Tuesday, May 7, 2024

Tech Police: డార్క్​ వెబ్​ ఇన్వెస్టిగేషన్​పై ఫోకస్​.. సైబర్​ క్రైమ్స్​ని అరికట్టేలా పోలీసులకు అవగాహన

రోజు రోజుకూ టెక్నాలజీ మారుతోంది. నేరాల తీరులోనూ క్రిమినల్స్​ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇంతకుముందులా కత్తి పట్టుకుని తిరిగే రోజులు ఇప్పుడు లేవు. ఇప్పుడంతా సైబర్​ క్రైమ్స్​తో చెలరేగిపోతున్నారు. ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఫోన్​కు మెస్సేజ్​ పంపడం ద్వారానో, ఇన్విటేషన్​ పంపడం ద్వారానో, లేదా ఫిషింగ్​​ మెయిల్​, పోర్న్​ లింక్​ వంటివాటితో యూజర్లను అట్రాక్ట్​ చేసి.. ఆ లింకులను క్లిక్​ చేయించడం ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఇట్లాంటి టెక్నిక్స్​ని వినియోగించి అమాయకులను మోసం చేస్తున్నారు.​. ఇట్లాంటి డార్క్​ వెబ్​ క్రైమ్స్​పై తెలంగాణ పోలీస్​ డిపార్ట్​మెంట్ అలర్ట్​ అయ్యింది. ​సైబర్​ అటాక్స్​ని ఎదుర్కొనేందుకు హైదరాబాద్​లో  వర్క్​షాప్​ ​ నిర్వహిస్తోంది.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి తెలంగాణ పోలీసు డిపార్ట్​మెంట్​ సన్నద్ధమవుతోంది. డార్క్ వెబ్ దర్యాప్తు కోసం పోలీసు సిబ్బందికి అవగాహన, వారిలో సామర్థ్యాన్ని పెంపొందించడంపై పోలీసు అధికారులు దృష్టి సారించారు. డీప్ అండ్ డార్క్ వెబ్, హ్యాకింగ్, క్రిప్టో కరెన్సీ వాటి ద్వారా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరస్థులు లేటెస్ట్​ టెక్నాలజీ వినియోగించి దాడులకు తెగబడుతున్నారు. ఇట్లాంటి నేరస్తులను కనిపెట్టడానికి, వారిని పట్టుకోవడానికి కావాల్సిన డిజిటల్​ పరిజ్ఞానం పోలీసుల్లోనూ ఉండాలి. ఎందుకంటే చాలా నేరాలు ఇప్పుడు ఎక్కడో మారుమూల దేశాల నుంచి జరుగుతున్నాయి.

ఈ ఆందోళనకరమైన ధోరణిని ఎదుర్కోవడానికి తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్, కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ తో కలిసి తెలంగాణలోని పోలీసు సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని చేపట్టింది. యునైటెడ్​ కింగ్​డమ్​ (UK)కు చెందిన కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ మాజీ పోలీసు అధికారి మార్క్​ బెంట్లీతో కలిసి పోలీసు సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. ఇతను ఈ రంగంలో గత 40 సంవత్సరాలుగా క్లాసులు ఇస్తున్నారు.

ఇక.. తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ (టీఎస్‌పీఏ)లో డార్క్ వెబ్ పరిశోధకుల కోసం ఐదు రోజుల వర్క్ షాప్ నిన్న (సోమవారం) ప్రారంభమైంది. ఈ కోర్సుకు దేశం నలుమూలల నుండి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుండి పోలీసు అధికారులు హాజరయ్యారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈ వర్క్ షాప్‌ను ప్రారంభించి,  శిక్షణార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు కలిసి పోలీసింగ్‌లో డిజిటల్ కార్యక్రమాలకు లీడర్​గా వ్యవహరిస్తున్నారని, వేలాది మంది పోలీసు అధికారులకు శిక్షణ ఇవ్వడంలో తమకు అద్భుతమైన రికార్డు ఉందని చెప్పారు.

- Advertisement -

ఈ క్రమంలో 15 రకాల సైబర్ మోసాలకు సంబంధించిన ఉదాహరణలను సీపీ ఆనంద్​ తెలియజేశారు. ముఖ్యంగా లోన్ యాప్‌లు గత 10 రోజుల్లో ముగ్గురు వ్యక్తుల ఆత్మహత్యకు కారణమయ్యాయి. ఈ నేరస్థులను విచారించడం, పట్టుకోవడం చాలా కష్టంగా మారింది. అంతేకాకుండా మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసు, Xsilica ఎపేమెంట్ గేట్‌వే హ్యాకింగ్ కేసును కూడా హైదరాబాద్​ పోలీసులు గుర్తించారు. వీటి దర్యాప్తు అంత ఈజీ కాకున్నా.. దీనికి ప్రత్యేక నైపుణ్యం, వనరులు అవసరమని సీపీ తెలిపారు. డార్క్ వెబ్‌ని ఉపయోగించి క్రిమినల్స్​ మాదకద్రవ్యాలను కూడా రవాణా చేస్తున్నట్లు తెలంగాణ పోలీసుల విచారణలో వెలుగుచూసిందన్నారు.

ఈ వర్క్ షాప్‌ ప్రయోజనాలను పేర్కొంటూ సీపీ ఆనంద్ ఇలా అన్నారు.. “వాస్తవ ప్రపంచం తీరు వేరు. ఇక్కడ నేర్చుకునే అంశాలు వేరు. ఇప్పుడంతా సైబర్​ నేరాలతో క్రిమినల్స్​ రెచ్చిపోతున్నారు. ఇది పోలీసు వ్యవస్థకు సవాల్​గా మారుతోంది. దీన్ని ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టూల్స్ (OSINT) వంటి టెక్నాలజీ ద్వారా క్రాక్​ చేయవచ్చు. అయితే.. ఈ 5 -రోజుల వర్క్ షాప్, మాస్టర్ క్లాస్ సైబర్ ఇన్వెస్టిగేషన్​ వంటి సరికొత్త అత్యాధునిక విధానం, పరిశోధన రంగంలో మనల్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తున్నా” అని సీపీ ఆనంద్​ చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement