Sunday, April 28, 2024

లంకతో మనకు పోలికా..

ప్రధానమంత్రి నరేంద్రమోడీ మీదనో, రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీదనో కోపంతో ప్రతిపక్ష నాయకులు మన దేశ ఆర్థిక పరిస్థితి శ్రీలంక కన్నా దారుణంగా ఉందనీ, అక్కడ మాదిరిగానే త్వరలోనే దివాళా తీస్తుందంటూ శాపనార్ధాలు పెట్టడం మొదలుపెడుతున్నారు. ఇది అన్యాయమే కాదు,సహించరాని విషయం. భారత ఆర్థిక వ్యవస్థ ఎన్నటికీ చెక్కు చెదరదు. వ్యక్తుల మీద కోపాన్ని దేశం మీదచూపడం ఎంత మాత్రం తగదు. మన ఆర్థిక వ్యవస్థ మూలాలు ఎంతో పటిష్టంగా ఉన్నాయనీ, ప్రపంచంలో మనతో సమానమైన ఏ దేశానికీ లేని సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థ మనకు ఉందని నీతి ఆయోగ్‌ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగరియా వ్యాఖ్యా నించి మన ఆర్థిక వ్యవస్థపై తమకు తోచిన రీతిలో మాట్లాడుతున్న వారికి గట్టి సమాధానమిచ్చారు. దేశంలో ఆర్థిక సంస్కరణలను మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు ప్రవేశపెట్టినప్పుడు కూడా ప్రతిపక్షాలు ఇదే మాదిరి విమర్శలూ, వ్యాఖ్యలు చేశాయి. ఆయన ఆధ్వర్యంలో ఆర్థిక సంస్కరణలను అమలు జేసిన డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ యూపీఏ ప్రభుత్వ అధినేతగా వాటిని మరింత పకడ్బందీగా అమలు జేయాలని అనుకున్నారు కానీ, యూపీఏకి బయటి నుంచి మద్దతు ఇచ్చిన వాప క్షాలు అడ్డంకులు సృష్టించాయి. ఆర్‌జేడీ,సమాజ్‌వాదీ వంటి పార్టీల నుంచి కూడాప్రతిఘటన ఎదురైంది.దాంతో ఆయన ముందడుగు వేయలేకపోయారు. అయితే, సమయం వచ్చినప్పుడు అటు వామపక్షాలకూ,ఇటు మిత్ర పక్షాలకూ ఘాటైన సమాధానాలిస్తూ వచ్చారు.

ఓసారి ఆయన వాషింగ్టన్‌ బయలు దేరినప్పుడు వామ పక్షాలు ఆర్థిక సంస్కరణల పేరిట అమెరికాకు ప్రభుత్వ సంస్థలను ధారాదత్తం చేయడానికి వెళ్తున్నారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తే, ఈ దేశాన్నీ అమ్మే శక్తి, కొనే శక్తి ఎవరికీ లేదని కుండబద్దలు కొట్టారు. దాంతో వామపక్షా లు వెనక్కి తగ్గాయి. ఆయన మాటలోఎంత నిజముందో ప్రస్తుతం అమెరికా పరిస్థితిని చూస్తే స్పష్టం అవుతోంది. అంతమాత్రాన మన దేశంలో ఆర్థిక సమస్యలు లేవని ఎవరూ అనరు. 2008లో అంతర్జాతీయ ఆర్థిక సంక్షో భం అన్ని దేశాలనూ కుదిపేసింది. అమెరికా సైతం ఈ స ంక్షోభం నుంచి బయటపడేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. అప్పుడు మన్మోహన్‌సిింగే ప్రధానిగా ఉన్నా రు. ఆ సంక్షో భం నుంచి తట్టు కొనగలిగినందుకు భారత్‌ ని అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ప్రశంసించాయి. మన దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారినప్పుడల్లా రిజర్వు బ్యాం కు రెపోరేటును సవరిస్తూ మన రూపాయి విలువను కాపాడుతోంది.ఇప్పుడు కూడా ఇత ర కరెన్సీల కన్నా మన రూపాయి విలువ ఎంతో మెరుగుగా ఉంది. అనేక దేశాల కరెన్సీ విలువ డాలర్‌తోపోలిస్తే బాగా క్షీణించగా, రూపాయి విలువ 7 శాతం మాత్రమే తగ్గింది.యూరో విలువ 13 శాతం, బ్రిటన్‌ పౌండ్‌ విలువ 11 శాతం పతనమయ్యాయి. దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్‌, థాయ్‌, తైవాన్‌ తదితర దేశాల కరెన్సీ విలువ బాగా తగ్గింది. శ్రీలంకలో పరిస్థితి వేరు. అక్కడ పరిస్థితి అలా పాతాళాని కి చేరడానికి ఒక వ్యక్తి స్వయం కృతం కారణం. మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్స చైనా షరతులకు తలొగ్గి తమ దేశాన్ని పూర్తిగా తాకట్టు పెట్టేశారు.దేశాధ్యక్షునిగా గొటబాయ, ఆర్థిక మంత్రిగా బాసిల్‌ ఉండటంతో ఆయన ను ప్రశ్నించేవారు ఎవరూ లేకపోవడంతో మహిందా రాజపక్స దూకుడుగా వ్యవహరించారు.

ఈ ముగ్గురూ స్వయానా సోదరులే. అక్కడిరాజ్యాంగం వేరు, అక్కడి ఆర్థిక వ్యవస్థ వేరు, మాజీ ప్రధాని జేఆర్‌ జయవర్ధనే అధ్యక్ష తరహా పాలన ప్రవేశపెట్టారు. మన దేశంలో కూడా ఎమర్జెన్సీ సమయంలో అధ్యక్ష పాలనా వ్యవస్థ ను ప్రవేశపెట్టాలని ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీపై తీవ్రమైన ఒత్తిడి వచ్చిందనీ, ఆమె ఒక దశలో మొగ్గు చూపినట్టుగా కనిపించిందనీ, ఆనాడు ఎమెర్జన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకి వెళ్ళినవారు తెలిపారు.మన దేశంలో అటువంటి పరిస్థితులు తలెత్తకుండా రాజ్యాంగ రూపకల్పనలో బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అధికారంలో ఎవరు ఉన్నా భారత రాజ్యాంగాన్ని పాటించాల్సిందే. అందువల్ల శ్రీలంక వంటి పరిస్థితి మన దేశంలో ఎన్నటికీ తలెత్తదు.మన దేశంలో సమస్యలన్నీ అంతర్గతమైనవే. ఆర్థిక సమస్యల ను పరిష్కరించుకునేందుకు గతంలో ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో కేంద్రం తగినచర్యలు తీసుకునేది. ఇప్పుడు దాని స్థానే ఏర్పాటు చేసిన నీతిఆయోగ్‌ అంత చురుకైన పాత్ర వహించడం లేదన్న విమర్శలు ఉన్నా యి. అంత మాత్రాన ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నట్టు భావిం చడం పొరపాటు, కేంద్రమూ, రాష్ట్రాలూ కలసి కూర్చుని పరిష్కరించుకుంటే అన్ని సమస్యలూ పరిష్కారమవు తాయి. రాజకీయ విభేదాలే ఆర్ధిక సమస్యలకు కారణం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement