Friday, May 3, 2024

త్రికరణాలు

మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనామ్‌!
మనస్యన్యత్‌ వచస్యన్యత్‌ కర్మణ్యన్యత్‌ దురాత్మనామ్‌!!

మనసులో సంకల్పించినది మాట రూపంలో ప్రకటిస్తూ దానిని కార్య రూపంలో చేసి చూపే వారు మహాత్ములు. మనసులో అను కొన్నదొకటి మాట రూపంలో చెప్పేదొకటి చేతలలో చేసేదొకటి. అటువంటివారు దురా త్ములు. ఆత్మసాక్షాత్కారం మహాత్ములకు లభి స్తుంది. మన సావాచా కర్మణా ఏకత్వం లోపిం చినవారు అథో యోనులలో జన్మలెత్తాల్సిందే!
ధ్యానముకయినా, జపముకయినా మన సు ప్రధానం. ధ్యానములో మనస్సును నియంత్రించాలి. ఏరకమైన ఆలోచనలు రాకుండా నిరోధించాలి. జపములో ఉప దేశము పొందిన మంత్రమును ఏకాగ్రతతో జపించాలి. ఇక్కడ కూడా మనసును ఆ మం త్రము పైనే లగ్నం చేయాలి. ఈ రెండు సంద ర్భాలలోను చిత్తశుద్ధి చాలా అవసరం. కళ్లు మూసుకుంటే ధ్యానమవ్వదు. పెదవులు కది పితే జపమవ్వదు. నిరంతరం సాధనతో మాత్రమే దివ్యానుభవాన్ని పొందగలరు. అందుకోసం యోగుల చరిత్రను పరిశీలిం చాలి. వారు బోధించిన ఆత్మతత్వాన్ని తెలుసు కోవాలి. జపధ్యానములకు పరికరాలు మూడు. మనస్సు, వాక్కు, కాయము లేక శరీరము వీటి నే త్రికరణాలు అంటారు. త్రికరణ శుద్ధిగా చేసే కర్మలేవయినా ఉత్త మం గా నిలుస్తాయి. అం దుకే శ్రీ రమణ మహర్షి ఉప దేశ సారంలో ఈవిధంగా ఉపదేశించారు.
కాయ వాఙ్మన: కార్యముత్తమమ్‌|
పూజనం జపశ్చింతనం క్రమాత్‌||
శరీరం, వాక్కు ఈ రెండూ మనసుపై ఆధారపడి పనిచేస్తాయి. షోడశోపచారాలను నిర్వర్తించేది శరీరం. స్తోత్ర పారాయణ చేసేది వాక్కు. దేవీ దేవతల బీజాక్షర మంత్రాలను గురువు వద్ద స్వీకరించి చిత్తశుద్ధితో జపించాలి. దీనికి శరీర శుద్ధి, వాక్సుద్ధి రెండూ అవసరం. శరీర శుద్ధి భౌతికమయితే వాక్కు మనస్సు చేత శుద్ధి చేయబడుతుంది. జప సాధనలో వాక్కు మనసుతో ఏకమవ్వాలి. ”యజ్ఞానాం జప యజ్ఞోస్మి” యజ్ఞములలో జపయజ్ఞం ఉత్తమమైనదని శ్రీ కృష్ణ భగవానుడు ఉపదేశించాడు. ముఖ్యంగా ఈ కలియుగంలో నామ జపమే ముక్తి మార్గమని యోగుల ఉవాచ. నామ జపానికి మొదట మూర్తి అవసరమయినా తదు పరి అభ్యాసంతో ఆ మూర్తి స్వరూపాన్ని మనసులో స్థిరపరచ వచ్చు. అప్పుడు నామజపం ఉపాసన అవుతుంది. ఉపాసనే ధ్యానమవు తుంది. కనుక ధర్మ బద్ధమైన జీవనానికి ఉత్తమమైన కర్మలు అవసరం. అటువంటి ఫలాపేక్ష రహిత కర్మకు శుద్ధమైన మనో సంకల్పం చేయాలి. సంకల్పం పవిత్రమయితే సాధన సులభతరమవుతుంది. త్రికరణ శుద్ధితో చేసే కర్మల వల్ల పాప ప్రక్షాళన జరుగుతుంది. మనోనేత్రం విప్పారుతుంది. అటువంటి వారు జ్ఞానసిద్ధిని పొంది బ్రహ్మ పథాన్ని తెలుసుకుంటారు. పూజకన్నా జపము, జపము కన్నా ధ్యానము శ్రేష్టమని విజ్ఞులు తెలియజేస్తున్నారు. శరీరంతో చేసేది పూజ. వాక్కుతో చేసేది జపం. ఈ రెంటినీ నియంత్రించేది మనసు. అయితే సగుణో పాసనతోనే నిర్గుణోపాసన సాధ్యం. సహజంగా సాధకునికి దేవుడి గుడిలోనే ఉన్నాడనే భావన ఉంటుంది. గుడికి దూరంగా ఉన్నప్పుడు మనసు ఆ దైవమూర్తి మీద లగ్నము తాను గుడి లోనే ఉన్నాడను భావన కలుగుతుంది. సాధన పరిపక్వమైనప్పు డు ఆమూర్తి తనలోనే ఉన్నాడను కటాక్ష భావం కలుగుతుంది. అందువలననే శ్రీ రామకృష్ణ పరమహంసలాంటి మహాయోగు లు అనుక్షణం ధ్యానమగ్నులై ఉండేవారు. వారి అంతరంగం ఒక దేవాలయం. అయితే ఆధ్యాత్మిక జీవనాభి లాషులు, భగవత్‌ చింతన కలవారికి శ్రీ రమణులు చక్కని మార్గం చూపించారు.
జగత్‌ ఈశధీయుక్త సేవనమ్‌|
అష్టమూర్తి భృద్దేవ పూజనమ్‌||
పంచ భూతములు, సూర్యచంద్రులు, జీవుడు ఈ ఎనిమిది భగవంతుని ప్రతి రూపములు. ఈ ప్రకృతి అష్టమూర్తులతో నిండి ఉంది. భగవంతుని స్వరూపమే నీకు కనబడేదంతా!
ఈ అష్టమూర్తులకు ఆధారం పరమాత్ముడు. ఆయన ఒక్క డే! సాధకునికి అంతిమంగా బోధపడేది బాహ్యాంతరాలలో ఉన్న ది, విశ్వాంతరాళంలో నున్నది ఒకటేనని భావన స్థిరపడి అంత ర్ముఖుడై ఆత్మను దర్శిస్తాడని శ్రీ రమణులు తెలియజేసారు.
అందుకే ప్రకృతిలోని అష్టమూర్తులను పూజించి సాధనతో అద్వైత జ్ఞానం పొందగలరని మహర్షి ఉపదేశానుసారం.

  • వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు, 8074666269
Advertisement

తాజా వార్తలు

Advertisement