Sunday, May 19, 2024

శ్రేయస్సు కలిగించేవి శుభ ముహూర్తాలు!

అతి స్వల్ప ప్రమాణమయిన తృటి నుండి మహాయుగము వరకు కాలగణన చేసినది మన సనాతన ధర్మపథములోని ఋషి పరంపర. మన వేదశాస్త్ర నిధి కాలగణన చేసి అది భగవంతుని స్వరూపమని నిర్థారించినది. ఈ అనంత విశ్వంలోని నక్షత్రా లు, వాటి చుట్టూ పరిభ్రమించే గ్రహ రాశులకు వివిధ రకములైన చలన కాలపరిమాణము లు ధర్మరూపములో నిర్దేశించబడినవి. ప్రత్యక్ష భగవానుడైన సూర్యుని ఆదేశముతో మనం నివసించే భూమి, చంద్రుడు మిగిలిన గ్రహాలకు గమన కాలము నిర్థారించబడినది. ఉదా హరణకు మన భూమి సూర్యుని చుట్టూ ఒక ప్రదక్షిణం చేయడానికి సుమారు మూడువంద ల అరవైఐదు రోజులు పడుతుంది. అదే శనిగ్రహానికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పడు తుంది. చంద్రునిపై ఒక రోజు అంటే మన భూగోళ కాలమాన ప్రకారం ఇరవై ఎనిమిది రోజు లు. సూర్యరశ్మి ప్రసరించే పగటికాలం పధ్నాలుగు రోజులు.
ఎనభైనాలుగు లక్షల రకాల జీవులతో పాటు మానవుడు సూర్య, చంద్రుల ఆధారంగా సృష్టించబడ్డాడు. ఆదిత్యుని కిరణ చైతన్యంతో జీవం సృజించబడింది. సూర్య, చంద్ర కాల మానాలను బట్టి క్రమశిక్షణాయుతమైన జీవనగతి ఏర్పాటు చేయడమైనది. అందువలననే మానవుడు ఏ పనిని చేయాలన్నా ఒక ముహూర్తం అవసరమయినది. ముహూర్తం అంటే బలమైన సంకల్పం చేయడం. భూమి మీద నివసించే ప్రతి జీవి మీద సూర్యచంద్రులతో బాటు మిగిలిన గ్రహాలు, నక్షత్రాల ఆకర్షణా ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. గ్రహణ, భూకంప సమయాల్లో పక్షులు, జంతువుల ప్రవర్తన విభిన్నంగా ఉండడం మనం గమనిం చాం. అదేవిధంగా పౌర్ణమి, అమావాస్య సమయాల్లో సముద్రపు ఆటుపోట్లు, మానవుల లో నేరప్రవృత్తి, శృంగార వాంఛలలో విపరీత ప్రభావాలను గుర్తించడం జరిగింది. పంచ భూతాత్మకమైన మానవుడు తాను మొదలుపెట్టే ప్రతి కార్యానికి ఒక పవిత్రమైన సమయా న్ని ఎంపిక చేసుకోవడమనే ఒక గొప్ప ఆవిష్కరణ ముహూర్తం. జ్యోతిష్య, ఖగోళ శాస్త్రాలు పరస్పర ఆధారితాలు. ఇవి చెట్టుముందా? విత్తుముం దా? అన్న చందాన కనబడతాయి. సత్యవాక్యాల సమా హారమే శాస్త్రముగా రూపుదిద్దుకుంటుంది. అందువల ననే అది సమాజానికి ప్రయోజనకరంగా ఉంటుంది. దానిని శోధించి, మధించ కలిగే మేథస్సు కలిగినవారు చాలా అవసరం. లేకపోతే అవి విశ్వాసానికి దూరం అవ డమే కాక ఎన్నో రహస్యాలు నిగూఢంగా ఉండిపోతాయి. ఆకాశంలో నక్షత్ర రాశులను, ఖగోళ గమనాలను కంటి చూపుతో చూసి ముహూర్తం నిర్ణయించగల వశిష్ఠ మహా మునులంతటి నిష్టాగరిష్టులు, ద్రష్టలు ఈ యుగంలో ఎక్కడైనా ఉంటే అది మన అదృష్టమనే చెప్పుకోవాలి.
జ్యోతిష్యం ఒక సూచికాశాస్త్రం. మన సంకల్పానికి సరిఅయిన సమయాన్ని ముహూర్త రూపంలో సూచన చేస్తుంది. పంచ అంగములు మరియు వ్యక్తిగత సమాచా రం ప్రకారం నిర్ణయించిన శభముహూర్త సమయంలో చేపట్టే ప్రతికార్యం ఖచ్చితంగా విజయవంతమవుతుం ది. దానినే ముహూర్త బలం అని పరిగణిస్తారు.
జ్యోతిష్యం అంటే వెలుగును చూపేది. ఒక మంచి ఆశాభావ మార్గాన్ని కల్పించేది. మనిషి తల్లి గర్భం నుం డి ఈ భూమి మీదకు వచ్చినపుడు శిశువుపై సూర్యచంద్రులతో పాటు నక్షత్రముల, గ్రహ ముల పరావర్తన కాంతి మొట్టమొదట పడుతుంది. ఆ సమయంలో ఆ జ్యోతుల వలన శిశు వు లేక ఆ జీవి మస్తిష్కం ఒక పంథాకు నిర్దేశన చేయ బడుతుంది. ఆ పంథాలోనే అతను లేక ఆమె జీవన గమనం నడుస్తుంది. ఆ గమనంలో ఏర్పడే అడ్డంకు లను అధిక మించడానికే జ్యోతిష్యం ఒక శుభకరమైన, అవిఘ్నకరమైన ముహూర్త కాలమును, విధానము ను సూచిస్తుంది. అయితే దీనికి చక్కని పరిజ్ఞానం కలి గిన పండితులు అవసరం. వ్యాపారాత్మక ప్రస్తుత కాలంలో అనేక శాస్త్రాలకు గ్రహణం పట్టింది. మిడి మిడి జ్ఞాన ప్రజ్వలన సమాజాన్ని భయపెడుతోంది.
జోతిష్యశాస్త్రము జ్యోతిష్కులకు కావలసిన అర్హ తలు, లక్షణాలు వివరించింది. వినయము, సత్య సం ధత, శ్రద్ధ, పాండిత్యము, గ్రహనక్షత్ర పరిజ్ఞానము, వేదజ్ఞానము, శుచి, శీలము, నిజాయితీ, ధైర్యం కలిగి ఉండాలి. అత్యాశ, దురాశ లేనివారై ఆధ్యాత్మిక పరిణ తి కలిగియుండాలి. అటువంటి వారికి వాక్సుద్ధి లభి స్తుంది. ఇతరుల మనోభావనలను గ్రహించి వారికి ధైర్యం, సూచనలను అందిస్తారు. ప్రారబ్దం ప్రకారం జీవనయానం ఉంటుంది. దానిని ఎవరూ మార్చలే రు. కానీ దాని ప్రభావం తగ్గించుకుని మంచి సంక ల్పంతో ముందుకు వెళ్ళవచ్చు. అటువంటి శుభ సం కల్పం చేయగల ముహుర్తాలను జ్యోతిష్యం నిర్ణయి స్తుంది. సహజంగా ఉదయమే లేచి సృష్టికర్త పరమా త్మను ఏ రూపంలో ఆరాధించినా ప్రారబ్ధం ప్రకారం జరగవలసిన తాపత్రయ అవరోధాల తీవ్రత తగ్గి అవ యవం పోవాల్సిన చోట చిన్నదెబ్బ తగులుతుంది. అలాగే శుభప్రదమైన ముహూర్తం శ్రేయస్సును కలిగి స్తుంది. చంద్రగతిని అనుసరించి శుక్ల, కృష్ణ పక్షము లు, తిథులు, తారాబలం, లగ్నబలం, వారము మొద లైనవి. ఆదిత్యుని అనుసరించి ఉత్తర, దక్షిణ ఆయనములు, మాసములు, ఋతువులు మొదలైనవి పరిగణలోకి తీసుకొని ముహూర్తం నిర్ణయిస్తారు. సూర్యచంద్రులను అనగా దృక్సిద్ధి, చంద్రమానాలను అనుసరించి జ్యోతిష్యశాస్త్రం గణించబడుతుంది. అయితే వీటి మధ్య పూర్తి సమన్వయం కల్పించుకోవలసిన బాధ్యత విజ్ఞుల మీద ఉన్నది.
బేసి రాశులు, సరిరాశులు, వర్ణములు, చర, స్థిరములు, గ్రహదృష్టులు, శుభ, పాప వీక్ష ణలు, గ్రహజాతులు మొదలైనవి పరిశీలించి వివిధ కార్యక్రమాలకు ముహూర్తాలు నిర్ణ యించబడతాయి. ముఖ్యముగా తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములైన పంచ అంగము లను అనుసరించి శుభముహూర్తం నిర్ణయిస్తారు. ఉదాహరణకు శుక్రవారం నాటి నంద తిథులు, బుధవారం నాటి భద్ర తిథులు, మంగళవారం జయతిథులు, శనివారం రిక్త తిథు లు, గురువారం పూర్ణ తిథులు వీటిని సిద్ధ తిథులు అంటారు. ఇవి శుభప్రదాలు. ఇంకా అనేక జ్యోతిష్య మహత్తర విషయాలు శాస్త్రంలో పొందుపరచారు మన సనాతన ఋషులు. తారాబలం చాలా ముఖ్యమైనదిగా శాస్త్రం సూచిస్తోంది. ఏకవిశంతి దోషాలు లేకుండా ముహూర్తం నిర్ణయించాలని చెబుతోంది.
”పరిత్యజ్య మహాన్‌ దోషాన్‌ శేషయోర్బుణ దోష యో: గుణాధిక స్వల్ప దోషం సకలం మంగళప్రదమ్‌” అని ముహూర్త దర్పణం చెబుతోంది. గుణదోషాలను పరిగణలోకి తీసుకు ని గుణాలు అధికంగానున్న ముహూర్తాలు నిర్ణయించడం శుభకరం. జ్యోతిష్యశాస్త్ర వాఙ్మ యంలో అనేక అద్భుత గ్రంథాలను మన ఋషులు అందించారు. మానవ జీవిత గమనం లో జరుపుకునే ప్రతి కార్యానికి వారివారి జన్మాంశములను అనుసరించి ఒక శుభప్రదమైన ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. అటువంటి మహత్తర ప్రయోజనాన్ని, అవకాశాన్ని కల్పించే సూచికాశాస్త్రమే జ్యోతిష్యం.
పంచక రహితం చేసిన ముహూర్తాలు బలంగా ఉంటాయి. ముఖ్యంగా గమనించవల సిన విషయం ఏమిటంటే శాస్త్రం ఎవరిని భయపెట్టదు. శుభప్రదమైన సంకల్పాన్ని చేసుకోవ డానికి దోహదపడుతుంది. ప్రకృతికి అనుగుణంగా ఎలా నడుచుకోవాలో ఇది నేర్పుతుం ది. కాలానుగుణ క్రియలు చేపట్టడానికి దారి చూపుతుంది. ఒక చక్కని కాల నిర్ణయ పట్టిక అందిస్తుంది. సృష్టికర్త ఆ పరమాత్మను సదా ధ్యానించుకుంటూ తమ జన్మాంశములను అనుసరించి శుభప్రదమైన ముహూర్తాలు నిర్ణ యించుకుని బ్రహ్మజ్ఞాని సూచించిన ప్రకారం కార్యాలు నిర్వహిస్తే విజయం తథ్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement