ విధాన నిర్ణయాలను పత్రికా సమావేశాల ద్వారా ప్రజలకు తెలియజేయడం వారి కర్తవ్యం.

అందు వల్ల వివిధ అంశాలపై పార్టీ వైఖరి ఏమి టో తెలిసి కూడా ఉద్దేశ్య పూర్వకంగానే వారు ఈ వ్యాఖ్యలు చేశారనిపిస్తోం ది. అలాగే, మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరామ్‌ గాడ్సే పేరిట కర్నాటకలో ఒక రోడ్డు వెలసింది. ఇదే కర్నాటకలో హిజాబ్‌కి వ్యతిరేకంగా ఆందోళన సాగుతోంది. హిజాబ్‌ (తలపై కప్పుకునే గుడ్డ) తప్పని సరేమీ కాదని కోర్టు తీర్పు చెప్పినప్పటికీ,దానిని వివాదం చేయడానికి అక్కడ ఒక వర్గం వారు ప్రయత్నించడం, అందుకు ప్రత్యర్ధి వర్గం వారు విమర్శలు చేయడం ఇటీవల చోటు చేసుకున్న పరిణామం. మన దేశంలో సర్వమత సామర స్యం వెల్లివిరుస్తోంది. అన్ని మతాల వారికీ సమానమైన గౌరవం, ప్రతిపత్తి లభిస్తోంది. ఆచార వ్యవహారాలు, ఆహార్యం విషయంలో అన్ని మతాల వారికీ సంపూర్ణమై న స్వేచ్ఛ ఉంది. పండుగలు, పర్వదినాల నిర్వహణలో అందరికీ పూర్తి స్వేచ్ఛ ఉంది. అలాగే, ఒకరి పండుగల వేడుల్లో పాలు పంచుకోవడం, సహపంక్తి భోజనాలు చేయడం వంటి, ఆత్మీయ ఆలింగనాలు చేసుకోవడం సర్వసాధారణం.హిందువుల ఇంట పెళ్ళిళ్ళకు ముస్లిం లు సాయపడటం కూడా సర్వసాధారణమే.

సామరస్యంగా సాగిపోతున్న ఈ సహజీవన విధానాన్ని దెబ్బతీయడానికి రాజకీయ వాదులు కొందరు వివాదాల ఉచ్చును సృష్టిస్తుంటారు. సమాజ హితాన్ని కోరే వారు ఈ ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. సమాజంలో శాంతియుత వాతా వరణాన్ని నెలకొల్పేట్టు చేయడం అందరి బాధ్యత అని మహాత్ముడు ప్రబోధించా డు. పరమత సహనం కోసం, సర్వమానవ సౌభ్రాతృ త్వం కోసం జీవితాంతం పాటు పడిన మహానీయుడు ఆయన. అటువంటి మహనీయుడు స్వాతంత్య్ర సమరంలో నౌఖాలీలో జరిగిన హింసకు నిర్వేదం చెంది సత్యాగ్రహం జరిపిన సంగతి మనకు తెలుసు. అటువం టి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న భారత జాతి శాంతి సామరస్యాల కోసం నిరంతరం పాటుపడుతుంది. ఇందులో సందేహం లేదు. ఎవరూ మనలను విడదీయ లేరు. గాలిలో పుట్టిన వార్తలు గాలిలోనే కలిసిపోతుంటా యి. వాటిని పట్టించుకోనవసరం లేదు. భారతదేశంలో ఈ మాదిరి అనుచితమైన వ్యాఖ్యలకు ఉద్రిక్తతల నివారణకు ప్రభుత్వం తాత్కాలిక చర్యల ద్వారా వీటిని అణచివేస్తోంది. శాశ్వత పరిష్కారం చూడాలి

Advertisement

తాజా వార్తలు

Advertisement