Wednesday, April 24, 2024

అక్టోబ‌ర్ 5న – థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్న ది ఘోస్ట్

అక్టోబ‌ర్ 5న ద‌స‌రా కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ది ఘోస్ట్ చిత్రం. ఈ చిత్రంలో టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌ని పోషిస్తున్నాడు.కాగా ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఒక యాక్ష‌న్ ఎపిసోడ్ మినహా చిత్ర‌బృందం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ చిత్రం అనౌన్స్ చేసిన‌ప్పటి నుండి సినిమాపై మంచి బ‌జ్ ఏర్ప‌డింది. ఇటీవ‌లే విడుద‌లైన గ్లింప్స్ భారీ స్థాయిలో అంచ‌నాలు నెల‌కొల్పింది. ది ఘోస్ట్ చిత్రంలో నాగ్‌ ఇంట‌ర్‌పోల్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. సోనాల్ చౌహ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌రా సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌ల‌పై సునీల్ నారంగ్‌, పుస్కురి రామ్‌మోహ‌న్ రావు, శ‌ర‌త్ మ‌రార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement