Thursday, April 25, 2024

త‌రుణ్ భాస్క‌ర్ ఇన్ బాక్స్ లో క్రేజీ మెసేజ్.. ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేయ‌డంతో వైర‌ల్‌!

సెలెబ్రిటీల‌కి యూజువ‌ల్‌గా వారి సోష‌ల్ మీడియా ఎకౌంట్ లో ర‌క‌రకాల‌ మెసేజీలు వ‌స్తుంటాయి.. కొంద‌రు వాటిని అస్స‌లు ప‌ట్టించుకోరు.. కొంద‌రేమో స‌ర‌దాగా అలా మెసేజ్ చేసిన వారికి రిప్ల‌య్‌ ఇస్తూ కాల‌క్షేపం చేస్తారు. ఇంకొంద‌రు ఆ మెసేజీల‌ని సీరియ‌స్ గా తీసుకుని వారిపై మండిప‌డి ఆపై ట్రోలింగ్ కి గుర‌వుతుంటారు. ఇట్లాంటి వారిలో ఎక్కువ‌గా ఈ మ‌ధ్య రంగ‌మ్మ‌త్త అన‌సూయ వార్త‌ల్లో నిలుస్తోంది. అట్లానే టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్ట‌ర్, యాక్ట‌ర్, యాంక‌ర్, రైట‌ర్.. ఇలా అన్నీ రంగాల‌ను ఓ పట్టు ప‌డుతున్న యంగ్ స్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ కు వ‌చ్చిన‌ ఓ మెస్సేజ్ సంచ‌ల‌నంగా మారింది.

- Advertisement -

త‌రుణ్ భాస్క‌ర్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.. ఆయ‌నపై వ‌చ్చే మీమ్స్.. ట్రోల్స్ పై స‌ర‌దాగా రియాక్ట్ అవుతారే కానీ వాటిని సీరియ‌స్‌గా తీసుకోరు. అయితే తాజాగా త‌రుణ్ భాస్క‌ర్ ఇన్ బాక్స్ లో వ‌చ్చిన మెస్సేజ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఆ మేసేజ్ ని ఆయ‌న ఏకంగా త‌న ఇన్‌స్టా స్టోరీలో పెట్టారు.. మెసేజ్ చేసిన వ్య‌క్తి త‌న ద‌గ్గ‌ర ఓ ఆస‌క్తి క‌ర‌మైన స్టోరీ ఉంద‌ని.. దానికి సంబంధించి రెండు మూడు లైన్లు టెక్స్ట్ చేశాడు.. మిగితా స్టోరీ కావాలంటే త‌న‌కి ఫోన్ చేయాల‌ని ఫోన్ నెంబ‌ర్ కూడా ఇచ్చాడు.. అయితే ఆ మెసేజ్ పై స‌ర‌దాగా రియాక్ట్ అయిన‌ తరుణ్ భాస్క‌ర్ ఇదేదో పాన్ ఇండియా స్టోరీలా ఉందే అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఫేర్ చేశారు. ఇది చూసిన చాలామంది సోష‌ల్ మీడియాలో దీనిపై విప‌రీత‌మైన మీమ్స్ ర‌న్ చేస్తున్నారు. కామెంట్స్‌తో ఇన్‌బాక్స్‌ని నింపేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement