Sunday, May 19, 2024

రమణీయ సంగ్రామము

రామాయణంలో ప్రతి సంఘటన హృద యంగమైనది. సీతమ్మవారి తెలుసు కున్న హనుమను ఆలింగనం చేసుకున్న శ్రీ రాముడు తక్షణం మధ్యాహ్నకాల అభిజిత్‌ లగ్నంలో యుద్ధానికి ముహూర్తం నిర్ణయిం చాడు. సుగ్రీవుని యుద్ధ సన్నాహాలు మొద లుపెట్టమన్నాడు. అధర్మపరుడైన రావణుని అంతం చేయడానికి వానరసేన చూపిన ఉత్సా హం కూడా ఎంతో రమణీయంగా ఉంటుం ది. దుర్మార్గులైన రాక్షసులను తుదముట్టించ డానికి రామలక్ష్మణుల వెంట నడిచిన తీరు ఒక ఉత్సవాన్ని తలపిస్తుంది.
శ్రీరాముడు హనుమంతుని భుజముల పైన, లక్ష్మణుడు అంగదుని భుజస్కంధము లపైన ఆశీనులయినారు. సుగ్రీవుడు పల్లకిలో వానరులు మోయుచుండగా సేన ముందు భాగము నుండి బయలుదేరారు. రణోత్సాహ ముతో వానరవీరులు గుహల నుండి, పర్వత శిఖరము నుండి ఎగురుచూ, దుముకుచూ ముందుకుసాగారు. వారి భుజములపై పూల గుత్తులు, ఫలములు, తేనేపట్టులు కలిగిన మహావృక్షములు ఉన్నాయి. కొందరు వాటిని కోసుకొని భుజిస్తూ, తేనెను త్రాగుచూ పరమ ఆనందముతో ముందుకు ఒక మహావాహిని లా కదలిపోతున్నారు. వారు జయగర్వముతో ఒకరినొకరు తోసుకుంటూ, పడుతూ లేస్తూ పరుగులు పెడుతున్నారు. వానర, భల్లూక వీరుల కరచరణముల తాకిడికి చెలరేగిన దుమ్ము సూర్యమండలాన్ని కప్పివేసింది.
ఆ వానర ప్రముఖులందరూ ప్రసన్న మన స్కులై రామకార్యార్థము పొంగిపోయి అమి తోత్సాహము చూపుతూ వాయువేగముతో సాగిపోవుచున్నారు. శ్రీరాముడు స్వయంగా లంకను చేరి రావణుని సంహరిస్తానని శపథం చేసాడు. ఆ మాటతో లోక కళ్యాణార్థం మహా సంగ్రామంలో పాల్గొనేటందుకు ఎప్పుడెప్పు డా అని ఉరుకుతున్నారు.
¸°వనముతో తొణికిసలాడుచున్న వాన ర వీరులు తహతహలాడుచూ దర్పము తో మార్గమధ్యమున తమ జయజయ హర్ష ములను, బలపరాక్రమములను ప్రదర్శించు చున్నారు. ఆ మహాసేన సముద్ర అలల మాదిరి పైకి క్రిందకి కదలుచూ కనబడుచున్న ది. తమ వాలములు భూమిపై తాడించుచూ వింత శబ్దమును చేయుచున్నారు.
మహాకాయుడైన హనుమ భుజాలపై శ్రీ రాముడు, అంగదుని భుజాలపై లక్ష్మణుడు ఆ మహాసేనతో దక్షిణ దిక్కుగా బయలుదేరిన దృశ్యం అధర్మవర్తులను పరిమార్చే రీతిలో కదులుతున్న మహోగ్ర ధర్మదేవత శ్రేణిలా కనబడుతోంది. వివిధ వానర, భల్లూక వీరుల కదన కుతూహలం పెళ్ళి విందుకు వెడుతున్న బృందంలా సంతోష తరంగాలను ధ్వనింప చేస్తోంది. సీతామాతను దర్శించి తమతో తీసు కువచ్చేందుకు కదులుతున్న ఆ మహాసేన రాత్రనక, పగలనక ప్రయాణిస్తూనే ఉంది. లంకను ఒక తుచ్ఛéమైన దేహంగా, సీతాదేవిని ఒక పవిత్ర ఆత్మగా భావించి ఆత్మ దర్శనం చేసుకోడానికి సాగుతూనే ఉన్నారు.
సహ్యాద్రి మీదుగా మలయ పర్వతమును దాటారు. చివరకు శ్రీరామచంద్రుడు ఆ మహా సేనతో మహేంద్ర పర్వత సానువులను చేరా డు. పర్వత శిఖరాన్ని అధిరోహించిన శ్రీరాము నకు అనంతమైన సాగరం కనపడింది. మహేంద్ర పర్వతాన్ని కప్పి వేసిన వానరసేన తో దాని వర్ణము చిత్రముగా మారిపోయింది. శ్రీరాముడు లక్ష్మణ సహితుడై సుగ్రీవునితో ఆ సముద్రాన్ని దాటే సమస్యకు పరిష్కారం కోసం సమాలోచన చేయసాగాడు.
ఎగసి పడుతున్న నీలి సముద్రం ఒకవైపు, లయబద్ధంగా పైకి క్రిందికి లేచిపడుతున్న వానర సైన్యం ఇంకొక వైపు, ఆ మనోహరమైన దృశ్యాన్ని చూసి అక్కడి ప్రాణులన్నీ గొప్ప అనుభూతికి లోనయ్యాయి. సమరోత్సాహం తో ఆహ్లాదంగా సాగిన వానరసేన దశకంఠుని అవలీలగా సంహరించిన శ్రీరామచంద్రుని వేనోళ్ళ కొనియాడారు. విజయోత్సాహంతో వారంతా సీతాసమేతంగా పుష్పక విమా నంలో అయోధ్య చేరి పట్టాభిషేక విందులో బహుపసందుగా పాల్గొని తమ జన్మలను చరితార్థం చేసుకున్నారు.
– వారణాసి వెంకటసూర్య కామేశ్వరరావు
80745 66269

Advertisement

తాజా వార్తలు

Advertisement