Friday, May 3, 2024

HYD: చంద్రబాబుకు ఐటీ ఉద్యోగుల సంఘీభావం… విప్రో సెంటర్ లో ర్యాలీ

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. విప్రో సర్కిల్‌ నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించిన ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఆయామ్‌ విత్‌ సీబీఎన్‌ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తత నెలకొంది.

ఆందోళనకు దిగిన ఐటీ ఉద్యోగులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. దీంతో విప్రో కూడలిలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబుకు అవినీతి మరకలు అంటించేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబును అక్రమ కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలన్నారు. కక్ష సాధించేందుకే బాబును జైల్లో పెట్టారన్నారు. ఆయన వల్లే తమకు ఉపాధి అవకాశాలు లభించాయని, తమ జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రబాబుకు అండగా ఉంటామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement