Saturday, October 12, 2024

Breaking : ఆటో బోల్తా.. 16 మందికి గాయాలు.. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం

వాజేడు ప్రభ న్యూస్ : ఆటో బోల్తా పడి 16 మంది కూలీలకు గాయాల‌య్యాయి.ఈ సంఘటన ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో శుక్రవారం జరిగింది.. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఏటూరు నాగారం మండలం దొడ్ల కొత్తూరు గ్రామానికి చెందిన. గిరిజన కూలీలు వాజేడు మిర్చి కొత్త నిమిత్తం ఆటోలో వెళ్తుండగా వాజేడు మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామం వద్ద ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న 16 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది ఈ సంఘటన తెలుసుకున్న వాజేడు మండల ఆటో యూనియన్ సభ్యులు అక్కడికి చేరుకొని గాయపడిన కూలీలను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.. ఎస్సై కొప్పుల తిరుపతిరావు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించడమే కాకుండా.. గాయపడిన వ్యక్తులను వైద్యశాలకు తరలించడంలో కీలకపాత్ర పోషించారు వాజేడు వైద్యశాలలో వైద్యులు ప్రధమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం ఏటూరు నాగారం తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement