Saturday, May 4, 2024

హైదరాబాద్​కు వచ్చిన సల్లూభాయ్​.. నెల రోజులపాటు ఇక్కడే మకాం!

పంజాబ్​ ఫేమస్​ సింగర్ సిద్దూని చంపినట్టే నిన్నూ చంపేస్తామని బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ కు గుర్తు తెలియ‌ని వ్య‌క్తి నుంచి బెదిరింపు లేఖ‌లు రావడంతో అతనికి ఫుల్​ సెక్యూరిటీ కల్పించారు. ఈ ఘ‌టన‌లో గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ ను అదుపులోకి తీసుకుని విచార‌ణ చేపట్టారు పోలీసులు. ఇవ్వాల హైద‌రాబాద్‌కు వచ్చారు స‌ల్మాన్ ఖాన్‌. ఫ‌ర్హ‌ద్ సామ్‌జీ డైరెక్ష‌న్‌లో చేస్తున్న క‌భీ ఈద్ క‌భీ దివాళి షూటింగ్ లేటెస్ట్ షెడ్యూల్‌ రామోజీ ఫిలింసిటీలో జ‌రుగుతోంది. పూజాహెగ్డేతో క‌లిసి న‌టిస్తున్న క‌భీ ఈద్ క‌భీ దివాళి షెడ్యూల్ కోసం భారీ సెట్ వేశారు మేక‌ర్స్.

ఈ సెట్స్ లో సుమారు నెల రోజులపాటు షూటింగ్ జ‌రుగనుంద‌ని ఫిలినగ‌ర్ స‌ర్కిల్ టాక్‌. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో వెంక‌టేశ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. త్వ‌ర‌లోనే వెంకీ కూడా షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్‌. మొత్తానికి స‌ల్లూభాయ్ ఏ మాత్రం ఆందోళ‌న చెందకుండా పోలీసుల భ‌ద్రతల న‌డుమ షూటింగ్‌తో బిజీగా మారి త‌న అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement