Wednesday, May 8, 2024

అత్యంత ఫలప్రదం కార్తీక స్నానం…

కార్తీకమాసంలో ముఖ్యమైన విషయాలంటే… నదీ స్నానం, శివారాధన, దీపారాధన- దీపదానం, విష్ణు ఆరాధన, పురాణ పఠనం లేదా శ్రవణం, దానాలు చేయడం. ఈ మాసం లో దీపాలు వెలిగించి శివకేశవులను ఆరాధించి కార్తీక పురాణం చదువుతారో వారు చేసిన పాపాలు తొలగి, పుణ్యం కలిగి, జ్ఞానం సిద్ధించి, మోక్ష సాధనకు మార్గం ఏర్పడుతుంది .
కార్తీక స్నానం: కార్తీక మాసంలో పుణ్య నదీ స్నానం వల్ల పాపాలు తొలగి పుణ్యం కలు గుతుంది. అంతేకాదు కార్తీక మాసంలో రవి తులారాశిలో ఉండటంవల్ల నదుల్లో నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం చేయడం వల్ల మానవుడి శరీరానికి శక్తి కలిగి ఆరో గ్య సిద్ధి కలుగుతుంది. శరదృతువులో నదుల్లో ఔషధాల సారం అధికంగా వుంటుంది. అగస్త్య నక్షత్రం ఉదయించడం వల్ల దోషరహితమైన శరదృతువులోని పవిత్రం జలాన్ని హంసోదకం అని అంటారు. కార్తీకమాసంలో మానసిక, శారీరక రుగ్మతలను తొలగించి ఆయురారోగ్యాన్ని ప్రసాదించే ఉషోదయ స్నానం చేయడం ముఖ్యం. పైత్య ప్రకోపాలను తగ్గించడానికి హంసోదక స్నానం, సూర్యోదయానికి ముందే నదిలో మునిగి స్నానం ఆచరిస్తే ఉదర సంబంధ రోగాలు నయమవుతాయి.

దీపం

కార్తీకమాసంలో సాయంత్రంపూట ఆలయంలోగానీ, తులసికోట దగ్గర, రావిచెట్టు దగ్గర గానీ లేదా ఏదయినా నది వద్ద ఎవరయితే దీపారాధన చేస్తారో వారికి పుణ్య ఫలం లభించి శివసాన్నిధ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది. కార్తీక మాసంలోనూ నిత్యం దీపారాధన చేయడం సాధ్యపడని వారికి కార్తీక శుక్ల ద్వాదశి, కార్తీక పౌర్ణమి రోజు చేస్తే సంవత్సరంలో దీపారాధన చేస్తే వచ్చే పుణ్యఫలం ఈ రెండు రోజుల్లో చేయడం వల్ల లభిస్తుంది.

దానం

మన సనాతన ధర్మంలో గృహస్థు చేయాల్సిన వాటిలో స్నానం, దానం, జపం, తర్పణం ముఖ్యమైనవి. కార్తీకంలో చేసేటటువంటి స్నాన, దాన, జప, తర్పణాలకు అత్యం త అధికమైన పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు తెలిపాయి. అందుచేత కార్తీకమాసంలో ఎవరైతే నవధాన్యాలు, అన్నం, దీపదానం, ఉసిరి దానం, వస్త్రదానం, సువర్ణదానం, గోదానం, కన్యాదానం వంటికి చేస్తారో వారికి కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుందని కార్తీక, మార్కండేయ, శివపురాణాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement