Tuesday, April 30, 2024

తెలంగాణపై సుప్రీం సీరియస్​.. కోర్టు తీర్పును పట్టించుకోకపోవడంపై హెచ్చరిక

తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఏజెన్సీలో టీచర్‌ పోస్టులన్నీ ఎస్టీలకే కేటాయిస్తూ గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ప్రభుత్వ నిర్ణయాన్ని గతంలోనే రద్దు చేసిన సుప్రీంకోర్టు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రూ.2.50 లక్షల చొప్పున జరిమానా విధించింది. సుప్రీంకోర్టు జరిమానాను ఏపీ ప్రభుత్వం చెల్లించగా, తెలంగాణ ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులను పాటించలేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. జరిమానా చెల్లించేందుకు మరో 2 వారాల గడువు విధించింది. ఈ మేరకు అన్నిచోట్ల రిజర్వేషన్లు రాజ్యాంగానికి లోబడే ఉండాలని మరోసారి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement