Thursday, April 18, 2024

Russia-Ukraine Updates: ఇరాన్​ పర్యటనకు వెళ్లనున్న రష్యా అధ్యక్షుడు పుతిన్​

ముఖ్యాంశాలు:

  • రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే వారం ఇరాన్‌ను సందర్శించనున్నట్లు క్రెమ్లిన్ తెలిపింది.
  • రష్యా -ఆక్రమిత ఖేర్సన్ ప్రాంతంలో నోవా కఖోవ్కా సిటీపై ఉక్రేనియన్ వైమానిక దళం జరిపిన దాడిలో దాదాపు ఏడుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. మరో 60 మందికిపైగా గాయపడ్డారు.
  • చసివ్ యార్‌లోని అపార్ట్ మెంట్ బ్లాక్‌పై రష్యా రాకెట్ దాడిలో మరణించిన వారి సంఖ్య 34కి పెరిగినట్లు ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ తెలిపింది.
  • రష్యా‌–ఉక్రెయిన్​ ప్రారంభమై ఇవ్వాల్టికి (జులై 12) 139 రోజులు అవుతోంది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే వారం ఇరాన్‌లో పర్యటించనున్నారు. ఈ అప్​డేట్​ని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఇవ్వాల తెలిపారు..  సిరియా-సంబంధిత చర్చల కోసం అస్తానా ఫార్మాట్ అని పిలవబడే ఇరాన్, టర్కీ నాయకులతో త్రైపాక్షిక భేటీలో పాల్గొనడానికి పుతిన్ వచ్చే మంగళవారం టెహ్రాన్‌కు వెళతారని డిమిత్రి చెప్పారు. ఈ పర్యటనలో పుతిన్ టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌తో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. 

కాగా, ఉక్రేనియన్ పౌరులు రష్యన్ పాస్‌పోర్ట్ లను పొందేందుకు నిబంధనలను సులభతరం చేస్తూ మాస్కో ఒక డిక్రీని ప్రచురించింది. దీంతో చాలా మంది ఉక్రేనియన్లు రష్యన్ పౌరులు కావాలని కోరుకుంటున్నారని క్రెమ్లిన్ తెలిపింది. మీడియా మీట్​ సందర్భంగా.. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. రష్యా తన సాయుధ బలగాలను ఉక్రెయిన్‌లోకి పంపిన నాలుగు నెలల తర్వాత కైవ్‌తో శాంతి చర్చలను పునఃప్రారంభించడంపై ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. ఫిబ్రవరి నుండి ఆక్రమించిన దక్షిణ, తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాల నివాసితులు రష్యన్ పౌరులుగా మారడానికి అర్హులని ఈ సందర్భంగా రష్యా పేర్కొంది.

ఇక.. యురోపియన్​ యూనియన్​(EU) ఆర్థిక మంత్రులు ఒక బిలియన్ యూరోల ఆర్థిక సహాయాన్ని ఉక్రెయిన్‌కు సాయం అందించేందుకు ఆమోదించారు. యూరోపియన్ నాయకులు మేలో చేసిన వాగ్ధానం మేరకు కైవ్ కోసం తొమ్మిది –బిలియన్ -యూరోల (డాలర్) బడ్జెట్ కి సంబంధించి మొదటి విడతగా ఈ అమౌంట్​ అందివ్వనున్నారు. ఉక్రెయిన్‌కు ఈ ఫండ్స్​ అత్యవసర అవసరాల కోసం, మౌలిక సదుపాయాలు కల్పించడానికి అందిస్తున్నామని చెక్ రిపబ్లిక్ ఆర్థిక మంత్రి  సబినెక్​ స్టాంజురా (Zbynek Stanjura) తెలిపారు. కాగా, రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్ ప్రాంతంలోని సివెర్స్క్ పట్టణాన్ని చుట్టుముట్టాయి. రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్​ (TASS) ఈ వివరాలు వెల్లడించింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement