జగిత్యాల : కేసీఆర్ అంటే కైండ్ హార్టెడ్, కమిటెడ్ రెస్పాన్సిబుల్ లీడర్ అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మమూలు మనిషి కాదని, ఇలాంటి నాయకులు చాలా తక్కువ మంది ఉంటారని అన్నారు.. జగిత్యాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో కవిత మాట్లాడుతూ, మన తెలంగాణకు అలాంటి నాయకుడు దొరికారని, తెలంగాణ ఉద్యమం కొనసాగించిన పార్టీనే అధికారంలోకి వచ్చింది అని వివరించారు..
తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ, కేసీఆర్ స్పీడ్‌ను కాంగ్రెస్ నాయకులు అందుకోలేకపోతున్నారని, ఆ పార్టీకి జాతీయ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీనే అని స్పష్టం చేశారు. రేపట్నుంచి హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయని, ఇక గాంధీ పరివారం అంతా ఇక్కడికి వస్తోంది అని పేర్కొన్నారు. మొన్న ఖర్గే వచ్చి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చారని,. మేం వచ్చి పోడు పట్టాలు ఇస్తామంటున్నారని పేర్కొన్నారు.. అయితే తామ ఇప్పటికే మొన్ననే మనం పోడు పట్టాలు ఇచ్చేశామని అంటూ, . రాహుల్ గాంధీ అప్‌డేట్ లేని ఔట్‌డేటెడ్ నాయకుడని విమర్శించారు కవిత. .
కాంగ్రెస్ నాయకులు ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారని కవిత ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని, అందుకే దేశంలో కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తున్నారన్నారు కవిత . అలాంటి పార్టీని జగిత్యాలలో,. తెలంగాణలో ఊహకందని అభివృద్ధి జరుగుతుందని, దీంతో ప్రతిపక్షాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయన్నారు. కాంగ్రెస్ నేతల మాటలు విని మోసపోవద్దని అంటూ, తెలంగాణ ప్రజలకు గులాబీ పార్టీ శ్రీరామరక్ష ని అన్నారు.