Tuesday, May 7, 2024

అల్‌ఖైదా ఖతమైనట్టేనా..

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అధ్యక్షుడు అల్‌ జవహరి అమెరికా గూఢచార సంస్థ సీఐఏ సహకారంతో సైన్యం అంతమొందించిన తీరు అందరి ప్రశంసల ను అందుకుంది. తాలిబన్ల పాలనలోఉన్న అఫ్ఘనిస్తాన్‌ లో ఉన్న జవహరి దుర్బేధ్యమైన భవనంలో కుటుంబంతో సహా ఉన్నారు. సీఐఏ అధికారులు ఆ భవనంలో జవహరి ఉన్నట్టు కనుగొనడమే గొప్ప విషయంగా భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఎప్పటికప్పుడు అతడు తన స్థావరాన్ని మార్చుకుంటూ సీఐఏనీ, అమెరికన్‌ దళాలను ఎంతో తికమక పెట్టాడు. అల్‌ ఖైదా వ్యవస్థాప కుడు బిన్‌లాడెన్‌కి అత్యంత విశ్వాస పాత్రునిగా, కుడి భుజంగా ఉన్న జవహరి వ్యూహాలను మార్చడంలో దిట్ట. అందుకే, అతడు మరణించాడన్న వార్త రెండుసార్లు వెలువడినా, అల్‌ఖైదా ఖండిస్తూ వచ్చింది. ఈసారి ఇంకా అలాంటి ప్రకటన వెలువడకపోయినా, ఎక్కడో నక్కి ఉంటాడని ఆ సంస్థ సభ్యులు నమ్ముతున్నారు. జవహరి అంతతేలికగా దొరకరన్న నమ్మకం ఆ సంస్థ సభ్యుల్లో ఉంది.

అయితే, అమెరికన్‌ సేనల డ్రోన్‌ దాడిలో అతడు మరణించినట్టు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ ధ్రువీకరించడంతో జవహరి హతమైన వార్త నిజమేనని ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి. సరిగ్గా ఇరవై ఒకటేళ్ళ క్రితం అమెరికాలోని న్యూయార్క్‌లో ప్రపంచ వాణిజ్య సంస్థ ట్విన్‌ టవర్స్‌ను కూల్చి వేసింది అల్‌ ఖైదా సంస్థ కి చెందిన మానవ బాంబులే. ఈ దాడికి వ్యూహరచన చేయడంలో అల్‌ఖైదా అధ్యక్షుడు బిన్‌ లాడెన్‌కి వ్యూహా త్మకంగా అన్ని విషయాల్లో తోడ్పాటుని అందించింది జవహరియే. బిన్‌ లాడెన్‌ని మట్టుబెట్టడానికి అమెరికాకు పదేళ్ళు పైగా సమయం పట్టింది. అతడి కుడి భుజాన్ని ఇప్పుడు అత్యంత చాకచక్యంగా, ప్రమాదరహితంగా అమెరికన్‌సేనలు మట్టుబెట్టాయి. అయితే, అప్పటికీ, ఇప్పటికీ టెక్నాలజీలో వచ్చిన మార్పుల కారణంగా జవహరిపై చడీచప్పుడు లేకుండా, పొరుగున ఉన్న వారికీ, ఇతరులకు ఎవరికీ ప్రమాదం లేకుండా రహస్య ఆపరేషన్‌ని అమెరికన్‌ సేనలు విజయవంతం చేశాయి. అమెరికాలోని ట్విన్‌ టవర్స్‌ని కూల్చివేయడంతో అంత ర్జాతీయ ఉగ్రవాద సంస్థగా అల్‌ఖైదా పేరు మోసింది. బిన్‌ లాడెన్‌ వద్ద శిక్షణ పొందిన అల్‌ బాగ్దాదీ ఏర్పాటు చేసిన ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాన్‌, అండ్‌ సిరియా (ఐఎస్‌ ఐఎస్‌- ఐసీస్‌) ప్రపంచంలో కరుడు కట్టిన ఉగ్రవాద సంస్థగా పేరు మోసింది. ఐసీస్‌ సంస్థ సిరియాలో అంత ర్యుద్ధం సమయంలో అవతరించింది. అక్కడి ప్రజలపై జరుగుతున్న దాడులను నిరోధించడమే లక్ష్యంగా ఆ సంస్థ ఆవిర్భవించింది. అయితే, ఆ తర్వాత ఆ సంస్థ తన లక్ష్యాలను మార్చుకుంది.

ఇస్లామిక్‌ స్టేట్‌ స్థాపనే తన లక్ష్యంగా ప్రకటించుకుంది. ఈ క్రమంలో ఐసీస్‌ సంస్థ సభ్యుల దాడుల్లో అనేక మంది అమాయక పౌరులు మరణించారు. చాలా మంది వికలాంగులయ్యారు. ఐసీస్‌ ఉగ్రవాద దాడుల్లో, ధన సంపాదనలో అల్‌ఖైదాని మించి పోయింది.ప్రపంచంలో అత్యంత ధనికమైన ఉగ్రవాద సంస్థ ఐసీస్‌యేనని ఇటీవల అంతర్జాతీయ నిఘా సంస్థలు ప్రకటించాయి. అయితే, వ్యూహంలో, ఎత్తుగడల్లో ఐసీస్‌ కన్నా అల్‌ ఖైదాదే ఇప్పటికీ పైచేయి గానే ఉంది. ఐసీస్‌ వ్యవస్థాపకుడు అల్‌ బాగ్దాద్‌ కూడా మరణించినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఆసంస్థలో ద్వితీయ శ్రేణి నాయకులు చాలా మంది హతులయ్యా రు. జవహరిని అంతమొందించేందుకు అమెరికన్‌ సైన్యం అత్యంత ఆధునిక మైన హెల్‌ క్షిపణులను ప్రయో గించింది. ఈ క్షిపణుకు ఆవలి వ్యక్తి శరీరాన్ని ఎటువంటి శబ్దం లేకుండా ముక్కలుగా కోసే పదును ఉంది. అంతే కాక, చుట్టుపక్కల ఉన్న వారికి గానీ, ఆ వ్యక్తి దాగి ఉన్న పరిసరాల్లో పౌరులకు కానీ, ఎటువంటి ప్రాణనష్టం కలగకుండాగురి తప్పకుండా నిర్దేశిత వ్యక్తిని అంతమొం దించగల శక్తి ఉంది. అల్‌ జవహరిపై అమెరికన్‌ సేనలు ప్రయోగించిన క్షిపణి వల్ల ఆ ప్రాంతంలో ఎవరికీ ఎటు వంటి అపాయం జరగలేదు.

అంతేకాకుండా ఆ సమ యంలో జవహరి ఉన్న భవనంలో ఎవరూ లేకపోవడం కూడా అధిక ప్రాణ నష్టం కలగకపోవడానికి ఒక కార ణం. బిన్‌ లాడెన్‌ని అంతమొందించినప్పుడు కూడా పలువురు హతమయ్యారు. అల్‌ ఖైదా అగ్రనేత మరణిం చినా, ఆ సంస్థ విధానాలు, కార్యక్రమాలను శిరోధార్యం గా పని చేసే వారు పాకిస్తాన్‌లో ఉన్నారు. పాక్‌ కేంద్రంగా పని చేస్తున్న హకానీ సంస్థ అధి పతి సాక్షాత్తూ తాలిబన్‌ మంత్రివర్గంలో సభ్యునిగా ఉన్నారు. అయితే, తాలిబన్లు అమెరికన్‌ సేనలు వైదొలగేటప్పుడు అమెరికాకు తాలిబన్లుకు ఇచ్చిన మాట తప్పారు. అల్‌ ఖైదాకి ఇంకెప్పుడూ ఆశ్రయం ఇవ్వకూడదన్న ఆ షరతను ఉల్లంఘించినం దుకు ఇకపైన తాలిబన్లపట్ల అమెరికా ఎటువంటి ప్రతీ కారం తీర్చుకుంటుందో వేచిచూడాలి. అదే సందర్భం లో అల్‌ ఖైదా సభ్యులు మరింత బరితెగింపుధోరణిలో విరుచుకుని పడే ప్రమాదం లేకపోలేదు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement