Wednesday, May 8, 2024

సార్థక జీవనం

సృష్టి ఒక అద్భుతం. భగవంతుడి సృష్టిలోని సకల జీవుల్లోనూ మనిషి జన్మ ఉత్తమమైనది. జీవితం ఎంతో విలువైనది. మనిషి అన్నాక మానవతా విలువలు పాటిం చాలి. సాటి మనుష్యుల పట్ల దయతో, సానుభూతితో జీవించాల్సి వుంది. మానవ సంబంధాల పట్ల గౌరవం వుం చాలి. ఈ నవనాగరిక సమాజంలో మనిషి ధనార్జనే ప్రాధా న్యంగా ఎంతటి అన్యాయానికైనా, ఏవిధమైన అధర్మానికై నా వెనుకాడడం లేదు. అలాగాక క్షణికంగా భావించబడే ఈ జీవిత కాలాన్ని సద్వినియోగం గావించుకుంటూ జీవితా న్ని సార్థకం చేసుకోవాలి. అన్ని జీవుల్లోనూ సాధారణంగా ఆహారం, నిద్ర, భయం, మైధునాలు సర్వ సామాన్యాలు. వీటి ఆధారంగా తమ జీవితాలను సాగించేవారు ఎంతోకా లం మన స్మృతిపథంలో నిలిచే అవకాశం వుండదు. ఎవ రైతే తనను ఈ తనువు చాలించిన తర్వాత కూడా పది కాలా లపాటు గుర్తుంచుకునేలా జీవిస్తారో వారే చిరంజీవులు. వారు ప్రజలకు చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోలేరు. వారి నిస్వార్థ సేవలు మరువలేము. కొందరి సేవలు వారి కర్తవ్య నిర్వహణలో ఆచరించినవి కావచ్చును. అవి పది కాలాల పాటు జన జీవనానికి ఉపయోగపడుతూ వారిని క్షణక్షణం గుర్తుకు తెస్తూనే వుంటుంది. ఎందరో శాస్త్రజ్ఞు లూ, ప్రభుత్వ ఉద్యోగులూ, ఎంతో ఓర్పుతో కఠోర దీక్షతో, తమవంతు ప్రయత్నాలను సఫలీకృతం గావించుకుని, ప్రజల క్షేమమే ధ్యేయంగా ముందుకు సాగి తమ మేధాశక్తి ని మధించి మరీ మనలను సుఖమయంగా జీవించడానికి శ్రమించారు. వీరికి కూడా ఎన్నో అవరోధాలూ, అసౌకర్యా లూ, సంకట పరిస్థితులూ ఎదురుకావచ్చును. వాటన్నింటి నీ కాదని, నిజాయితీగా, నిక్కచ్చిగా జీవిస్తూ, తమ కుటుం బ సభ్యుల సహకారంతో, ఏమాత్రం అధైర్యపడకుండా, క్రుంగిపోకుండా, మరింత ఉత్సాహాన్ని తెచ్చుకుని, తమ సమాజానికి ఏదో చెయ్యాలని చేసిన మహనీయులు అన్ని కాలాలలోనూ మనకు కనపడుతూనే వుంటారు. వీరిలో సహజమైన, ఉపకార స్వభాం, కరుణ, దయ, ధార్మిక స్వభా వం పుష్కలంగా వుంటుంది. సమాజంతమకు ఏమి ఇచ్చిం దని గానీ, తనకు ఏదో లాభం చేకూరుతుందనిగానీ ఈ మహానుభావులు అస్సలు ఆలోచించరు. వీరి దారే వేరుగా వుంటుంది. వీరిలో ఆత్మ విశ్వాసం మెండుగా వుం డి, ప్రతి క్షణం లోకోపకారం ధ్యేయంగా తమ ఆలోచనల కు పదును పెడతారు. ఏ పని ప్రారంభించినా దానిపట్ల అచంచల విశ్వాసంతో, భక్తిపూర్వకంగా, ముందుకు అడు గులువేస్తూ, చివరకు అనుకున్నది సాధించేవరకూ నిద్రా హారాలు మానుకునైనా అడుగులు ముందుకువేస్తారు. వీరి ది నిరంతరమూ సానుకూల వైఖరే. వీరికి ఎవ్వరిపైన అయి నా ద్వేషంతో వుండే ప్రసక్తే రాదు. అందరితోనూ సర్దుకుపో తారు. అహంకారంతో అతిశయంతో మిడిసిపడటం వీరికి కుదరని పని. అందుకే విజయలక్ష్మి సదా వీరినే ఆశ్రయించి వుంటుందన్నమాట నిజం. వీరి జీవిత విశేషాలను పరిశీలి స్తే, ఎంతో వినయంగా జీవిస్తూ, సామరస్య భావనతో జీవి స్తూ వున్నారని మనకు కనిపిస్తుంది. అందుకే వారు సుఖ పడకపోయినా జనాలు సుఖపడేలా వారి జీవితాలను వె చ్చించి ఆనందానుభూతిని పొందగలిగారు. ఆలోచించి చూస్తే ఎవ్వరికైనా ఇంతకన్నా నిజమైన సార్థక జీవితం ఏముంటుంది? వీరు భగవద్గీతలో పేర్కొన్నట్లుగా కర్మలు చేయడం వరకే తమకు అధికారం వుందని భావించి తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. భగవంతుడు ఈ విష యంలో ఫలితాన్ని మానవ సంక్షేమానికి ఉపయోగపడేలా తప్పక నిర్ణయిస్తాడు. ఈవిధంగా ప్రతి వ్యక్తీ కర్తవ్య పరాయ ణుడై తమవంతు కృషిని సాగిస్తూ వుంటే మానవ ధర్మం మరింత తేజోవంతమై వెలుగుతుంది.అదే కృష్ణతత్వం. అదే గీతాసారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement