Tuesday, May 21, 2024

యజ్ఞాధిపతి…వరాహస్వామి

సృష్టి ప్రారంభంలో బ్రహ్మ తన మానస పుత్రులను పిలిచి సృష్టి ఆవిర్భావంలో సహకరించవలసినదిగా కోరాడు. స్వాయం భువుడు బ్రహ్మ వద్దకు వచ్చి ”జగద్విధాతవైన జనకా! ఈ సృష్టి లో అఖిల జంతుజాలానికి, జీవులకు ఆధార భూత మైన భూమి ఇప్పుడు మహాసముద్రంలో మునిగి ఉంది. భూమిని ఉద్ధరించే ఉపాయం ఆలో చించి, నన్ను అనుగ్రహంచండి” అని కోరగా, బ్రహ్మ తన మనసులో ఇలా భావించారు” నీళ్ళ నడుమ మునిగి ఉన్న భూ మండలాన్ని పైకి తేవ డం ఎలా? లోకాలన్నింటిని పుట్టించేటప్పుడు, మొదట నీళ్ళను సృష్టిం చాను. ఇప్పుడు భూమి జల మధ్యంలో మునిగిపోయింది. దానిని ఏవిధంగా యథాస్థితికి తీసుకొనివచ్చేది?” అని మధనపడుతూ, సర్వాం తర్యామి, పురుషోత్తముడు, పుండరీకలోచనుడు అయిన లక్ష్మీవల్లభుని ధ్యానించాడు. వెంటనే బ్రహ్మ భావాన్ని గ్రహంచిన విష్ణుమూర్తి తన ముక్కు నుండి యజ్ఞ వరాహమూర్తి బొటన వేలంత పరిమాణంంతో జన్మించి, ఆకాశంపైకి ఎగిరి, అందరూ చూస్తుండగానే పెద్ద ఏనుగు అంత రూపంలో దర్శనమిచ్చాడు. బ్రహ్మకు ఎదురుగా వచ్చి నిలబడ గానే, బ్రహ్మ ”నా మనసులోని దు:ఖ భారాన్ని దూరం చేయడానికై విష్ణుమూర్తి ఈవిధంగా యజ్ఞ వరాహ రూపం ధరించారు. ఇదెంత గొప్ప విషయం” అని తలపోస్తూ, తన ఎదురుగా ఉన్న వరాహమూర్తితో ”భూమి ఈ సముద్రంలో మునిగిపోయింది. దానిని పైకి తీసుకువస్తే, సృష్టి కార్యం ప్రారంభించవచ్చు” అని పలికాడు.
ఆ యజ్ఞ వరాహం కర్కశమైన తన మెడ మీద జూలు విదిలించింది. దానివల్ల పుట్టిన వాయువేగానికి, మేఘ మండలం అంతా చెల్లాచెదరైపో యింది. యజ్ఞవరాహం కఠోరాలైన కోరల రాపిడి వల్ల పుట్టిన అగ్నిజ్వా లలకు వెండి కొండ కైలాసము, బంగారు మేరువు, కరిగి ద్రవించి పోతా యేమో అనిపించింది. ఆ యజ్ఞ వరాహం పొరలుతూ, సంతోషంతో గం తులు వేస్తూ, ఒక్కోసారి కళ్ళ నుండి అగ్నికణాలు పుట్టిస్తూ, సాగర గర్భంలో ఉన్న భూమిని ఉద్ధరించడానికి సముద్రంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో సముద్రుడు ఆ వేగానికి తట్టుకోలేక అల్లకల్లోలమైన మనస్సుతో అలలనుండే చేతులు పైకెత్తి ”యజ్ఞ వరాహా! నన్ను రక్షించు. రక్షించు!” అని వేడుకొన్నాడు. అయినా ఆ వరాహమూర్తి, తన వాడియై, వంకరలు తిరిగిన కత్తుల వంటి గిట్టల కొనలతో, సముద్ర జలాలను చెల్లాచెదురు చేస్తూ, పాతాళంలో భూమిని చూసారు. ఆ సమయంలో సముద్రంలో దాగిఉన్న మహాభయంకర రాక్షసుడు ఎదురుపడ్డాడు. ఆ రాక్షసుడు అనివార్యమైన మహాశౌర్యంతో గిరగిరా గద త్రిప్పుతూ వరాహమూర్తి పైకి విసరగా, స్వామి తప్పించుకొన్నారు.
మృగరాజు గజరాజును మట్టు పెట్టినట్లు ఆ వరాహమూర్తి తన వాడి కోరలతో వాడిని తుదముట్టించాడు. అపుడు నెత్తురు ధారలతో నిండిన చెక్కిళ్ళు, మహాపర్వతంలాంటి శరీరంతో భూమిని తన కోరల చివర ధరించి, సముద్రంలోనుంచి బయటకు వచ్చారు. ఆ వరాహ మూర్తిని చూసి, బ్రహ్మాది దేవతలు అందరూ ”దేవదేవా! జయం! జయం! పరమేశా! జయం! జయం! నీవు యజ్ఞాధి పతివి. వేదమూర్తివి. దుష్టశిక్షణ- శిష్ట రక్షణార్థం వరా#హవతారం ధరించిన నీకు పరమ భక్తి తో ప్రణమిల్లుతున్నాము. ఈ మహాసముద్రాలన్నీ నీ రోమకూపాలలో ఇమిడి ఉన్నాయి. అటువంటి యజ్ఞ వరా#హ స్వరూపాన్ని దర్శించడం సుసాధ్యం కాదు కదా!”
ఇంకా వారందరూ ఇలా కీర్తిస్తూనే ఉన్నారు. ”స్వామీ! నీ చర్మం నుండే వేదాలు జనించాయి. నీ రోమ కూపాల నుండి అగ్నులు ఆవిర్బ éవించాయి. నీ కళ్ళ నుండి హోమ ద్రవ్యమైన నెయ్యి, నీ నాలుగు పాదాలు నుండి నాలుగు హోత్రాలతో కూడిన యజ్ఞ కర్మలు, ఉదరము నుండి ఇడా పాత్రము, చెవుల నుండి, ముఖం నుండి చమసం, ప్రాశిత్రం అనే పాత్రలు, కంఠం నుండి ఇష్టులు అనే మూడు యజ్ఞాలు, నాలుక నుండి, ప్రవర్గ్యం అనే యజ్ఞము పుట్టాయి. నీ చర్వణమే అగ్నిహోత్రం. సభ్యం అనే హోమ రహతాగ్ని, అవసథ్యం అనే ఔపాసనాగ్ని నీ శిరస్సు నుండే జనించాయి. చయనాలు నీ ప్రాణ స్వరూపాలు. నీవు యజ్ఞాధినా ధుడవు. యజ్ఞ వరాహమూర్తివి.!” అంటూ స్తుతించారు. తరువాత జీవులు ఉత్పత్తికి బ్రహ్మ సంకల్పించారు.
”యజ్ఞ వరాహమూర్తే యజ్ఞ స్వరూపుడు. యజ్ఞ కర్త. యజ్ఞ భోక్తవు. యజ్ఞ ఫలప్రధాతవు. యజ్ఞ రక్షకుడవు. సమస్తమూ నీవే. సత్త్వగుణం వల్ల మంచి భక్తి ప్రాప్తిస్తుంది. భక్తితో కూడిన మనసు పవిత్రమవుతుంది. ఓ దేవదేవా! నీకు మా నమస్కారము” అంటూ ఇంకా దేవతలు కీర్తిస్తూనే ఉన్నారు.
తిరుమల కొండ క్షేత్రపాలకుడు శ్రీ యజ్ఞ వరాహస్వామే! తిరు మలలో శ్రీ వేంకటేశ్వర స్వామి కంటే ముందుగానే, అలంకరించిన వరా హస్వామిని ముందుగా దర్శించి, ఆ పైనే శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శ నానికి వెళ్ళాలని పెద్ధలు తెలియపరచారు. ముందుగానే తిరుమల కొండను ఆక్రమించిన వరాహస్వామిని స్థలమడిగే, శ్రీ వేంకటేశ్వ రస్వామి కొలువైనాడు. స్థలం ఇవ్వడానికి యజ్ఞ వరాహ స్వామి ఒక నిబం ధన పెట్టాడు. అదేమంటే ”తిరుమల సందర్శించడానికి వచ్చిన భక్తులు తనను ముందు దర్శించే, స్వామి వారిని దర్శించవలసి ఉంటుందని, పూజలు, నైవేద్యం ముందుగా వరాహ స్వామికి సమర్పించే, అటు తరువా త, స్వామికి సమర్పించాలని.
ఎన్నో దశాబ్దాల నుండి ఇలాగే జరుగుతోంది. కాబట్టి, పాఠకులారా! మీరు తిరుమల వెళ్ళినప్పుడు, శ్రీ వరాహస్వామిని దర్శించే స్వామి వారి దర్శనానికి వెళ్ళండి. లేకపోతే ఫలితం దక్కదంటారు సుమా! యజ్ఞ వరాహస్వామి ఆశీస్సులు మీ కుటుంబానికి లభించా లని ఆకాంక్షిస్తూ-

Advertisement

తాజా వార్తలు

Advertisement