Sunday, April 28, 2024

దెబ్బతిన్న బెబ్బులి… నితీశ్‌!

బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఏ పదవీలేని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీని కలుసుకోవడం విశేషమే. ఆయన కొద్ది రోజుల క్రితం బీజేపీతో తెగతెంపులు చేసుకుని కాంగ్రెస్‌, ఆర్‌జెడిల జతకట్టారు.నితీశ్‌ కుమార్‌ స్వతహాగా కాంగ్రెస్‌ వ్యతిరేకి.అందుకే ఆయన బీజేపీ కూటమిలో ఎన్ని అవ మానాలు ఎదురైనా కొనసాగారు. మహారాష్ట్రలో శివసేన నేతృ త్వంలోని ఆగాడీ కూటమి ప్రభుత్వాన్ని పడ గొట్టేందుకు ఆడిన రాజకీయ అంతర్నాటకాన్ని బీహార్‌లో కూడా కమలనాథులు ప్రయత్నిస్తారేమోనన్న ముందు జాగ్రత్తతో బీజేపీ కూటమినుంచి తప్పుకున్నారు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూటమిలో చేరారు. మణిపూర్‌లోనూ, అంతకు ముందు హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ జనతాదళ్‌(యు) ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి బీజేపీలో చేర్చుకున్నందుకు పట్ల ఆ పార్టీపై నితీశ్‌ ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న మీ పార్టీ నాయకులను కట్టడి చేయలేరా అని ఆయన ప్రధానమంత్రిని సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ అనుసరిస్తున్న పద్దతుల పట్ల ఏవగింపుతోనే నితీశ్‌ బీజేపీయేతర పార్టీలను ఒకే తాటిపై కి తెచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.బీజేపీ అధి కారంలోకి వచ్చిన తర్వాత ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువుల ధరలపెరుగుదలకు వ్యతిరేకంగా రాహుల్‌ గాంధీ సెప్టెంబర్‌ 7వ తేదీన భారత్‌ జోడో యాత్ర ప్రారంభించనున్న సందర్భంగా ఆ యాత్రకు సంఘీ భావం తెలిపేందుకు నితీశ్‌ ప్రత్యేకంగా సోమ వారం ఢిల్లి వచ్చి రాహుల్‌ని కలుసుకున్నారు. ఆయనకు నైతికంగా మద్దతు ఇచ్చేందుకే నితీశ్‌ వచ్చారని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. రాహుల్‌ కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకూ ఈ యాత్రను నిర్వహించను న్నారు. రాహుల్‌ యాత్రకు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ వర్గాలే కాకుం డా బీజేపీయేతర పార్టీల నాయకులు ఇప్పటికే మద్దతు పలికారు. దేశంలో ఆహార ధాన్యాలు, నిత్యావ సర వస్తువుల ధరలు పెరగడానికి మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్నవిధానాలే కారణమని వీరంతా చిత్తశుద్ధితో నమ్ముతున్నారు.పేద వారికి సాయం అందించేందుకు ప్రవేశపెట్టిన సబ్సిడీలు,ఇతర రాయితీలను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం, కార్పొరేట్‌ వర్గాలకు లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయడంలో సామంజస్యం ఏమిటని ప్రతి పక్షాలు ప్ర శ్నిస్తున్నాయి. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లొ మంత్రులు, మా జీ మంత్రులనూ,ఇతర నాయకులను అవినితి కేసుల్లో ఇరికించిజైళ్ళకు పంపడం,సీబీఐ,ఈడీ వంటి ప్రభుత్వసంస్థల దాడులకు ఉసిగొల్పడాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రాహుల్‌ గాంధీ ఆదివారం నాడు ఢిల్లి లోని రామలీలా మైదానంలో జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దేశంలో ప్రతిపక్షాలనేవి లేకుండా చేయడానికి మోడీ, ఆయన అనుచరులు ప్రయత్నిస్తున్నారనీ,అయితే,ప్రభుత్వం ఎంత తొక్కి పడితే ప్రతిపక్షాల బలం అంత పెరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఢిల్లిలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలను సాగించడ ంలో కమలనాథులు పూర్వపు రికార్డులను తిరగరాశారని ఆయన అన్నారు. ప్రస్తుతం మోడీకి వ్యతిరేకంగా గాలి వీస్తోందనీ, ప్రతిపక్షాలన్నీ ఏకమైతే బీజేపీకి 50 సీట్ల కంటే ఎక్కువ రావని నితీశ్‌ కుమార్‌ అన్నారు.ప్రజల్లో ఉన్న అసంతృప్తి ని ఉపయోగించుకుని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ధ్వజమెత్తాలని ఆయన పిలుపు ఇచ్చారు.ప్రతిపక్షాల కార్యకర్తలను కేంద్రం అరెస్టు చేస్తూ పోతే దేశంలో ఉన్న జైళ్లు చాలవని రాహుల్‌ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చ రించారు.కేంద్రం అనుసరిస్తున్న పక్షపాత విధానాలపై తెరాస అధ్యక్షుడు,తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్ర శేఖరరావు (కేసీఆర్‌) సమయం వచ్చినప్పుడల్లా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన పాట్నా వెళ్ళి నితీశ్‌తో చర్చలు జరిపిన తర్వాతే జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలకు సారథ్యం వహించేం దుకు నితీశ్‌ అంగీకరించినట్టు పాట్నాలోఆయన అనుచరులు తయారు చేసిన,ఇంకా చేస్తున్న ప్రచార సామగ్రిని బట్టి స్పష్టం అవుతోంది. బీజేపీతో మళ్ళీ జత కట్టనని నితీశ్‌ స్పష్టం చేశారు. బీజేపీ తో కలసి ప్రభుత్వా న్ని నడిపినప్పుడు తాను రోజూ అవ మానాల పాలైనట్టు ఆయన వెల్లడించారు. ప్రభుత్వంలో బీజేపీ మంత్రుల జోక్యాన్ని తట్టుకోలేకే ఆ కూటమితో తెగతెంపులు చేసుకు న్నట్టు ఆయన ప్రతి సందర్భం లోనూ స్పష్టం చేస్తున్నా రు. తమ పార్టీ ఎమ్మె ల్యేలను కమలనాథులు ఫిరాయిం పులకు పురికొల్పడం వల్లనే నితీశ్‌ బహిరంగంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరుకు సిద్ధమైనట్టు స్పష్టం అవు తోంది.రానున్న రోజుల్లో ఆయన మరింత తీవ్ర స్థాయి లో బీజేపీపై ధ్వజమెత్తే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement