Tuesday, May 7, 2024

ఎడిటోరియ‌ల్ – వాగ్బాణాలే ….జ‌వాబు లేదు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంభాషణా చతురు డు. పదప్రయోగాలతో, వాగ్బాణాలతో ప్రతిపక్షాలను నోరెత్తనీయకుండా చేస్తున్నారు. ఎక్కడ ఏ పదం ఉప యోగించాలో, ఏ ఉపమానాన్ని వాడాలో ఆయనకు బాగా తెలుసు.ఇందుకు ఎన్నో ఉదాహరణలు. తాజాగా, అదానీ వ్యవహారంలో ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టేందుకు ఆయన ప్రతిపక్షాలు విసిరే బురదలోనూ కమలం వికసిస్తుందంటూ సెటైర్‌ వేశారు.ఇది వినడానికి ఎంతో సొంపుగా ఉంది. లాజికల్‌గా ఉంది. నైతికంగా మాత్రం నిలబడదు. తన ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణ లకు సూటిగా సమాధానం చెప్పకుండా యూపీఏ కాలం నాటి కుంభకోణాలను ఏకరవు పెట్టి ప్రతిపక్షాల నోళ్ళు మూయించేందుకు ప్రయత్నించారన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తం అవుతోంది. యూపీఏ పాలనలో స్పెక్ట్రమ్‌, బొగ్గు కుంభకోణాలపై ఆరోపణలు, ప్రత్యారోప ణలతో పార్లమెంటు రోజుల తరబడి వాయిదా పడింది. ఇప్పుడు అదానీ వ్యవహారం పార్లమెంటును రోజుల తరబడి కుదిపేస్తోంది. ప్రధాని ప్రస్తావించిన యూపీఏ కాలం నాటి కుంభకోణాలపై విదేశీ సంస్థల నుంచి మాట పడలేదు.అదానీ నడిపిన వ్యవహారాన్ని గురించి అమె రికాకి చెందిన పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ వ్యాఖ్యాని స్తూ జాతీయవాదం ముసుగులో కోట్లాది విలువైన షేర్ల ను మసిపూసి మారేడు కాయ చేశారంటూ వ్యాఖ్యానిం చింది.

యూపీఏ హయాంలో వెలుగు చూసిన కుంభ కోణాల సందర్భంగా ఏ విదేశీ సంస్థా ఈ మాదిరి వ్యాఖ్య చేయలేదు. స్ప్రెక్ట్రమ్‌ కుంభకోణంలో యూపీఏ ప్రధాన భాగస్వామ్య పక్షానికి చెందిన డిఎంకె నాయకుడు రాజా నూ, ఆనాటి డిఎంకె అధ్యక్షుడు కరుణానిధి కుమార్తె, పార్లమెంటు సభ్యురాలు కనిమొళిని జైలులో పెట్టారు. యూపీఏ హయాం నాటి కుంభకోణాలు కేవలం జాతీ య స్థాయిలోనే ప్రభుత్వం ప్రతిష్టను మంటగలపగా, ఇప్పటి అదానీ వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వప్రతిష్టను మసకబార్చింది. దీనిని గురించి ప్రతి పక్షాలు ప్రస్తావించినప్పుడు ప్రధానమంత్రి కనీసం మాట మాత్రంగానైనా సమాధానం చెప్పలేదు. కాంగ్రెస్‌ హయాంలో జరిగిన కుంభకోణాల గురించి ఆయన ఇదే సభలో ఇదే స్థానంలోఉండి ఎన్నిసార్లు ఎండగట్టారో నిరంతర వార్తా స్రవంతులను వీక్షిస్తున్న వారికి తెలుసు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగానికి కృతజ్ఞతలు తెలియజేసే అవకాశాన్నీ,సమయాన్నీ ఆయ న తన ప్రభుత్వం చేసిన మంచి పనులకు, ప్రతిపక్షాలపై విమర్శలకే ఎక్కువ వినియోగించారు. రాజ్యాంగంలోని 356వఅధికరణాన్ని వినియోగించి రాష్ట్ర ప్రభుత్వాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం పడగొట్టిందంటూ మోడీ వెల్లడించి న గణాంకాల వివరాలను ఎవరూ కాదనడం లేదు. అయితే, 8 రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలను ఫిరా యింపుల ద్వారా పడగొట్టింది తమ ప్రభుత్వ హయాం లోనేనన్న సంగతిని విస్మరించారు.

అవినీతి విషయం లో తమ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోందం టూ మోడీ చెప్పుకొచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి గురించి మీడియాలో రోజూ కథనాలు వస్తున్నా యి. కర్నాటకలో సాక్షాత్తూ మంత్రులే పనుల్లో కమిషన్‌ డిమాండ్‌ చేయడం వల్ల ఇద్దరు కాంట్రాక్టర్లు ఆత్మహత్య లు చేసుకున్న ఘటనలకు ప్రధాని ఏంసమాధానం చెబు తారు. అసోంలో, త్రిపురలో అవినీతి ఆరోపణల కారణం గానే ముఖ్యమంత్రులను మార్చాల్సి వచ్చింది. అంత మాత్రాన కాంగ్రెస్‌ అవినీతినీ,యూపీఏ భాగస్వామ్య పక్షాల అవినీతినీ ఎవరూ సమర్ధించరు. కానీ, అవినీతి విషయంలో కాంగ్రెస్‌, బీజేపీ దొందూ దొందే అని ప్రజ లు బాహాటంగా చెప్పుకుంటున్నారు.కరోనా నిరోధక వ్యాక్సిన్ల తయారీ, పంపిణీ గురించి ప్రధానమంత్రి పదే పదే చెబుతున్నారు.రెండు వ్యాక్సిన్ల తయారీ యూనిట్ల కు యూపీఏ హయాం లోనే బీజాలు పడ్డాయి. విదేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేయడంలో మోడీ చొరవ చూపడం వల్లనే ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం భారత్‌ని ప్రశంసిం చింది

పొరుగుదేశాలు, మిత్ర దేశాలు కష్టాల్లో ఉన్నప్పు డు ఆదుకోవడం అనేది యూపీఏ హయాంలోనూ జరిగింది.అలాంటివి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా క్రమానుగతంగా జరిగిపోతూ ఉంటాయి. కుంభకోణాల పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు కాంగ్రెస్‌ హయాంలో జరిగింది. బోఫోర్స్‌ కుంభకోణంపై ఆనాటి కేంద్ర మంత్రి శంకరానంద నేతృత్వంలో జేపీసీని ఏర్పా టు చేయడం జరిగింది. అదానీ వ్యవహారంపై జేపీసీని ఏర్పాటు చేయమన్న ప్రతిపక్షాల డిమాం డ్‌ని ఆమోదిం చేందుకు మోడీ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది. వాదనా పూర్వకంగా తీసుకుంటే ఇలాంటివి ఎ న్నో ఉన్నా యి. ప్రతిపక్షాల డిమాండ్లకు స్పందించడం ప్రభుత్వం ధర్మం. అందుకు విరుద్ధంగా ఏవేవో చెప్పుకుంటూ పోవ డం తప్పించుకోచూడటమే. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలకు ప్రధానమంత్రి సూటిగా సమాధానాలు చెప్ప లేదు. ఎదురుదాడితోనే తన ప్రసంగాన్ని ముగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement