Sunday, April 28, 2024

Asia Cup | ఫైనల్‌లో భారత్‌ను ఢీకొట్టేదెవరు..? పాకిస్థాన్, శ్రీలంక జట్ల వివకాలివే!

ఆసియా కప్‌ 2023 టోర్నీలో రోహిత్ సేన మరోసారి సత్తా చాటింది. సూపర్-4 స్టేజ్‌లో పాకిస్థాన్‌ను మట్టికరిపించిన టీమిండియా, శ్రీలంకను కూడా ఓడించి ఫైనల్స్ కు చేరింది. నిన్న (మంగళవారం) ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి, టోర్నీలో ఫైనల్‌కు వెళ్లింది. కాగా, ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియాను ఎవరు ఢీకొట్టే అవకాశం ఉందో చూద్దాం..

ఫైనల్‌లో భారత్‌తో తలపడనున్న జట్టు ఇదే..

టోర్నీలో భారత్ ఫైనల్‌కి వెళ్లడం, బంగ్లాదేశ్ ఆసియా కప్ నుంచి నిష్క్రమించడంతో.. రెండో స్థానం కోసం పాకిస్థాన్, శ్రీలంక పోటీ పడుతున్నాయి. ఆసియా కప్‌లో రేపు (గురువారం) పాక్ తన చివరి సూపర్ 4 మ్యాచ్ శ్రీలంకతో ఆడనుంది. ప్రేమదాస స్టేడియంలో జరిగే ఈ సెమీ ఫైనల్‌లో విజేతగా నిలిచిన జట్టు.. ఆదివారం ఆసియా కప్ ఫైనల్‌లో భారత్‌తో తలపడనుంది.

ఒకవేళ రేపు జ‌ర‌గ‌నున్న‌ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే, మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న జట్టు ఆసియా కప్ ఫైనల్‌కు వెళ్తుంది. అంటే శ్రీలంక తుది పోరుకు క్వాలిఫై అవుతుంది. ప్రస్తుతం నెట్ రన్ రేట్ విషయంలో పాకిస్థాన్‌ కంటే శ్రీలంక మెరుగ్గా ఉంది. సూపర్-4లో రెండు మ్యాచ్‌లు గెలిచి 4 పాయింట్లతో భారత్ అగ్ర స్థానంలో ఉండ‌గా.. శ్రీలంక, పాక్ ఒక్కో విజయంతో 2, 3 స్థానాల్లో ఉన్నాయి. చివరి సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్, శ్రీలంకను ఓడిస్తే.. నెట్ రన్ రేట్‌తో సంబంధం లేకుండా ఫైనల్‌కు వెళ్తుంది. దీంతో కప్ కోసం మరోసారి చిరకాల ప్రత్యర్థుల పోరు జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement