Thursday, May 2, 2024

మహా ప్రతీకారం!.

మహారాష్ట్రలో మహావికాస్‌ ఆగాధీ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కూలిపోయే విధంగా రాజకీయ పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు తొందర పెడుతున్న పరిణామాలు రాజ్యసభ ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నిక. 2019లో బీజేపీ, శివసేన కూటమి నుంచి బైటికొచ్చి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాకరే కాంగ్రెస్‌, నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)తో చేతులు కలిపి మహావికాస్‌ ఆగాధీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతీకారం తీర్చుకోవడం కోసం బీజేపీ ఎదురు చూస్తోంది. ఒకప్పుడు శివసేన లో రెండో స్థానం లో ఉన్న నారాయణ్‌రాణ ఉద్దవ్‌ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జోస్యం చెప్పారు. ఆయన ఉద్ధవ్‌తో విభేదాల కారణం గానే శివసేన నుంచి కాంగ్రెస్‌లోచేరి ఆ తర్వాత బీజేపీలో ప్రవేశించారు. ఆయన కేంద్రంలోఏ పార్టీ అధికారంలో ఉన్నా తన పదవిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుం టారు. ఆయన మాదిరిగా శివసేనలో ఉద్దవ్‌ థాకరేతో విభేదాల కారణంగా ఏక్‌నాథ్‌ షిండే ప్రస్తుతం తిరుగు బాటు చేశారు.21 మంది ఎమ్మెల్యేలతో ఆయన గుజరాత్‌ సూరత్‌లోని ఒక హొటల్‌లో తిష్ఠ వేశారు. దాంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మరో ఐదుగురు కూడా షిండే శిబిరంలో చేరినట్టు కథనం. మహారాష్ట్ర శాసనసభలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 288కాగా ఇద్దరు ఎమ్మెల్యేలు జైలులో ఉన్నారు. ఒక ఎమ్మెల్యే కన్నుమూశారు.బీజేపీ బలం 134. మరో పదకొండు మంది ఉంటే బీజేపీ ప్రభు త్వాన్ని ఏర్పాటు చేయడానికి సాధారణ మెజారిటీ లభిస్తుంది. 2019 లో తమ పార్టీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడకుండా దెబ్బతీసిన ఉద్ధవ్‌ థాకరేని గద్దె దింపేందుకు, ప్రతీకారం తీర్చుకునేందుకు ఇదే అదను గా కమలనాథులు భావిస్తున్నారు. పైగా రాష్ట్రపతి ఎన్నిక ల్లో ఓట్లు అవసరం కనుక, ఇదే సమయంలో ఉద్ధవ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ముహూర్తం పెట్టారు.ఈ పరిణామాలన్నీ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కనుస న్నల్లోనే జరుగుతున్నట్టు శివసేన అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు.

ఆమాటకొస్తే, రెండున్నర దశాబ్దాలు పైగా సాఫీగా సాగిపోతున్న బీజేపీ శివసేన సంకీర్ణ కూటమి చీలిపోవడానికి సంజయ్‌ రౌత్‌ కారణ మనీ, ఉద్ధవ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం తమ పార్టీకి లేదని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ స్పష్టం చేశారు. కాగా, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఢిల్లి లో అమిత్‌షా, బీజేపీ జాతీయా అధ్యక్షుడు జెపీ నడ్డాతో సంప్రదింపులు జరుపుతూ, వేగంగా మారుతున్న మహారాష్ట్ర రాజకీయ పరిణామా లను వారికి వివరిస్తున్నారు. జరుగుతున్న పరిమాణా మాలను శ్రద్ధగా పరిశీలిస్తే 2019లో జరిగిన దానికి అంతకుఅంతా బదులు తీర్చుకోవడానికి బీజేపీ కృత నిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తోంది. అసలీ పరిణామాలు ఇలా చోటు చేసుకోవడానికి ఉద్ధవ్‌ థాకరే తనయుడు, రాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే జోక్యం విపరీతంగా పెరిగి పోవడమేనని షిండే వర్గీయులు పేర్కొంటున్నారు. బాలథాకరే ఆశయాలకు కట్టుబడి పార్టీని అధికారంలోకి తెచ్చారనీ,సీనియర్లను పక్కన పెట్టి ఆదిత్యథాకరే పెత్తనం చేస్తున్నారని షిండే ఆరోపించారు. కాగా, ఏకనాథ్‌కి ముఖ్యమంత్రి పదవిపై ఎప్పటినుంచో కన్ను ఉంది.2019లోమహాఆగాధీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏక్‌నాథ్‌కి వచ్చిందనీ, శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ అడ్డుపడటంతో ఉద్దవ్‌ థాకరే కూటమి నాయకత్వాన్ని స్వీకరించాల్సి వచ్చిందని షిండే అనుయాయులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా శివసేనతో భావసారూప్యం లేని పార్టీలై న కాంగ్రెస్‌,ఎన్సీపీలతో ఉద్ధవ్‌ థాకరే చేతులు కలపడాన్ని మొదటి నుంచి షిండే వ్యతిరేకిస్తున్నారనీ, పదవి కోసం కాకుండా బాల్‌థాకరే సిద్ధాంతాలను పరిరక్షించేందుకే షిండే ప్రయత్నిస్తున్నారని ఆయన వర్గీయులు పేర్కొం టున్నారు. కాగా,షిండేని లెజిస్లేచర్‌ పార్టీ నాయకత్వ పదవి నుంచి ఉద్ధవ్‌ తొలగించారు.దాంతో ఇరువర్గాల మధ్య సామరస్యం కోసం జరుగుతున్న ప్రయత్నాలు మరింత జటిలమయ్యాయి. ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని తెరవెనుక నుంచి నడిపిస్తున్న శరద్‌ పవార్‌ ఎట్టి పరిస్థి తుల్లోనూ తాము బీజేపీతో జత కట్టబోమనీ, అలాగే, బీజేపీ అధికారంలోకి రాకుండా చూస్తానని ప్రకటించా రు. ఆయన ముంబాయిచేరుకుని వివిధ వర్గాలతో చర్చ లు జరుపుతున్నారు. మరాఠా స్ట్రాంగ్‌ మ్యాన్‌గా పేరొంది న ఆయన ఏం మంత్రం వేస్తారో చూడాలి.అది పని చేయకపోతే ఉద్దవ్‌ థాకరే ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టే. ఏక్‌నాథ్‌ షిండేతో ఉద్దవ్‌ థాకరే ఫోన్‌లో మాట్లాడారు. షిండేతో పాటు వెళ్లినవారు తిరిగి వస్తే వారి డిమాండ్స్‌ పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు షిండే శిబిరం లో ఎమ్మేల్యేలకు రక్షణ లేదని వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement