Thursday, May 2, 2024

అమర విషాదం..!

కాశీకి పోయినవాడు కాటికెళ్ళినవాడితో సమాన మన్నది పాత సామెత, కాశీకి విమానప్రయాణ సౌకర్యా న్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం వల్ల రెండు రోజుల్లో యాత్ర ముగించేసుకుని వచ్చేస్తున్నారు. అలాగే, కైలాస మానస సరోవర్‌, అమర్‌నాథ్‌, కేదార్‌నాథ్‌ యాత్రలు కూడా ఇప్పుడు సౌకర్యాలు పెరగడం వల్ల ప్రయాస లేకుండా చేసుకుని వస్తున్నారు. వెళ్ళినవారందరూ ప్రమాదాలకు లోనుకారు. తీర్థ యాత్రలంటనే ప్రాణాల కు రిస్క్‌ అన్నది నిజమే. అయితే, జీవితంలో ఒక్కసారై నా పరమేశ్వరుడు ఉండే అతి ఎత్తయిన ప్రాంతాలను సందర్శించాలన్నది హిందువుల నమ్మకం, ఆకాశంలో దేవుళ్ళు లేకపోయినా, దేవుళ్ళ గురించి మాట్లాడేటప్పు డు ఆకాశాన్ని చూపిస్తూ ఉంటారు. అలాగే, మంచుకొం డలో లయకారుడైన సదాశివుడు నివసిస్తాడన్న నమ్మకం ఉండటం వల్లనే ప్రాణాలకు తెగించి ఈ యాత్రలు చేస్తూ ఉంటారు. అమరనాథ, మానససరోవర్‌ యాత్రలకు ప్రకృతి సిద్ధమైన ఆటంకాలతో పాటు మానవ కల్పితమై న ఆటంకాలు కూడా ఉన్నాయి. పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్‌ల నుంచి ఎదురవుతున్న సమస్యల కారణంగా, యాత్రలను ప్రభుత్వం రద్దుచేసిన సందర్భాలున్నాయి. గడిచిన రెండేళ్ళుగా కరోనా మహమ్మారి వల్ల యాత్రల ను రద్దు చేశారు. ఈ ఏడాది అమరనాథ్‌ యాత్రకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసేసరికి భక్తుల ప్రాణం లేచి వచ్చినట్టయింది. అమర్‌నాథ్‌ యాత్రలో పారమార్థిక చింతన ఉన్నా, ప్రకృతిని అతి సమీపం నుంచి దర్శించవచ్చన్న కాంక్ష జనంలో ఉంది. అంతేకాక, సముద్ర మట్టానికి వేలాది అడుగుల ఎత్తయిన ప్రదేశంలో ఉన్న ఆ పుణ్య క్షేత్రాన్ని సందర్శిస్తే ఐహిక ఆముష్మిక ఫలాలు లభిస్తాయని మన పురాణాలు ఘోషిస్తున్నాయి.

అమర నాథ్‌ గుహలో ఉండేది మంచు లింగం. అది శాశ్వతంగా ఉండదు. శివుడు మంచు, వాయు, అగ్ని లింగాల్లో ఉంటాడని శివపురాణం చెబుతోంది. మే నెల నుంచి ఆగస్టు వరకూ అమరనాథ్‌ గుహల్లో శివలింగాన్ని సంద ర్శించేందుకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచే కాకుం డా, విదేశాల్లో స్థిరపడిన హిందువులు కూడా వస్తుంటా రు. అమరనాథ్‌ యాత్రతో సంకల్ప సిద్ధి కలుగుతుందన్న నమ్మకం కూడా యాత్రికుల్లో ఉంది. దీని గురించి మరో పార్శ్వం కూడా ఇటీవల కాలంలో ప్రచారంలోకి వచ్చిం ది. అది సహజంగా ఏర్పడిన మంచు లింగం కాదనీ, ఉద్దేశ్య పూర్వకంగా ఏర్పాటు చేసినదన్న కథనాలు వచ్చాయి.భక్తి ప్రచారం పెరిగినట్టే, దాని వ్యతిరేక ప్రచారం కూడా పెరుగుతోంది. అయితే, ఈసారి అమర నాథ్‌ యాత్రకు వెళ్ళిన వారిలో18 మంది మరణించా రనీ, 150 మంది గల్లంతు అయ్యారన్న వార్తలు వచ్చా యి. ఆకస్మిక వరదలవల్లే ఈ ప్రమాదం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, కుండపోత వల్ల స్వంత ఊళ్ళో ఉన్నవారికే ప్రమాదాలు తప్పనపుు డు అంత దూరం,అంత ఎత్తున ఉన్న గుహలను సంద ర్శించేవారు ప్రమాదాలకు గురి కావడం అసహజమేమీ కాదు. ఈ సారి యాత్ర జూన్‌ 30వ తేదీన ప్రారంభమైం ది. ప్రయాణీకుల భద్రతకు జమ్ము, కాశ్మీర్‌ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కాశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సిన్హాతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ తగిన ఆదేశాలు జారీ చేస్తూ వస్తున్నారు.అయినా, ఈసారి అక్కడ ఉత్పాతానికి జల ప్రళయమే కారణం. వానలు, వరదలు తగ్గిన తర్వాత యాత్రలు చేయవచ్చ న్న సలహాలకు యాత్రికులు చెప్పే సమాధానం ఒక్కటే. ప్రమాదాలు చెప్పిరావు.

అలాగే, యాత్రలకు వెళ్ళేవారం తా ప్రమాదాలకు గురి కారు. అందున జీవితాశయాన్ని నెరవేర్చుకోవడానికి ఆమాత్రం సాహసం చేయకపోతే ఎలా? అని వారి వాదన కూడా సమంజసమైన దే,ఈ యాత్రలకు అనుమతించేవారికి ఆరోగ్య పరీక్షలు చేసి చలికి, అక్కడి వాతావరణ పరిస్థితులకు తట్టుకోగలరని వైద్యులు నిర్ధారిస్తేనే యాత్రకు అనుమతిస్తారు. ఈ యాత్రల విషయంలో ప్రభుత్వం చాలా కఠినమైన నిబంధనలను అమలు జేసినట్టు సమాచారం. ఈసారి పాక్‌ ఉగ్రవాదుల నుంచి ప్రమాదం లేకపోయినా, ప్రకృ తి బీభత్సం వల్ల విషాద వార్తలను వినాల్సి వచ్చింది. కైలాస మానస సరోవర్‌ యాత్రకు చైనా మోకాలడ్డుతూ ఉంటుంది. చైనా నుంచి అటువంటి అభ్యంతరాలు రాకుండా మోడీ ప్రభుత్వం ఉత్తరాఖండ్‌ మీదుగా ప్రత్యా మ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేసింది. ఈ రోడ్డు నిర్మాణా న్ని చైనా ప్రతిఘటనల మధ్య పూర్తి చేశారు. అలాగే, అమర్‌నాథ్‌ గుహలకు చేరేందుకు కూడా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాల ను రాకాసి వర్షాలన్నా తప్పులేదు. వరుసగా వారం రోజుల నుంచి విరామం లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలం అవుతోంది. అలాంటప్పుడు అమర్‌నాథ్‌లో విషాదం సరిపెట్టుకోదగిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement