Saturday, April 20, 2024

ప్ర‌మాద‌క‌ర‌మైన డ్రైవింగ్ -వీడియో పోస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు

బైక్ అన్నాక ల‌గేజ్ తీసుకెళ్ల‌డం సాధార‌ణ‌మే.కానీ ఇక్క‌డో వ్య‌క్తి స్కూటీపై ల‌గేజీని నింపి తాను మాత్రం వెన‌క ఎక్క‌డో కూర్చున్నాడు. దాంతో అత‌నిని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు సాగ‌ర్ అనే వ్య‌క్తి. కాగా ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరు.. ఎక్కడ అనేది తెలియదు కానీ… వీడియో మాత్రం వైరల్ గా మారింది. అతని కాళ్లు కిందకు ఆనుతున్నాయి.. స్కూటర్ హ్యాండిల్ అందుకోలేంత చివరలో కూర్చొని అతను డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ వీడియోని తెలంగాణ పోలీసులు కూడా షేర్ చేశారు.కాగా ఈ వీడియోని ఇప్పటి వరకు 7లక్షల మందికి పైగా వీక్షించారు.

నెటిజన్లు ఈ వీడియో చూసిన తర్వాత తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. కానీ.. అతని డ్రైవింగ్ చూస్తే.. ఎవరికైనా భయం పుట్టాల్సిందే. అంత భయంకర స్థితిలో కూర్చొని డ్రైవ్ చేస్తుండటం గమనార్హం. ‘ వెకేషన్ తర్వాత అమ్మ ఇంటి నుంచి వెళ్తున్నట్లుగా ఉంది’ అంటూ ఒకరు కామెంట్ చేయడం గమనార్హం. వాట్సాప్ డేటాబేస్ ఫోల్డర్ లా ఉందని ఒకరు కామెంట్ చేయడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement