Wednesday, May 15, 2024

ఈశ్వరునికి ప్రీతికర వ్రతాలు..

మశివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది, తెలుగు మాసాలలో విశిష్టమైనది కార్తీక మాసం. ముఖ్యంగా కైలాస నిలయుడైన పరమశివునికి ప్రీతిపాత్రం ఇది. ఆధ్యా త్మికపరంగా ఆరోగ్యప్రదమైన మాసం. ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్టతో చేపట్టే నోములకు, వ్రతాలు ఎంతో ప్రాధాన్యం ఉంది. వాటిలో పరమేశ్వరునికి ప్రీతి కరమైన వ్రతాలు కొన్ని-
సోమవార వ్రతం: సోమవార వ్రతం ఎంతో గొప్పది. సోమవారము శివునికి ఎంతో ఇష్ట మైన రోజు. అందులోనూ కార్తీక మాసములోని సోమవారాలు పరమశివునికి మరింత ఇష్టమైన రోజులు. కార్తీక మాసంలో సోమ వారం తెల్లవారు జామున లేచి శివనామ స్మరణ తో స్నాన సంధ్యాదుల్ని పూర్తి చేసుకుని శివాలయానికి వెళ్ళి యథావిధిగా ఈ వ్రతాన్ని ఆచ రించాలి. పూర్వం వసిష్ఠమ#హర్షి సోమవార వ్రతం చేసి అరుంధతీ దేవిని భార్యగాను, విభు డు అనే రాజు సంతానాన్ని, సోమశర్మ సకల ఐశ్వర్యాల్ని పొందారు. వజ్ర బాహుడు అనే రాజు శత్రువుల్ని, కీచకుడు అనే రాజు మృత్యువుని జయించారు. వేదాంగుడు అనే బ్రా#హ్మ ణుడు భార్యతో కలిసి కైలాసానికి చేరాడు. చంద్రుడు ఈ వ్రతం చేసి సోమత్వాన్ని పొంది సోముడు అనే పేరుతో పిలవబడి, ఈ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళ కోరికలు తీరేటట్టు అనుగ్ర హంచమని వేడుకున్నాడు. ఈ వ్రతం చేస్తే పాపాలు నశించి ఇ#హలోకంలో సుఖాలు అను భవించి చివరికి కైలాసానికి చేరతారు.
అర్ధావ్రతం: సూర్యుడు ఆరుద్రా నక్షత్రం ధనుర్లగ్నంలో ఉన్న రోజున ఉదయాన్నే లేచి స్నాన సంధ్యాదుల్ని చేసి శుచిగా చంద్రశేఖరుణ్ణి తలుచుకుంటూ శివాలయానికి వెళ్ళి ఈ వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించాలి. పూర్వం ముంచకేశుడు, విపులుడు అనే మహర్షులు, పతంజలి అనే యోగి, కర్కోటకుడు అనే నాగేంద్రుడు, మోక్షాన్ని పొందారు. వ్యాఘ్రపాదు డు అనే మహర్షి ఉపమన్యుణ్ణి కొడుకుగా పొందాడు. సాంబశివుడు జగత్తుని రక్షించడానికి రుద్ర నివాసంలో తాండవం చేసిన రోజు కనుక ఈ వ్రతం చాలా ఉత్తమమైందిగా చెప్ప బడుతోంది.
ఉమామహశ్వర వ్రతం: ఉమామహశ్వర వ్రతం భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే సుఖశాంతు లతో పాటు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. సూర్యుడు కర్కాటరాశిలో ప్రవేశించిన తరువాత వచ్చే పూర్ణిమ రోజు ఉదయం ఉదయాన్నే శుచిగా స్నానం చేసి ఈ వ్రతాన్ని యథావిధిగా చెయ్యాలి. పుట్టుకతో గుడ్డివాడైన తృణబిందుడు విశాలమైన నేత్రాల్ని, ఒక వితంతువు తన భర్తని, ఒక కొడుకుని, శ్రీకృష్ణుడు కొడుకుల్ని, బ్రహ్మదేవుడు, గాయత్రి, సావిత్రి అనే కూతు ళ్ళని, దేవేంద్రుడు జయంతుడు అనే కుమారుణ్ణి పొందారు. అలాగే అనేకమంది ఈ వ్రతాన్ని ఆచరించి తమ అభీష్టాల్ని తీర్చుకుని చివరికి శివసాయుజ్యాన్ని పొందారు. ఉమామహ శ్వర వ్రతం మ#హళలకు చాలా ముఖ్యం. దాని ప్రభావంతో, మహళలు దీర్ఘసుమంగళీ ప్రాప్తాన్ని సంపాదించుకోవచ్చు. వారికి తెలివైన సంతానం కలుగుతుంది.
శివరాత్రి వ్రతం: మహాశివరాత్రి రోజు ఉదయాన్నే శివనామాన్ని జపిస్తూ లేచి స్నాన సంధ్యాదుల్ని పూర్తిచేసుకుని జ్యోతిర్లింగ రూపంలో ఉన్న శివుణ్ణి ఆరాధించాలి. రాత్రంతా నిద్రపోకుండా జాగరణ చెయ్యాలి. ఈ శివరాత్రి వ్రతాన్ని బ్ర#హ్మ, ఇంద్రుడు, విష్ణువు ఆచ రించి గొప్పగొప్ప పదవుల్ని, కొంతమంది బృందారకులు గణాధిపత్యాన్ని, కుబేరుడు ధనా న్ని, వరుణుడు, వాయువులు గొప్ప బలాన్ని బ్రాహ్మణులు అనేకమంది చావుపుట్టుకలు లేని శివసాయుజ్యాన్ని పొందారు. కల్మాషపాదుడు. అనే మహారాజు బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకుని, మోక్షాన్ని పొందాడు. శివరాత్రి వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు అందరూ మోక్షా న్ని పొందుతారు. తెల్లవారుజామున శివుని పూజిస్తే రోగాలు నయమవుతాయి. రోజు ఉద యం పూట శివపూజ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. రాత్రిపూట పూజ చేస్తే మోక్షం లభి స్తుంది. ఒక సంవత్సరం శివరాత్రి ఉపవాసం వంద అశ్వమేధ యాగాలకు సమం అనేక గంగాస్నానాలకు సమానం. శివరాత్రి వ్రతాన్ని వయస్సు, కుల, మతంతో సంబంధం లేకుండా ఎవరైనా ఆచరించవచ్చు.
కేదారేశ్వర వ్రతం: ప్రతి శుద్ధ అష్టమి రోజు ఈ వ్రతాన్ని ప్రారంభించి ఇరవై ఒక్క రోజు లు ఏకాగ్రతతో మనస్సులో పరమేశ్వరుణ్ణి ధ్యానించి మరుసటి రోజు సూర్యోదయాన్నే నదీ ప్రవాహంలో స్నానం చేసి సంధ్యానుష్ఠానం పూర్తి చేసుకుని శాస్త్రోక్తంగా కేదారేశ్వర వ్రతం చెయ్యాలి. పూర్వం ఉమాదేవి తనకు కావలసిన వరాల్ని, హృషీకేశుడు వైకుంఠానికి ఆధిప త్యాన్ని, బ్రహ్మ హంస వాహనాన్ని, కుల శత్రువుల మీద విజయాన్ని పొందారు. పుణ్యవతి అనే వనిత భోగభాగ్యాల్ని పొందింది. పార్వతీదేవి శివుని అర్ధశరీరాన్ని పొందింది.
కళ్యాణ సుందరీ వ్రతం: కళ్యాణసుందరీ వ్రతం అన్ని శుభాలకు మూలమైంది. సూర్యుడు మీనలగ్నంలో ప్రవేశించినప్పుడు శుక్లపక్షం ఉత్తరా నక్షత్రం రోజు ఈ వ్రతాన్ని ఆచరించాలి. పూర్వం విష్ణుమూర్తి లక్ష్మీదేవిని, బ్రహ్మ సరస్వతిని, ఇంద్రుడు శచీదేవిని, చం ద్రుడు ఇరవై ఏడుమంది భార్యల్ని అగస్త్యుడు లోపాముద్రని పొందారు. హరి కుమార్తెలు సౌందర్యవల్లి, అమృతవల్లిలు వల్లి, దేవసేనలై పుట్టి జగదంబ కుమారుడైన షణ్ముఖుణ్ణి, వేదాంగుడు అనే బ్రాహ్మణుడి కుమార్తె కేశిని నందికేశ్వరుణ్ణి, సత్యపూర్ణుడు అనే మహర్షి కళ్ళనుండి పుట్టిన పుష్కరిణి, పూర్ణ అనే కుమార్తెలు కాలభైరవుణ్ణి వివాహం చేసుకుని, తమ కు ఇష్టమైన వాళ్ళని భర్తలుగా పొందారు. భోగ ఆదిత్యుడు అమావాస్యనాడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షాన్ని పొందవచ్చు. విష్ణువు కాలనేమిని, పర శురాముడు కార్తవీర్యుణ్ణి సం#హరించారు. సుశరుడు మృత్యువుని జయించాడు. మేఘాం గుడు అనే రాజు పిల్లలు, మనుమలతో సంతోషంగా జీవించాడు.
వృషభ వ్రతం: భానుడు వృషభరాశిలో ప్రవేశించిన మాసంలో శుద్ధాష్టమి రోజు ఈ వ్రతం ఆచరించాలి. ఈవిధంగా వృషభ వ్రతం ఆచరించినవాళ్ళు పూర్ణాయుర్దాయాన్ని, ఐశ్వర్యాన్ని, విద్యల్లో ప్రావీణ్యాన్ని, పుత్రులు మిత్రులు కళత్రము, బంధువులతో ఆనందాన్ని పొందుతారు. ముకుందుడు గరుడ వాహనాన్ని, ఇంద్రుడు ఐరావతాన్ని, అగ్నిమేష వాహ నాన్ని, యముడు సైరభాన్ని, నైరుతి నర వాహనాన్ని, వరుణుడు మకర వాహనాన్ని, వాయుదేవుడు లేడిని, కుబేరుడు పుష్పకాన్ని, సూర్యుడు ఏకచక్ర సప్తాశ్వరథాన్ని, చంద్రు డు మణులతో పొదగబడిన బంగారు విమానాన్ని, మహర్షులు అష్టసిద్ధుల్ని పొందారు.
ప్రదోష వ్రతం (శివ పూజ): సాయంసంధ్యా కాలాన్ని ప్రదోషకాలం అంటారు. సా. 6 గంటల నుంచి 7.30 మధ్య ఉండే ఈ ప్రదోషకాలం శివభక్తులకు, నృసిం#హ భక్తులకు ముఖ్యమైనది. ఏకాదశి వ్రతం లాగే శివభక్తులు త్రయోదశి (ప్రదోష ) వ్రతం చేస్తారు. త్రయో దశి వ్రతం చేస్తే శివుడు. ప్రసన్ననుడు అవుతాడు. సర్వ సంపదలను అనుగ్రహ స్తాడు. శ్రద్ధగా చేస్తే భోగభాగ్యాలు కొదవ ఉండదని పురాణ వచనం.
ఈ శివవ్రతాల్ని ఆచరిస్తే ఇ#హ లోకంలో సుఖసం తోషాలు, చివరికి జన్మరాహత్యాన్ని పొందుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement