Monday, April 29, 2024

జోషిమ‌ఠ్ గుణ‌పాఠాలు…

ఆదిశంకరాచార్యులు వారుదేశం నలుమూలలా నాలుగు మఠాలను స్థాపించారు. వాటిలో ప్రధానమైన ది కర్నాటకలోని శృంగేరీ కాగా, ఉత్తరాదిన జోషిమఠ్‌ ముఖ్యమైనది. జోషీర్‌ మఠ్‌కి కాలక్రమంలో జోషి మఠ్‌ అనే పేరు స్థిరపడింది. జోషి మఠ్‌కీ, సమీపంలోని భవనాలకు భద్రత లేదని 1976లోనే మిశ్రా కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న ఈ మఠానికి ఆధ్యాత్మికంగా ఎంతో పేరు ఉంది. ఈ మఠాన్ని సంద ర్శిస్తే, కాశీ, రామేశ్వరం సందర్శన ఫలాన్ని పొందుతా మని హిందువుల నమ్మకం. కేదార్‌నాథ్‌, బదరీనాథ్‌లకు ఈ మఠం గేట్‌వే అంటే ముఖ ద్వారం వంటింది. ఈ మఠం ఇప్పుడు పగుళ్ళతో, ఏ క్షణంలోనైనా కూలిపోయే పరిస్థితి.ఏ ఒక్కరి వల్లనో, ఏ ఒక్క రోజులోనో జరిగింది కాదు. దశాబ్దాలుగా ఈ మఠాన్ని ప్రభుత్వాలు, పాలక మండళ్ళు నిర్లక్ష్యం చేస్తూ రావడం వల్ల ఈ పరిస్థితి ఏర్ప డింది. హిమాలయ పర్వత సానువుల్లో నెలకొని ఉన్న జోషి మఠ్‌ చేరడమే గొప్ప విజయంగా భావిస్తారు యాత్రికులు. ఎన్నో అవస్థలు పడినా అక్కడ సరైన వసతి సదుపాయం లేకపోవడం ఒక కారణమైతే, సరైన ఆదర ణ లేకపోవడం రెండో కారణం.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చార్‌ధామ్‌ యాత్ర కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ, పవిత్రమైన ఈ జోషిమఠ్‌ ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేయడం లేదని విమర్శించే ముందు, ఈ మఠ్‌ పాలక మండలి, రాష్ట్ర ప్రభుత్వం పాత్రను కూడా నిశితంగా పరిశీలించాల్సి ఉంది. అవిభక్త ఉత్తరప్రదేశ్‌లో ఈ మఠ్‌ నిర్లక్ష్యానికి గురి అయింది. ఉత్తరాఖండ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం శ్రద్ధ తీసుకోవడం ప్రారంభించింది. అయితే, అప్పటికే ఈ ప్రాంతంలో భవనాలు పగుళ్ళు తీశాయి. పునాదులు గుల్లబారిపోయాయి. ఈ మఠం సమీపంలో 4,500 భవనాలు, ఇళ్ళు ఉండగా, వీటిలో 600 వరకూ బీటలు వారాయనీ, ఆ భవనాలు ఏ క్షణంలోనైనా కూలిపోవ చ్చని నిపుణులు నిగ్గు తేల్చారు. జోషిమఠ్‌ ప్రమాదకర పరిస్థితులలో ఉందని తెలియగానే ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాష్ట్ర ముఖ్యమంత్రితోనూ, విపత్కర నివారణ విభాగం నిపుణలతోనూ చర్చలు జరిపి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. జోషిమఠ్‌ సందర్శించేవారికి రక్షణ కల్పించేందుకు తక్షణ చర్యలకు, ప్రత్యామ్నాయా లను సూచించాలని నిపుణులను ఆదేశించారు. ఉత్తరా ఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ దామి ఇప్పటికే ఆ మఠాన్ని సందర్శించి నిపుణులతో చర్చించారు.

జోషి మఠ్‌కి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత ఉంది. కేదార్‌ నాథ్‌, బదరీనాథ్‌ యాత్రలు చేసేవారు ఈ జోషి మఠ్‌ని తప్పని సరిగా సందర్శిస్తారు.ఈ మఠాన్ని సందర్శించక పోతే తమ యాత్ర పూర్తి కాదని వారి నమ్మిక. ఏటా వేలాది మంది యాత్రికులు సందర్శించే ఈ పవిత్ర క్షేత్రాలకు తగిన రక్షణ లేదు. ఈ క్షేత్రాల స మీపంలోనే అక్రమ తవ్వకాలు, కట్టడాల నిర్మాణాలు జరుగుతున్నా యి. పర్వత సానువులపై ఏపాటి పట్టు ఉంటుందో ఊహించడం కష్టం కాదు. అయినప్పటికీ, అక్రమంగా ప్రభుత్వాలకు తెలియకుండా తవ్వకాలు జరుగుతున్నా యి. కొన్ని తవ్వకాలు అక్కడి అధికారుల ఆమోదంతోనే జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్షేత్రాలకు వచ్చే ఆదాయాన్ని వాటి పునరుద్ధరణ లేదా, జీర్ణోద్ధరణ కు ఖర్చు చేస్తే చాలు. కానీ, అలాకూడా జరగడం లేదు. మఠాలు, గుళ్ళు, గోపురాలకు వచ్చే ఆదాయంలో మూడొంతులు స్వాహా అవుతున్నట్టు ఆరోపణలు వస్తు న్నాయి. పైగా, ఇలాంటి పవిత్రమైన ప్రదేశాల వద్ద అసాంఘికమైన కార్యకలాపాలు జరుగుతున్నట్టు కూడా ఆరోపణలు తరచు వస్తున్నాయి.

- Advertisement -

ఉత్తరాఖండ్‌లో సంభ వించిన వరదల్లో కేదార్‌నాథ్‌, బదరీనాథ్‌ ప్రాంతాలు రెండేళ్ళ క్రితం ఎంత దారుణంగా దెబ్బతిన్నాయో దృశ్య మాధ్యమాల్లో జనం అంతా వీక్షించారు. ఈ యాత్రకు వెళ్ళిన వారు వరదల్లో చిక్కుకోవడం ఒక ఎత్తు అయితే, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఎన్‌డిఆర్‌ఎఫ్‌ వంటి కేంద్ర ప్రభుత్వ దళాలకు ఎంతో కష్టమైంది. జోషి మఠ్‌తో పాటు ఉత్తర కాశీ, నైనిటాల్‌ వంటి ప్రాంతాలకు ముప్పు ఉందని రెండు దశాబ్దాల నుంచి హెచ్చరిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కుమౌన్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బహదూ ర్‌ సింగ్‌ తెలిపారు.జోషిమఠ్‌ ప్రాంతం కుంగిపోవడా న్ని జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రం తక్షణ చర్యలు చేపట్టాలని ద్వారాకా పీఠాధిపతి దేశంలోని పలు హిందూ సంస్థలూ కోరాయి. పగుళ్ళు తీసిన ఇళ్ళల్లోని వారిని తాత్కాలికంగా పునరావాస కేంద్రాలకు తరలిం చారు. వారికి శాశ్వత ఆవాసాలు కల్పించాలి. ఇతర పనులనైనా పక్కనపెట్టి ఈ ప్రాంతంలో శాశ్వత నిర్మాణా ల విషయంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే మాట పడాల్సి వస్తుంది. యాత్రికులను అనుమతించ డంపై కూడా ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement