Sunday, May 5, 2024

సాయిప‌ల్ల‌వికి వీరాభిమానిని – ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్

హీరో రానా, సాయిప‌ల్ల‌వి కాంబోలో వ‌స్తున్న విరాట‌ప‌ర్వం చిత్ర ట్రైల‌ర్ ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఈ ట్రైల‌ర్‌పై బాలీవుడ్ ద‌ర్శ‌కనిర్మాత క‌ర‌ణ్ జోహార్ సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌శంస‌లు కురిపించారు. ట్రైల‌ర్ అద్భుతంగా ఉంది రానా..ఈ సినిమా చూసేందుకు వేచి ఉండలేక‌పోతున్నా. ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నా. మీరంతా అద్భుతంగా క‌నిపిస్తున్నారు. నేను సాయిపల్లవికి పెద్ద అభిమానిని అంటూ ట్వీట్ చేశాడు క‌ర‌ణ్ జోహార్‌. బాలీవుడ్‌కు ఎంతోమంది స్టార్ హీరోలు, హీరోయిన్లను ప‌రిచ‌యం చేసిన క‌ర‌ణ్ జోహార్ ఏకంగా సాయిప‌ల్ల‌విని ఆకాశానికెత్తేయ‌డం ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మ‌రి క‌ర‌ణ్ జోహార్ ప్ర‌శంస‌ల‌పై సాయిప‌ల్ల‌వి ఎలా రియాక్ట్ అవుతుందోన‌ని ఎక్జ‌యిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు ఆమె ఫాలోవ‌ర్లు, అభిమానులు.

https://twitter.com/karanjohar/status/1533848306714963972
Advertisement

తాజా వార్తలు

Advertisement