Saturday, October 12, 2024

రాఘ‌వేంద్రుడి సేవ‌లో రిషి స‌నాక్ పేరేంట్స్ …

మంత్రాలయం: భారత సంతతి వ్యక్తి, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్ తల్లిదండ్రులు యశ్వీర్‌, ఉషా సునాక్‌ బుధవారం మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శించారు. స్వామివారి మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సునాక్‌ అత్త, అక్షతా మూర్తి తల్లి సుధామూర్తి సైతం వారితో పాటు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మఠానికి విచ్చేసిన వారికి రాఘవేంద్ర మఠం పూజారులు వేద ఆశీర్వచనాలు అందించి శాలువలతో సత్కరించారు.

దీనికి సంబంధించిన చిత్రాలను రాఘవేంద్ర మఠం బుధవారం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. స్వామివారి మఠాన్ని సందర్శించిన రిషి సునాక్‌ తల్లిదండ్రులు, సుధామూర్తికి జ్ఞాపికను అందించినట్లు మఠం పేర్కొంది. రిషి సునాక్‌ కోసం స్వామివారి ప్రసాదాన్ని పీఠాధిపతి అందించినట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement