Thursday, May 2, 2024

యుద్ధ విరమణకు నాంది!

అణ్వాయుధాలు కాదు, అన్న వస్త్రాలు కావాలన్న నినాదం ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా ఆహార పదార్దాల కోసం హాహాకారాలు పెరు గుతున్నాయి. అందువల్ల యుద్ధాలు జరుపుకుంటున్న దేశాలు కూడాఅన్న వస్త్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకోవడం అసహజమేమీ కాదు. ఒకనాటి సోవియట్‌ యూనియన్‌ అంతర్భాగమైన ఉక్రెయిన్‌పై రష్యా ఐదు మాసాలుగా యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధం ఆ రెండు దేశాలకే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల కూ చేటు తెస్తోంది. చాలా దేశాలు ఆకలితో అలమటిస్తు న్నాయి. క్షుద్బాధపై మీడియాలో కధనాలు వెలువడుతు న్నాయి. యుద్ధాన్నివిరమించమని రష్యాకు ఐక్యరాజ్య సమితితో సహాపెక్కు దేశాలు కోరాయి. అయినా రష్యా పెడచెవిన పెడుతూ వస్తోంది. ఆహార సంక్షోభానికి లోన వుతున్న దేశాల ఒత్తిడికి తలొగ్గి ఉక్రేయిన్‌ నుంచి గోధుమలు, వంటనూనెల వంటి నిత్యావసరాలను నల్ల సముద్రం మీదుగా ఎగమతులకు అనుమతి ఇచ్చేందుకు రష్యాదిగి రావడం శుభ పరిణామం. రష్యా కూడా వ్యవసాయికం గా ఎంతో అభివృద్ధి చెంది ఇతర దేశాలకుఆహార ధాన్యా లను ఎగుమతి చేస్తోంది. యుద్ధాన్ని ప్రారంభించినందు కు రష్యాపై అమెరికా, దాని మిత్ర దేశాలు ఆంక్షలు విధిం చాయి. వివిధ దేశాల్లోని బ్యాంకులలో రష్యన్‌ కరెన్సీ లావాదేవీలను నిషేధించాయి.

దీని వల్ల రష్యాకు నష్టం వాటిల్లినా, ఇంతకు ఎన్నో రెట్ల కరెన్సీని తమదేశం కలిగి ఉన్నట్టు రష్యా తరచూ ప్రకటనలు చేస్తోంది. అలాగే, చమురు, గ్యాస్‌ వంటిపెట్రో ఉత్పత్తులు రష్యా నుంచి నిషేధించడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో వీటి ధరలు పెరిగాయి. అవన్నీ ఒక ఎత్తు.ఇప్పుడు ఆహార ధాన్యాల కొరత మరో ఎత్తు. ఆహార ధాన్యాల కోసం మధ్య ప్రాచ్య దేశాలు, ఆఫ్రికా దేశాలు రష్యాపై ఆధార పడుతున్నాయి. వాణిజ్య ఒప్పందాలు అమలు జరగా లంటే వివిధ దేశాల నుంచి సరకుల రవాణా నల్లసము ద్రం మీదుగా జరగాలి. ఉక్రెయిన్‌ యుద్దం వల్ల ఈ కార్యక లాపాలు ఆగిపోయాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వస్తాయని తెలుసున్నా రష్యాతన ఆధిపత్యాన్ని నిలబెట్టుకో వడం కోసం ఉక్రెయిన్‌పై దాడి చేసింది.ఒకప్పుడుతమ దేశంలో అంతర్భాగంగా ఉండి, రష్యా అండదండలతో ఆహార, ఇంధన రంగాల్లో ఎదిగిన ఉక్రెయిన్‌ ఇప్పుడు తమ వ్యతిరేక కూటమి అయిన నాటోలో చేరడాన్ని జీర్ణించుకోలేక ఉక్రెయిన్‌పై రష్యాదాడి చేసింది. ఒకట్రెం డు నెలల్లో పూర్తి అవుతుందనుకున్న యుద్ధం ఐదో నెలలో కూడా కొనసాగడం రష్యాకు కూడాఇబ్బందిగానే ఉంది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై స్వదేశంలో తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. రాటుతేలిన జనరల్స్‌ సహా వేలాది మంది సైనికులు మరణించడం, యుద్ధ సామగ్రి, విమానాలు ధ్వంసం కావడం రష్యాకు తీరని నష్టం. అలాగే, ఉక్రెయిన్‌కి వాటిల్లిన నష్టాల నుంచి ఆదేశం బయటపడాలంటే పాతిక సంవత్సరాలు పైనే పట్టవచ్చ ని నిపుణులు అంచనా వేశారు. భవనాలు, స్థిరాస్తులు నేలమట్టమయ్యాయి. ఉక్రెయిన్‌కి కూడా అపారంగా ప్రాణ నష్టం సంభవించింది. ఇంత భారీనష్టాన్ని తట్టుకో వడం పెద్ద దేశాలకే అసాధ్యం. అమెరికా తదితర సంప న్న దేశాలు అందించిన సాయంతో ఉక్రెయిన్‌ ఈ యుద్ధా న్ని కొనసాగిస్తూ వస్తోంది. అంతేకాకుండా ప్రపంచంలో గోధుమల ఎగుమతుల్లో నాల్గవ స్థానంలో ఉన్న ఉక్రెయి న్‌ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతోంది. అలాగే, వంట నూనెల ఎగుమతిలో ఉక్రెయిన్‌ అగ్రస్థానంలో ఉంది.ఈ రెండు దేశాలనుంచి ఆహార ధాన్యాలు, చమురు, వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్న దేశాలు యుద్దం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నాయి. ఉక్రెయిన్‌ పై రష్యా యుద్ధం కొనసాగితే మూడవ ప్రపంచ యుద్ధం తప్పదేమోనన్న భయాందోళనలు వ్యక్తం అవుతున్నా యి. ఈ నేపధ్యంలో రష్యాపై ప్రపంచంలోని పలు దేశాల ఒత్తిడి కారణంగా నల్లసముద్రం మీదుగా సరకుల రవాణాకు రష్యా అంగీకరించడం మంచి పరిణామం.

రష్యా ఇప్పటికైనా ప్రపంచ దేశాల కష్టాలను దృష్టిలో ఉంచుకుని యుద్ధాన్ని విరమిస్తే అందరికీ మంచిది. ఈ యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరు. తన వైపు నుంచి వాదన సమంజసమైనదని రష్యాకు అనిపించవచ్చు. కానీ, ప్రాణ,ఆస్తి నష్టాలు వృధాగా జరిగి పోతుంటే ఎవ రూ సహించరు, సమర్ధించరు. రష్యాను సమర్ధించిన అనేక దేశాలు ఇప్పుడు రష్యాకుఈ విషయమై జ్ఞానబోధ చేస్తున్నాయి. రష్యా ఇకపైనైనా దాడులను నిలిపి పరస్ప రం ప్రయోజనకరమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. యుద్ధోన్మాది అనే పేరు ఇంతవరకూ అమెరికాకు మాత్ర మే ఉంది. ఇకపై రష్యా కూడా ఆ పేరును మూటగట్టు కోవల్సి వస్తుంది. ఇప్పటికే రష్యాకు అత్యంత సన్నిహిత దేశాలు దూరమయ్యాయి. రష్యాని ఒకప్పుడు ఆదుకునే దేశంగా భావించినా దేశాలుకూడా ఇప్పుడు అది కబళిస్తుందేమోనన్న భయంతో ఉన్నాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement