Sunday, May 5, 2024

శ్రీరామ పట్టాభిషేకోత్సవం

ఉదయాన్నే రాజపత్నులు, మంత్రులు, బ్రా#హ్మణులు, రాచ వారంతా సైన్యంతో సహా వరుసగా శ్రీరాముడిని చూడడా నికి బయల్దేరారు. వారితోపాటే సుమంత్రుడు, అర్థసాధ కుడు, జయంత, విజయులు, అశోక, సిద్ధార్థుడనేవారు బంగారు భూషణాలతో అలంకరించిన ఏనుగులతో బయల్దేరారు. రాజు అంతరంగికులు ఏనుగుల మీద, గుర్రాలు కట్టిన రథాల మీద, వీరు లంతా గుర్రాలనెక్కి భటులతో బయల్దేరారు. దశరథుడి భార్యలు కౌసల్యను, సుమిత్రను ముందుంచుకుని వారితో కలిసి వా#హనాల మీద వెళ్ళారు. కైక కూడా అందరితో కలిసి బయల్దేరింది. అప్పుడు #హనుమంతుడు ఇలా అన్నాడు. ”అదిగో అక్కడ కనబడుతున్న వాడే రామచంద్రమూర్తి. సీతతోను, తమ్ముడు లక్ష్మణుడితోను వున్నాడు. ఎడమ పక్క సీత, కుడిపక్క లక్ష్మణుడు వున్నారు. అదిగో అతడే సుగ్రీవుడు. అదిగో విభీషణుడు.”
”అతడే రాముడు” అని #హనుమంతుడు చెప్పగానే స్త్రీ, బాల, వృద్ధులు అంతా ఆకాశం వైపు వేలు చూపిస్తూ ”అదిగో రాముడు! రాముడదిగో!” అని ధ్వనించారు. అంతదాకా వా#హనాల మీద వున్నవారంతా కిందికి దిగి ఆకాశం వైపు, రాముడి వైపు చూశారు. పధ్నాలుగు సంవత్సరాలు దాటగానే తప్పక తిరిగి వస్తానని మాట ఇచ్చిన రామచంద్రమూర్తిని చూసి భరతుడు దూరం నుండే నమస్కారం చేశాడు. రామచంద్రమూర్తి అజ్ఞానుసారం భరతుడు దానిమీదికి ఎక్కి రామచంద్రమూర్తిని సమీపించి నమస్కారం చేశాడు.
ఆ తరువాత శ్రీరామచంద్రుడు తల్లి దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. సుమిత్రకు, కైకకు, పురో#హ తుడు వశిష్టుడికి మొక్కాడు. పురజనులంతా చేతులు జోడించి రామచంద్రమూర్తికి మొక్కుతూ స్వాగతం పలికారు. వారందరినీ ప్రేమగా చూశాడు రామచంద్రమూర్తి. కుశల ప్రశ్నల తరువాత భరతుడు తనకు రామచంద్రమూర్తి ఇచ్చిన బంగారు పాదుకలను తీసుకొచ్చి అన్న పాదాలకు తొడిగి, చేతులు జోడించి, ”రాజేంద్రా! ఈ రాజ్యమంతా నీది. నువ్వు లేని కారణాన ఇంతదాకా కావలి కాసి వుండి, ఇప్పుడు నీది నీకు అప్పగిస్తున్నాను. నీకు నీ రాజ్యమంతా ఇస్తున్నాను. నువ్వు నాకెలాగైతే రాజ్యాన్ని ఇచ్చావో అదేవిధంగా అప్పచెప్తున్నాను. ఇక నేను ఈ బరువు మోయలేను. ఈ రాజ్యాన్ని గొప్పదైన ప్రయత్నం చేస్తేనే కాని రక్షించలేం. ఇది నువ్వే ఆలోచించు” అని అన్నాడు.
ఆ తరువాత శత్రుఘ్నుడి ఆజ్ఞానుసారం నేర్పరులైన క్షురకులను పిలిచి శ్రీరామ లక్ష్మణ భరతులకు మీసాలు కత్తిరించి, గడ్డాలు, క్షౌరం చేశారు. శ్రీరాముడు ఖరీదైన వస్త్రాలను ధరించి అలంకరించుకున్నాడు. ఆయన అలా త్రిలోకాభి రాముడై వుండగా రామలక్ష్మణులకు శత్రుఘ్ను డు ఆభరణాలు తొడిగాడు. దశరథుడి భార్యలు స్వయంగా సీతాదేవిని అలంకరించారు. కౌసల్య వానర స్త్రీలందరికీ సొమ్ములు, చీరెలు ఇచ్చి అలం కరించుకోమన్నది. ఆ తరువాత అంతా అయోధ్యకు బయల్దేరారు.
అయోధ్యకు చేరిన తరువాత వసిష్టుడు, రామచంద్రమూర్తిని, సీతాదేవిని రత్నపీఠం మీద కూర్చోబెట్టాడు. ఇలా వారిద్దరినీ కూ ర్చోబెట్టిన తరువాత, వసిష్టుడు, కాత్యాయనుడు, జాబాలి, కాశ్య పుడు, విజయుడు, గౌతముడు, వామదేవుడు, సుయజ్ఞుడు మొద లైన ఎనిమిదిమంది బ్రా#హ్మణ శ్రేష్ఠులు పరిమళాలు ఘుమ్మని వీస్తున్న జలాలతో వారిని అభిషేకించారు. ఆ తరు వాత ఋత్విజులు, బ్రా#హ్మణులు, కన్యకలు, మంత్రు లు, యోధులు, వైశ్యులు దివ్యమైన గొప్ప మూలికల రసంతో ఆకాశాన గుంపులుగా చేరి చూస్తున్న దేవ తల సమక్షంలో, నలుగురు దిక్పాలకుల సమక్షంలో అభిషేక కార్యక్రమం అంతా జరిపించారు. బ్ర#హ్మ నిర్మితమై, అనేక రత్నాలతో ప్రకాశిస్తూ, తేజస్సుతో ప్రకాశిస్తూ, మనువు పూర్వం అభిషిక్తుడైన సమయం లో ధరించినదై, అది మొదలు వంశపారంపర్యంగా పట్టాభిషేక సమయంలో ధరించేదైన, వెలలేని మణు లతో ప్రకాశిస్తున్న కిరీటాన్ని రత్న పీఠంమీద కూచు న్న రామవిభుడిఅంగీకారంతో వేదాధ్యయన పరు లైన ఋత్విజులతో కలిసి వసిష్టుడు శ్రీరామచంద్రుని శిరస్సుపై అలంకరించాడు.
అన్నకు శత్రుఘ్నుడు ప్రశస్తమైన శ్వేతఛ్చత్రం భక్తితో పట్టాడు. తెల్లటి చామరాన్ని సుగ్రీవుడు వీచా డు. మరొక చామరాన్ని విభీషణుడు పట్టుకున్నాడు. ఇంద్రుడి పక్షాన వాయుదేవుడు తళతళ ప్రకాశించే బంగారు సరాన్ని, సమస్త రత్నాలతో కూడిన మంచి ముత్యాల మనొ #హరమైన ముత్యాల సరాన్ని అర్పించాడు. రామచంద్రమూర్తి విరివిగా బ్రా#హ్మణులకు దానాలు ఇచ్చాడు. బంగారు హారాన్ని ప్రీతి గా సుగ్రీవుడికి ఇచ్చాడు. వజ్ర వైఢూర్యాలతో చిత్రించబడ్డ విశేష కాంతికల భుజకీర్తులను అంగదుడికి ఇచ్చాడు. రత్న శ్రేష్టాలతో కూ డినదైన, మనో#హరమైన, ఉత్తమోత్తమమైన, ఆణిముత్యాలతో కూ డిన శ్రేష్టమైన హారాన్ని ప్రేమతో సీతాదేవికి ఇచ్చాడు రాముడు.
సీతాదేవి తన మెడలో వున్న ఒక అందమైన హారాన్ని సంతో షంగా చేతిలో తీసుకుని ఎవరికి ఇస్తే బాగుంటుంది అన్నవిధంగా భర్త వైపు చూసింది. సమాధానంగా ఆయన ”ఓ అలివేణీ! ఎవరు తన గుణాలతో నిన్ను మెప్పించాడో, ఎవరిలో మంచి బుద్ధి పరాక్ర మాలు కలవో అలాంటివాడికి దీన్ని ఇవ్వు” అని అన్నాడు. సీతాదేవి భర్త అలా చెప్పగానే ఆ హారాన్ని #హనుమంతుడికి ఇచ్చింది. అది ధరించి #హనుమంతుడు కాంతితో ప్రకాశించాడు. ఆ తరువాత మైందుడికి, ద్వివిదుడికి, నీలుడికి వారికిష్టమైన బ#హుమానాలు రాముడిచ్చాడు. అలా వానర నాథులందరికీ ఇచ్చాడు. ఈ ప్రకారం విభీషణ, సుగ్రీవ, జాంబవంత తదితర వానరులంతా వారివారికి తగిన బ#హుమానాలు, గౌరవాలు తృప్తి తీరా పొంది రామచంద్రుడి ఆజ్ఞ తీసుకుని తమతమ ప్రదేశాలకు వెళ్లిపోయారు. విభీషణుడు రామాజ్ఞ తీసుకుని లంకకు వెళ్ళిపోయాడు.
శ్రీరామచంద్రమూర్తి రాజ్యం ఏలుతున్నప్పుడు ప్రజలు మనో వేదనలు లేకుండా వున్నారు. ఆ కాలంలో ఏ నోట విన్నా రామ శబ్దమే! ఏ కథ విన్నా రాముడి కథే! ప్రపంచం అంతా రామమయం అయింది. రామచంద్ర మహారాజు పదకొండు వేల సంవత్సరాలు తమ్ములతో శ్రీమంతుడై జగత్ప్రసిద్ధిగా పాలించాడు. నూరు అశ్వ మేధ యాగాలు చేసి, తమ్ములతో, చుట్టాలతో, ఆప్తులతో, మిత్రులతో కలిసి అనేక విధాలైన యజ్ఞాలు చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement