Tuesday, April 30, 2024

Basara Hostel : బీసీ విద్యార్థుల‌కు పురుగుల అన్నమే దిక్కు..

నిర్మల్ జిల్లా బాసర బీసీ హాస్టల్ లో విద్యార్థులకు పురుగులతో కూడిన అన్నం, కుళ్ళిపోయిన కూరగాయలతో కూరవండి పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఈ అన్నం తినలేక ఖాళీ కడుపులో పడుకోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ… తాగడానికి నీరు లేక ఇబ్బంది పడుతున్నామని వాటర్ ప్యూరిఫై పది రోజుల నుంచి పనిచేయడం లేదని ఆవేదన చెందారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement