Wednesday, May 1, 2024

Editorial – విశ్వ‌క‌ర్మ‌…గ్రామ స్వ‌రాజ్యానికి ఆయువుప‌ట్టు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వాతంత్య్ర దినోత్స వం నాడు ఎర్రకోట వద్ద చేసిన ప్రసంగంలో వివిధ పథకాలను త్వరలో అమలుజేయనున్నట్టు ప్రక టించారు.ఈ పథకాలు ఎన్నికలను ఉద్దేశించి ప్రక టించినవి కావు.మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వివిధ స్థాయిల్లో అమలు జేసేందుకు ఇప్ప టికే చర్యలు తీసుకున్నవే.ముఖ్యంగా,చేతివృత్తుల వారికి రాయితీలపై రుణాలను అందించే పథకం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బడుగు,బలహీన వర్గాలకు చేయూ తనిస్తుంది.ఇలాంటిదే ఒక పథకం ప్రస్తుతం అమలులో ఉంది.మధ్యతరగతి,చిన్నతరహా, లఘు,కుటీర పరిశ్ర మల వారి కోసం కేంద్రం ఇప్పటికే ఎంఎస్‌ఎంఈ పేరిట ఒక పథకాన్ని అమలు జేస్తోంది. చేతివృత్తి పని వారు ఎవరిపైనా ఆధారపడకుండా బ్యాంకు రుణాలను పొంది స్వంతంగా యూనిట్లను ప్రారంభించుకునేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది.ఈ పథకాన్ని సెప్టెంబర్‌ 17వ తేదీన విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రారంభించనున్నారు.

మహాభారతంలో మయసభ పేరు తెలియని వారెవరూ ఉండరు. విశ్వకర్మ మయసభ ను నిర్మించాడు. కళా నైపుణ్యానికి పేరొందిన మయసభ పదాన్ని చాలా సందర్భాల్లో వినియోగిస్తూ ఉంటాం. చేతి వృత్తులనేవి తరతరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో కీల కంగా వ్యవహరిస్తున్నాయి. ఇనుము, కొయ్య, మట్టితో పాత్రలు,గృహోపకరణాలు వాహనాలు,మనిషి జీవన యానానికి తోడ్పడే వివిధ సాధనాలనూ, పనిముట్లను తయారు చేసే చిన్నతరహా,కుటీర పరిశ్ర మలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ్థకు జీవగర్రగా నిలిచాయి. ఇప్పటికీ నిలుస్తున్నాయి. కుటీర, చిన్నతరహా పరిశ్ర మలు గ్రామస్వరాజ్యానికి దోహదం చేస్తాయని జాతిపిత మహాత్మా గాంధీ ఆనాడే స్పష్టం చేశారు.చిన్న పరిశ్ర మలు,పెద్ద పరిశ్రమల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కూడా ఆనాడు ఆయన ఉద్బోధించారు. గ్రామాల్లో చిన్నతరహా,కుటీర పరిశ్రమలు మూలప డటం వల్లనే పట్టణాలు,నగరాలకు వలసలు పెరిగాయి. ఎంతో నైపుణ్యం కలిగిన చేతివృత్తి పని వారు నగరాలు, పట్టణాల్లో దుకాణాలు,మాల్స్‌లలో ఉపాధి కోసం చేరిపోతున్నారు.

తరతరాలుగా అబ్బిన చేతివృత్తులను వదిలేసి తక్కువ వేతనంపై ఏమాత్రం ప్రాధాన్యం లేని పనుల్లో చేరిపోతున్నారు.అలాంటి వారిలో ఆత్మవిశ్వా సాన్ని పెంపొందించేందుకు విశ్వకర్మ పథకం ఎంతో ఉపయోగపడుతుంది.ఈ పథకం కింద లక్ష నుంచి రెండు లక్షల దాకా ఐదు శాతం వడ్డీ రేటుతో బ్యాంకుల నుంచి పరికరాల కొనుగోలు కోసం 15వేల రూపాయిల వరకూ రుణాలను మంజూరు చేయనున్నారు.వృత్తి పని వారికి రోజుకు 500 రూపాయిల ఉపకార వేతనంతో మెరుగైన శిక్షణ ఇవ్వనున్నారు.ఈ పథకం సామాన్యు లను అసామాన్యులుగా మార్చనున్నది. శిక్షణ పొందిన వారుసొంతంగా ప్రారంభించే యూనిట్లు కృషి, అకుం ఠిత దీక్ష కారణంగా అచిర కాలంలోనే పెద్ద యూనిట్లుగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. సంప్రదాయ కళాకారులు,వడ్రంగులు, స్వర్ణకారులు, రజకులు, నేత పని వారు,కుమ్మర్లు, కమ్మర్లు వంటి వివిధ కులాలకు చెందిన వారు సంప్రదాయ సిద్ధమైన వృత్తులను కొన సాగించేందుకు,గౌరవ ప్రదంగా జీవించేందుకు ఈ పథ కం ఎంతో ఉపయోగపడుతుంది..

కులవృత్తుల వారి కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ మాదిరి పథకా లను అమలు జేస్తోంది.కులవృత్తుల వారికి ఆత్మగౌరవ భవనాలను కూడా నిర్మిస్తోంది.కులాల వారీగా వర్గీకరిం చడం ప్రభుత్వఉద్దేశ్యం కాదు.అందరూ గుమా స్తాలుగా, ఇంజనీర్లు,డాక్టర్లుగా తయారవలేరు కదా. ఎవరికి ఏ రంగంలో ఆసక్తి ఉంటే వారు ఆ రంగంలో వృ ద్ది చెందేట్టు చేయూతనివ్వడమే ప్రభుత్వ ఉద్దేశ్యం.నైపు ణ్య భారత్‌ పేరిట ఇప్పటికే పెక్కు కార్యక్రమాలను కేంద్రం ప్రవేశపెట్టింది. ఏ రంగంలోనైనా నైపుణ్యం లేనిదే రాణించలేరు. ఆఖరి కి డిజిటల్‌ ఇండియా ప్రాజెక్టు ద్వారా 5.25 లక్షల మంది ఐటి ఉద్యోగుల నైపుణ్యాన్ని పెంపొందించే కార్యక్రమా న్ని కూడా అమలుజేయ నున్నారు.దీంతో పాటు సూపర్‌ కంప్యూటర్లను అందు బాటులోకి తీసుకుని రానున్నారు. పట్టణాలు, నగరాల్లో ఈ బస్సు సేవా కార్యక్రమాన్ని ప్రారంభించ నున్నారు.169 పట్టణాలు,నగరాల్లో ఈ బస్సు సర్వీసులను ప్రారంభిస్తారు.కాలుష్య నియంత్రణ ప్రధాన లక్ష్యంగా వీటిని ప్రారంభించనున్నారు.రైల్వే లైన్ల విస్తరణ, డబ్లింగ్‌ పనులను త్వరలో ముమ్మిరం చేయను న్నారు.ఈ పనులు పూర్తి అయితే హైదరాబాద్‌- బెంగళూరు మధ్య 50 కిలోమీటర్ల దూరం తగ్గను న్నది.అలాగే, ఇతర నగరాలకూ దూరం తగ్గను న్నది. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ పథకాలను అమలు జేయనున్నారు. ప్రధాని నోటంట వెలువడిన పథకాలకు కార్యరూపం ఇచ్చే కార్యక్ర మాలపైఆ మరునాడే నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.

Advertisement

తాజా వార్తలు

Advertisement