Monday, April 29, 2024

శేషాచల అభయారణ్యంలోమహామహిమాన్విత మల్లేశ్వర క్షేత్రం

ఓంనమశ్శివాయ: .. హరహర మహాదేవ.. శంభో శంకర..హరోం హరా…” అంటూ ఎల్లవేళలా ఈ శైవ క్షేత్రం మార్మోగుతుంది. భక్తుల పంచాక్షరి మంత్రోచ్చాటనతో ప్రతిధ్వనిస్తుంది. సాంబశివ అన్నయ్య, బండెన్న అంటూ పరమ శివుని స్మరిస్తూ పూనకంతో ఊగిపోతూ అనేక ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో పొలతల క్షేత్రం కిటకిటలాడు తుంటుంది. వనవాసంలో రామలక్ష్మణులు సీతమ్మను వెతుకూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ కొలనులో స్నానంచేసి శివుని దర్శించారు. పాండవులు అరణ్యవాస కాలంలో అర్జునుడు ఈశ్వరుడిని మల్లెపూవులతో పూజించినందున ఈ స్వామి మల్లికార్జునుడుగా ప్రసిద్ధి పొందా రని పురాణాలు చెబుతున్నాయి.
శేషాచల దట్టమైన పర్వతశ్రేణుల్లో పచ్చని చెట్లు, సెలయేళ్ల మధ్య కొలువై వున్నాడు మల్లేశ్వరస్వామి. దట్టమైన అడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు… చిన్నచిన్న బాట లు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు… వన్యప్రాణులు.. పచ్చదనం.. గలగలపారే సెలయేరు.. కొండలు.. మేను పులకరించే ప్రకృతి అందాల నడుమ శేషాచల అడవుల్లో ఉన్న పొలతల ఆల యం భక్తులకు ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు.. ప్రకృతి రమణీయత కు పెట్టింది పేరు. ఈ క్షేత్రంలో మల్లేశ్వరస్వామి, పార్వతీదేవి, సుబ్రహ్మణ్యస్వామి, వినాయ కుడు, అక్కదేవతలు, బండెన్న స్వామి ఆలయాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కడప జిల్లా, పెండ్లిమర్రి మండలంలో గల శేషాచల అభయా రణ్యంలో మహామహమాన్వితమైన మల్లేశ్వరుడు క్షేత్రం కలదు. ప్రతి రోజు ఉదయం స్వా మివారికి గణపతి పూజ, మహన్యాస రుద్రాభిషేకం, మహామంగళ హారతి, అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహస్తారు. భక్తులు కోనేర్లలో స్నానాలా చరించి మల్లేశ్వరస్వామిని, పార్వతీదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్యంస్వామి, అక్కదేవత లు, బండెన్నస్వామిని దర్శించుకుంటారు. జిల్లా నలుమూలల నుంచి కాకుండా మహారా ష్ట్ర, కర్నాటక, తమిళనాడు నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటారు.

పొలతల క్షేత్ర ధార్మిక చరిత్ర

పొలతల మల్లికార్జునస్వామి దేవస్థానానికి ఎంతో మహనీయమైన ధార్మిక చరిత్ర వుంది. దాదాపు 800 సంవత్సరాల క్రితం పొలతల గ్రామం దాన్ని చుట్టుపక్కల ఏడు చిన్న ఊర్లు వుండేవి. ఈ ఊర్లకు చెందిన ఆవుల మందను కాసే ధార్మిక మానవుడు రామయ్య. ఆయనకు ఒక శిష్యుడు. ఆయన పేరు పిలకత్తు. తాము కాసే ఆవుల మందలో ఒక ఆవు శూలు కట్టడం కానీ, ఈనడం కానీ లేకుండా చాలా ప్రత్యేకంగా ఉండేది. ఆ విషయం గుర్తించి దాని రాకపోకలపై దృష్టి పెట్టాడు పిలకత్తు. ఒకరోజు అందరి కన్నుగప్పి ఆవు మందకు అడ్డంగా బిగించిన కంచెను అవలీలగా ఎగిరి అవతలికి దూకింది. వడివడిగా ముందుకుసాగింది. పిలకత్తు దాని వెనుకగా చేత గొడ్డలి పట్టుకుని అనుసరించాడు. అలా ఆవు కొంతదూరం వెళ్లింది. ఓ ముళ్లపొద గొడుగులా పైకి లేచింది. దాని కింద ఒక దివ్యపురుషుడు పడుకుని ఉన్నాడు. ఆ ఆవు తన పొదుగునుంచి క్షీరాన్ని ఆ దివ్యపురుషుని నోటి లోనికి వదలసాగింది. ఈ ఘటన చూసిన పిలకత్తు ఎవరో అగంతకుడు ఆవుపాలు ఇలా దొంగచాటున జుర్రుకుం టున్నాడని తలపోశాడు. ముందు వెనుక ఆలోచించకుండా చేతిలోని గొడ్డలితో ఆ దివ్య పురు షుని మడిపై మోదాడు. చివ్వున రక్తం పైకి చిమ్మింది. నెత్తురు చూసిన పిలకత్తు కంగారుపడి పోయాడు. గురువు రామయ్య వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. రామయ్య వృత్తాంతం అంతా విని జరిగిన పొరబాటు ఎంత బలీయమైనదోనని ఆందోళన చెందుతుండగానే పిల కత్తు క్షణాలలో పూనకం వచ్చినట్లు వూగిపోయాడు.
వెంటనే పిలకత్తును ఆవహంచింది సాక్షాత్తు పరమశివుడే అని తెలిసి జరిగిన అపరా ధాన్ని క్షమించమని, గుడికట్టి భక్తి శ్రద్ధలతో పూజించుకుంటామని కన్నీరు మున్నీరై సాష్టాం గ దండ ప్రమాణాలు చేశాడు రామయ్య. అనంతరం ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి మల్లికార్జునస్వామి భక్తుల కోర్కెలు తీరుస్తున్నారు. అక్కదేవతలు, పులిబండెన్నల ఆగమనం. ఒకప్పుడు పొలతల ప్రాంతంలో 101 కోనేర్లు పులివింజ మానులు, విశాలమైన ప్రకృతి పచ్చదనాలతో అలరారేది.. ఆ ప్రశాంత ప్రకృతి వాతావరణంలో మ#హమాన్విత మధుర జలాలతో ప్రాణకోటికి జీవనాధారమైన 101 కోనేర్లకు సమీపంలోనే మబ్బుకోన అనే ఒక గని ఉండేది. ఆ గనిలో దివ్య పురుషుడు అయిన తులశ బ్రహ్మ తపోదీక్షలో ఉండే వారు. అలాగే గనిలో పునీత మహమలైన అక్కదేవతలు ఏడుగురు కూడా ఉండేవారు. అక్క దేవతల బాషణలు తులశ బ్రహ్మకు అవరోధంగా మారాయి. అక్క దేవతలకు తుల శబ్రహ్మ తన తపోసమాధికి ఎదురవుతున్న ఆటంకాన్ని తెలిపి సమీపంలోని కోనేర్లను ఆధార భూతంగా చేసుకుని జీవించమని కోరారు. మౌని మాటలను మన్మించి ఆ కన్నియలు గని విడచి కోనేరు వద్దకు చేరి జలక్రీడలలో ఆనందించసాగారు. ఒకరోజు ఒక ఓంకార శబ్దంతో ఒక సుడి తాటిచెట్టంత ఎత్తులేచింది. దీంతో ఆ కన్నియలు పారిపోయి బంగాళా బోడు దగ్గర వెలిసివున్న శివుని గుడిలో ప్రవేశించి శివుని శరణువేడారు. పరమశివుడు ప్రత్యక్షమై కన్యక లను దుమ్ము, ధూళి రూపంలో వెంబడిస్తున్న శక్తిని నిలువరింపచేశారు. శివుని దర్శ నంతో ఆ అప్రకటిత శక్తి తన నిజస్వరూపంలో శివుని ఎదుట నిలువక తప్పిందికాదు. నీవు ఓం శక్తివి కావు పులిబండైవున్న నీ శక్తియుక్తులు ఇకపై లోక కళ్యాణార్థమై వెచ్చించు. అలాగే మ#హమా న్వితులైన ఈ ఏడుగురు కన్నియలు కూడా భక్తాదుల మనో కామితలను సిద్దింప చేస్తారు. ఇకపై మొదటిపూజ అక్కదేవతలైన కన్నెలకు, పిమ్మట తనకు ఆ తరువాత పులిబండెన్నకు పూజలు జరుగుతాయని చెప్పి పరమశివుడు అదృశ్యమయ్యాడు. అదేవిధంగా నేడు కూడా తొలి పూజలు అక్కదేవతలకు జరుగుతున్నాయి.
పొలతల ప్రాంత ప్రజలు తరచు దివిటి దొంగల బారినపడేవారు. దివిటీ దొంగలు సర్వం దోచుకుని వెళ్లేవారు. అంతేగాక కలరా వ్యాధితో చాలామంది మృత్యువాత పడ్డారు. ఈ కారణాలతో పొలతల ప్రాంతంలోని ప్రజలు గ్రామాలు వదలిపెట్టి వెళ్లడం ప్రారంభిం చారు. దీంతో చాలాకాలం మల్లికార్జున స్వామికి ధూప దీప నైవేద్యాలు కరువయ్యాయి. ఇది లా వుండగా వేంపల్లె తూర్పున గండి ఆంజనేయ క్షేత్రం ఉంది. ఆ క్షేత్రానికి మూడు మైళ్ల దూరంలో ఏక దంతనాయుడు కోట ఉండేది. ఆ కోటలో దొంగతనాలు చేసి జీవించే 50 కుటుంబాల వారు జీవించేవారు. వీరు పరాక్రమవంతులు. వీరిని ఏకలవీరులు అని కూడా పిలిచేవారు. ఏకదంత నాయుడితో పాటు ఏకల దొరలు కొందరు ఒకరోజు వేటకు వెళ్లి పొల తల ప్రాంతాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆ పిమ్మట పొలతల మల్లికార్జున స్వామి ఆలయాన్ని బంగాళా బోడు నుంచి పక్కనే గల మరోబోడు పైకి మార్చి సర్వాంగ సుందరంగా ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి పరచి భక్తిప్రవత్తులను చాటుకున్నారు. దివిటి దొంగలలో మానసిక మార్పు తెచ్చి భక్తి మార్గానికి మల్లించిన పొలతల మల్లికార్జునస్వామి మహమలు అనంతం.. ఇక్కడికి వచ్చే స్త్రీ, పురుషులు తమ కోర్కెలు తీరాలని ముడుపులు కడుతుంటారు. ఇక్కడ స్వామికి కొబ్బరికాయ కొట్టినా ఇక్కడే వదలిపెట్టి వచ్చే సంప్రదా యం ఉంది. మహాశివరాత్రి, కార్తీకమాస, వారోత్సవాలకు జిల్లా నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి వేలాది వాహనాల్లో భారీగా భక్తులు తరలివస్తారు.
ప్రతి సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో పొలతల మల్లికార్జున దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ#హస్తారు. భక్తుల సౌకర్యార్థం ఈ ఆల యానికి ఆర్టీసీవారు ప్రతిరోజు ప్రత్యేక బస్సును నడుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement