Sunday, May 12, 2024

బ్రహ్మజ్ఞానులలో అగ్రేసరుడు పిప్పలాద మహర్షి

బ్రహ్మజ్ఞాని… యోగులలో గొప్పవాడు, మహర్షులలో ఉత్తముడు పిప్పలాద మహర్షి. పద్మ పురాణంలోనూ, శివపురాణంలోనూ ఉన్న పిప్పలాదుడి చరిత్ర.
ఒకసారి దేవ దానవ సంగ్రామం జరుగుతుండగా రాక్షసులు తమ ఆయుధా లను తస్కరించి తీసుకుపోకుండా జాగ్రత్తగా దాచి పెట్టమని దేవతలు వాటిని దధీచి మహర్షికి అప్పగించారు. తరువాత తీసుకుంటామని చెప్పారు ఎందుకంటే దధీచి మహర్షి ఆశ్రమంలో ఉంటే రాక్షసులు ఆయుధాలను ఎత్తుకు పోలేరు. అంతేకాకుండా దధీచి మ#హ ర్షి ఆశ్రమంలో అవి ఉంటే వాటి తేజస్సు పెరుగుతుంది అని కూడా వాళ్ళ నమ్మకం. యుద్ధం తరువాత ఆయుధాలు తీసుకొమ్మని దధీచి వారికి కబురు చేసినా దేవతలు తమ ఆయుధా లు తీసుకెళ్లలేదు తరువాత తీసుకెళ్తామంటూ ఉండేవారు. చిరకాలం చూసి ఆ ఆయుధాల ను రక్షించే బాధ్యత తను వహంచలేక వాటన్నిటినీ తనలోకి తీసేసుకున్నాడు దధీచి. అవన్నీ ఆయనలో జీర్ణమైపోయాయి. తరువాత ఎప్పుడో దేవతలు వచ్చి ఆయనను తమ ఆయుధా ల కోసం అడిగారు. అప్పుడు వాళ్లతో ఎన్నోసార్లు మీ ఆయుధాలు తీసుకెళ్ళమని చెప్పాను, మీరే తీసుకెళ్లలేదు. అవన్నీ నా శరీరంలో జీర్ణమై పోయాయి. ఇప్పుడు ఆ ఆయుధాలు మీ కు లభించవు అన్నాడు. అప్పుడు వాళ్ళు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి అడిగారు ఆయన వాళ్లతో మీ ఆయుధాలన్నీ ఆయన ఎముకల్లో జీర్ణమైపోయాయి ఒకవేళ ఆయన దయతో తన ఎముక లు మీకు ఇచ్చినట్లయితే ఆయుధాల శక్తులన్నీ అందులో ఉంటాయి కనుక వాటితో మీ ఆయు ధాలు చేసుకోండి. వాటితో మీరు రాక్షస సంహారం చేయవచ్చు అన్నాడు.
ఆయన సలహా ప్రకారం దేవతలు వెళ్లి దధీచిని అడిగారు. ఆయన వాళ్ళతో ”నాకీ శరీ రంతో పనిలేదు. ఇది నాకు ఎందుకూ పనికివచ్చే వస్తువు కాదు. శరీరం లేకపోయినా జీవించ గలను. ఈ ఎముకలను తీసుకోండి” అని ఆయన తన భార్యకి కూడా తెలుపకుండా తన శరీ రాన్ని యోగాగ్నిలో వదిలిపెట్టి ఎముకల్ని దేవతలకు ఇచ్చేసాడు. దధీచి ఎముకలతో దేవత లు ఆయుధాలు చేసుకొని వాటితో శత్రువులైన రాక్షసులని చంపారు. దధీచి మరణించే సమ యంలో ఆయన భార్య సువర్చల గర్భవతి. ఆమె గర్భంలో పుత్రుడున్నాడు. ఆమె సహగ మనం చేద్దామని అనుకుంది. యోగాగ్నితో తను కూడా అగ్నిప్రవేశం చేద్దామని అనుకుంది. సహగమనం అంటే ఆ భర్త శరీరంతోనే ఆ చితిపైనే చావాలని కాదు. భర్త వెళ్ళిపోతే తను కూడా అగ్నిలో ప్రవేశించడమే. ఆమె అలా వెళ్లిపోదామనుకుంటే ఆమెని అందరూ ప్రార్ధిం చి, ”ఇప్పుడు నీ గర్భంలో శిశువు వున్నాడు కదా! ఈ శిశువుని కన్న తర్వాత నీవు సహగమ నం చేయమ”ని అంటారు. అయితే ఆమె, ”నా భర్త పోయిన తర్వాత నాకీ లోకంతో సంబం ధం ఏముంది” అని ఖడ్గంతో తన గర్భాన్ని తానే చీల్చుకుంది. ”ఈ పుత్రుడును చంపే అధికా రం నాకు లేదు కాబట్టి వాడిని ఇక్కడే వదిలిపెడతాను” అనుకుని, సమీపంలో ఉన్న ఒక పిప్ప లి చెట్టును కొడుకుకు చూపించి, ”నాయనా! నీ తండ్రి ఈ లోకాన్ని వదలివెళ్ళిపోయాడు. నేనూ వెళ్ళిపోతున్నాను. ఇకనుంచీ ఈ పిప్పలిచెట్టే నీకు తల్లిd, తండ్రి. నా ఆశీర్వచనంతో నిన్ను ఈ పిప్పలి చెట్టు జాగ్రత్తగా కాపాడుతుంది. తరువాత నిన్ను ఎవరో పెంచి పెద్ద చేస్తారు! నీకు భవిష్యత్తులో చాలా కీర్తి కలుగుతుంది” అని చెప్పి సువర్చల వెళ్ళిపోయింది.
ఆ పిప్పలిచెట్టు (రావి చెట్టు) ఆ పిల్లవాడిని జాగ్రత్తగా పెంచింది. దాని సంరక్షణలో పెరి గాడు కాబట్టి ఆయనకి పిప్పలాదుడు అని పేరు వచ్చింది. దేవతలు ఎవరూ కూడా అతడిని గురించి పట్టించుకోలేదు. పిప్పలి చెట్టు ఆ పిల్లవాడికి అమృతం కోసమని చంద్రుణ్ణి ప్రార్ధిం చింది. అలా చంద్రుడి ద్వారా దొరికిన అమృతంతో ఆయన పెరుగుతాడు. క్రమంగా తన తల్లిదండ్రుల స్థితిని తెలుసుకున్నాడు. తన స్థితికి, తన తల్లిదండ్రుల స్థితికి కారకులైన దేవత లను కఠినంగా శిక్షించాలని నిశ్చయించుకొని, చంద్రుడిని సలహా అడిగాడు. ఆయన ”నీ కోరికని ఎవరూ కాదనలేరు, నీవు గోదావరీ తీరానికి వెళ్లి అక్కడ ఈశ్వరుని గురించి తపస్సు చెయ్యి. ఆయన అనుగ్రహంతో నీ కార్యం సంపూర్ణం అవుతుం ది” అని బోధించాడు.
పిప్పలాదుడు చిరకాలం తపస్సు చేసిన ఫలంగా శివుడు ప్రత్యక్షమైన తర్వాత, ”శాం తి, జ్ఞానం, మోక్షం, విద్య, వైరాగ్యం ఇవన్నీ ఇప్పుడు నేను పట్టించుకునే స్థితిలో లేను. #హృద యం ద#హంచుకుపోతుంది. నా తల్లిదండ్రులు జ్ఞాపకం వస్తున్నారు. నా సహ పిల్లలందరూ అమ్మానాన్నా అని పిలుస్తుంటే నాకా భాగ్యం లేదు. నేను దిక్కులేనివాడిలాగా చెట్టుకింద పెరిగాను. దేవతలు అనుగ్రహంచి వరాలు ఇస్తారు, తపస్సు చేసేవాళ్ళని రక్షిస్తారు అంటారు కదా. దీనికి విరుద్ధంగా నా విషయంలో ప్రవర్తించిన వారు క్షంతవ్యులు కారు. అందుకే వాళ్ళని శిక్షించదలుచుకున్నాను. దానికై నాకు కావలసినంత శక్తిని ఇవ్వు” అని అడిగాడు.
ఈశ్వరుడు ”నీకు శక్తిని ఇస్తున్నాను” అని ఒక కృత్యని సృష్టించి ఇచ్చాడు. ఆయన ఆ కృత్యని దేవలోకానికి వెళ్లి దేవతలని వధించి రమ్మన్నాడు. అనేకమందిని ఆ కృత్య వధించిన తర్వాత, మిగిలిన దేవతలు బ్రహ్మని శరణువేడారు. ఆయన వారితో కలిసి రుద్రుడిని శరణు కోరారు. ఈశ్వరుడు వాళ్ళతో, ”నేను ఏం చెయ్యను? ఆయన తపస్సుకి ఫలంగా వరం ఇచ్చా ను. ఆ పిప్పలాదుడే ఒప్పుకుంటే, అతడికే అనుగ్రహం కలిగితే, దేవతలు బ్రతుకుతారు. లేక పోతే ఇంతే.” అంటాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు ”ఆయనది తీవ్రమైన భయంకరమైన సంకల్పం. ఆయన ఎవరు చెప్పినా వినడు. ఆయనకి ఆ శక్తిని ఇచ్చింది నువ్వే కాబట్టి, నీవే పిప్పలాదుడిని శాంతింపచెయ్యి” అని ప్రార్ధించారు.
దాంతో రుద్రుడు, బ్రహ్మని, ఇతర దేవతలని తీసుకుని పిప్పలాదుడి దగ్గరికి వెళ్లి, ”నాయనా! ఈపాటికి నీ ఆగ్ర#హం చల్లారి ఉండవచ్చు. నీ శక్తి సామర్ధ్యాలు లోకానికి రుజువు అయినవి. దేవతలు అందరిని కూడా నీవు చంపగలవు. కొంతమందిని వధించావు. మిగిలి నవాళ్లు నిన్ను శరణుకోరుతున్నారు. వాళ్ళని వధించగలిగే శక్తి కలిగి కూడా, క్షమించి వదిలి పెడితే నీకు కీర్తి లభిస్తుంది.” అని అంటాడు. సాక్షాత్తూ పరమ శివుడే వచ్చి చెబుతున్నాడని పిప్పలాదుడు సంతోషించి, ”మహాప్రభూ! నన్ను అనుగ్రహంచి నేను కోరిన వరం ఇచ్చావు. నాయందు వాత్సల్యంతో ఇప్పుడు హతబోధ చేస్తున్నావు. నీమాట ఎలా అతిక్రమిస్తాను, నా క్రోధం చల్లారింది. మిగిలిన దేవతలు అందరు బ్రతికేవుంటారు” అంటాడు.
అప్పుడు శివుడు ఆయనకి మరొక వరం కూడా ఇచ్చాడు. ”నీ క్షమకి, కారుణ్యానికి నేను సంతోషించాను, నీ తల్లిదండ్రులని చూడలేకపోయావనే కదా నువ్వు దు:ఖపడేది. ఆ దు: ఖం నీకు ఉండదు. నువ్వు అనుకున్న సమయంలో పితృలోకాలకు వెళ్లి నీ తల్లిదండ్రుల దర్శ నం చేసుకొనిరా. వాళ్లతో సంభాషణ కూడా చెయ్యవచ్చు, నీకు వాళ్ళ దర్శనం దొరకగా నే, నీ దు:ఖం పోతుంది” అని చెప్పాడు. పితృలోకాలకు వెళ్లి తల్లిదండ్రుల దర్శనం చేసుకున్న పిప్పలాదుడు, వారి శరీరాలు పోయాయి కాని వారు క్షేమంగానే, ఆరోగ్యంగానే, దివ్య శరీరాలతో వున్నారు అని శాంతపడ్డాడు. మళ్ళీ భూలోకానికి వచ్చి తపస్సు చేసుకున్నాడు. ఆయనకి బ్రహ్మజ్ఞానం కలిగింది. సౌనక మహర్షికి ఆయన బ్రహ్మవిద్య, బ్రహ్మప్రాప్తి యోగ ములు, వాటి ఉపాయాలు, అంతర్‌, బాహ్య సౌచాది లక్షణాలు, నిర్విశేషమైన బ్రహ్మ స్వరూ పం, ముముక్షువులు కర్తవ్యాలు అన్నీ చెప్పాడు. పిప్పలాదుడు చెప్పినటువంటి పరబ్రహ్మో పనిషత్తు అనేది ఒకటి వుంది. ఇదే ”బ్రహ్మోపనిషత్తు” అనే పేర యజుర్వేదాంతర్గతమై 25 మంత్రములతో కూడి వుంది. యజ్ఞోపవీత వర్ణనతో మొదలుపెట్టి పరబ్హ్మ స్వరూపాన్ని నిరూపించేది ఈ ఉపనిషత్తు. దాన్లో ఈ విషయాలన్నీ వున్నాయి. బ్రహ్మవిద్యయే వరిష్ట. అట్టి బ్రహ్మప్రాప్తికి ఉపాయాలన్నీ చెప్పాడు బ్రహ్మజ్ఞానులలో అగ్రేసరుడు,

Advertisement

తాజా వార్తలు

Advertisement